»   » ‘మగధీర’ను మించిపోనున్న బాలయ్య ‘సింహా’!

‘మగధీర’ను మించిపోనున్న బాలయ్య ‘సింహా’!

Posted By:
Subscribe to Filmibeat Telugu

'లక్ష్మీనరసింహా" తర్వాత ఇప్పటివరకు హిట్టివ్వలేకపోయినా కానీ బాలకృష్ణ క్రేజ్ కి వచ్చిన ఢోకా లేదు. మళ్లీ బాలయ్య నుంచి మంచి సినిమా వస్తే బాక్సాఫీస్ ని షేకాడిద్దామని నందమూరి అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. త్వరలో విడుదలకి సిద్దమవుతోన్న బాలయ్య చిత్రం 'సింహా" ఇన్నాళ్ల ఎదురుచూపులకి తగ్గ బహుమానం ఇస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇందుకు తగ్గట్టే ట్రేడ్ సర్కిల్స్ లోనూ ఈ సినిమా పై అంచనాలు భారీగానే ఉన్నాయి.

'సింహా" గా బాలయ్య గెటప్ ఆసక్తిని రెట్టింపు చేస్తోంటే, దర్శకుడు బోయపాటి శ్రీను ట్రాక్ రికార్డ్ కూడా కమర్షియల్ హిట్ ఖాయమనే నమ్మకాన్ని పెంచుతోంది. ఓవర్సీస్ బిజినెస్ లో 'సింహా" ఇప్పటికే సంచలనం సృష్టించింది. 'మగధీర"ని విడుదల చేసిన సుప్రీమ్ రాజు భారీ మొత్తానికి 'సింహా" ఓవర్సీస్ రైట్స్ తీసుకుని భారీ లెవల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్టుగా జరిగి ఈ సినిమా సూపర్ హిట్ అయితే మగధీర రికార్డును షేక్ చేసిపడేస్తుందని ట్రేడ్ వర్గాల సమాచారం.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu