twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలకృష్ణ టాప్ 10 ఫిల్మ్స్ (పుట్టిన రోజు స్పెషల్)

    By Srikanya
    |

    హైదరాబాద్: బాలకృష్ణ అభిమానులకు ఈ రోజు నిజంగా పండగరోజే. ఎందుకంటారా ఈ రోజు బాలకృష్ణ పుట్టిన రోజు. 54వ పడిలోకి అడుగుపెడుతున్నారాయన.

    నటుడిగా నాలుగు దశాబ్ధాల ప్రయాణాన్ని పూర్తి చేసుకొన్నారు బాలకృష్ణ. ఇప్పుడు ఆయన వందో సినిమాకి చేరువలో ఉన్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్నది 99వ సినిమా.

    'సింహా' లాంటి సంచలన విజయం తర్వాత మళ్లీ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్నారు బాలకృష్ణ. 'సింహా' తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలిసి చేస్తున్న చిత్రమిదే. సోమవారం( ఈ రోజు) బాలకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకొని షూటింగ్ ప్రారంభమవుతుంది. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ధట్స్ తెలుగు శుభాకాంక్షలు తెలుపుతూ...

    టాప్ 10 చిత్రాలు ... స్లైడ్ షో...

    మంగమ్మ గారి మనవడు

    బ్యానర్ : భార్గవ్ ఆర్ట్స్
    డైరక్టర్ : కోడి రామకృష్ణ
    నిర్మాత : ఎస్.గోపాల్ రెడ్డి
    విడుదల సంవత్సరం: 1984

    ‘మంగమ్మగారి మనవడు'. సినిమా శ్లాబ్‌లో కొట్టుమిట్టాడుతున్న రోజుల్లో విడుదలైన ఆ సినిమా సంచలనాలకు కేంద్రబిందువు అయ్యింది. 500 రోజులు ప్రదర్శితమై ఎన్టీఆర్ వారసుడి సత్తా ఏంటో తెలియజేసింది.

    అనసూయమ్మగారి అల్లుడు

    బ్యానర్ : రామకృష్ణ స్టూడియోస్
    డైరక్టర్ : కోదండ రామిరెడ్డి
    నిర్మాత : నందమూరి జయకృష్ణ
    విడుదల సంవత్సరం: 1986

    హోమ్ ప్రొడక్షన్ లో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో ఓ సంచలనం. పొగరుమోతు అత్త తో అల్లుడు సవాల్ తో నడిచే ఈ చిత్రం ఇప్పటికీ బాలయ్య అభిమానులను అలరిస్తూనే ఉంటుంది. బాలయ్యలోని స్టామినా ఏంటో భాక్సాఫీస్ వద్ద తేల్చి చెప్పిన చిత్రం ఇది.

    సీతారాముల కళ్యాణం

    బ్యానర్ : యువ చిత్ర వారి
    డైరక్టర్ : జంథ్యాల
    నిర్మాత : కె.మురారి
    విడుదల సంవత్సరం: 1987

    1986-87లో బాలకృష్ణ వరసగా భాక్సాఫీస్ వద్ద 5 హిట్స్ ఇచ్చి రికార్డ్ క్రియేట్ చేసారు. దేశోధ్దారకుడు, అనసూయమ్మగారి అల్లుడు, కలియుగ కృష్ణుడు, సీతారామ కళ్యాణం, అపూర్వ సహోదరులు. ఇక సీతారామ కళ్యాణం చిత్రం..ఫ్యాన్స్ కు అతీతంగా అందరూ చూసి ఆనందించారు రికార్డ్ బ్రేక్ కలెక్షన్స్ అందించారు. రాళ్ళల్లో ఇసుకల్లో పాట ఇప్పటికీ మారు మ్రోగుతూనే ఉంటుంది.

    ముద్దుల మామయ్య

    బ్యానర్ : భార్గవ ఆర్ట్స్
    డైరక్టర్ : కోడి రామకృష్ణ
    నిర్మాత : ఎస్.గోపాల్ రెడ్డి
    విడుదల సంవత్సరం: 1989

    తమిళ రీమేక్ గా వచ్చి సూపర్ హిట్టైన చిత్రం ముద్దుల మామయ్య. ఎన్టీఆర్ రక్త సంభందం లాంటి అన్న -చెల్లెళ్ళ సెంటిమెంట్ ని బలంగా చూపిన ఈ చిత్రం బాలయ్యకు ఫెరఫెక్ట్ ఫిల్మ్ గా రికార్డులు క్రియేట్ చేసి నిలిచిపోయింది.

    ఆదిత్యా 369

    బ్యానర్ : శ్రీదేవి ఆర్ట్ మూవీస్
    డైరక్టర్ : సింగీతం శ్రీనివాసరావు
    నిర్మాత : అనిత ప్రసాద్
    విడుదల సంవత్సరం: 1991

    మాస్ హీరోకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిన బాలయ్య...ఓ సైన్స్ ఫిక్షన్ చిత్రం ఒప్పుకోవటం అందరికీ ఆశ్చర్యం. ముఖ్యంగా ఈ చిత్రంలో శ్రీకృష్ణ దేవరాయులు గెటప్ ఎవరూ మర్చిపోలేరు. జానవులే.., రాసలీల వేళ పాటలు అప్పట్లో మెగా హిట్.

    రౌడీ ఇన్సపెక్టర్

    బ్యానర్ : విజయలక్ష్ణి ఆర్ట్ మూవీస్
    డైరక్టర్ : బి . గోపాల్
    నిర్మాత : టి. త్రివిక్రమరావు
    విడుదల సంవత్సరం: 1992

    ఎన్టీఆర్ తో జస్టిస్ చౌదరి వంటి హిట్ ఇచ్చిన బ్యానర్ లో బాలయ్య చేసిన సినిమా ఇది. అంతకు ముందు లారీ డ్రైవర్ వంటి సూపర్ హిట్ ఇచ్చిన బి.గోపాల్ తో చేసిన ఈ చిత్రం సంచలన విజయం సాథించింది. ఎక్కడ విన్నా ఈ పాటలే వినపడేవి. విజయశాంతి కూడా ఈ సినిమాలో అదరకొట్టింది.

    భైరవ ద్వీపం

    బ్యానర్ : చందమామ విజయ కంబైన్స్
    డైరక్టర్ : సింగీతం శ్రీనివాసరావు
    నిర్మాత : బి.విశ్వనాథ రెడ్డి
    విడుదల సంవత్సరం: 1994

    మిస్సమ్మ, మాయాబజార్, గుండమ్మ కథ వంటి ఎన్నో ఆణిముత్యాలు అందించిన "విజయ" బ్యానర్ అంటే తెలియదు. వారు చాలా గ్యాప్ తర్వాత అంటే దాదాపు 20 సంవత్సరాల తర్వాత చేసిన చిత్రం ఇది. జానపద చిత్రం గా వచ్చిన ఈ చిత్రం బాలయ్య ఎలాంటిపాత్ర కైనా ప్రాణం పోస్తాడని ప్రూవ్ చేసింది.

    సమర సింహా రెడ్డి

    బ్యానర్ : శ్రీ సత్యనారాయణమ్మ ప్రొడక్షన్స్
    డైరక్టర్ : బి.గోపాల్
    నిర్మాత : చంగల వెంకట్రావు
    విడుదల సంవత్సరం: 1999

    బాలకృష్ణ పని అయిపోయింది...అనుకున్న టైమ్ లో మిస్సైల్ లా దూసుకు రావటానికి దోహదం చేసిన చిత్రం ఇది. ఇప్పటికీ ఈ చిత్రం నుంచి తెలుగు సినిమా ప్రేరణ పొందుతోందంటే ఈ చిత్రం గొప్పతనం ఏమిటో ఆర్దం చేసుకోవచ్చు. రాయలసీమ ఫ్యాక్షన్స్ మీద ఓ రివేంజ్ స్టోరీని అల్లి బాలయ్య నటనతో ఘన విజయం సాధించారు.

    నరసింహ నాయుడు

    బ్యానర్ : వెంకట రమణ ప్రొడక్షన్స్
    డైరక్టర్ : బి.గోపాల్
    నిర్మాత : మేడికొండ మురళి కృష్ణ
    విడుదల సంవత్సరం: 2001

    భాక్సాఫీస్ కు సెన్సేషనల్ హిట్ అనేది తెలియచేసిన చిత్రం ఇది. ఫ్యామిలీ సెంటిమెంట్ కు కుటుంబాల పగ ను కలిసి అల్లిన ఈ కథ బాలకృష్ణ కెరీర్ లో విపరీతమైన ఊపు తెచ్చింది. చాలా కాలం తర్వాత 275 ఆడిన సినిమా ఇది.

    సింహా

    బ్యానర్ : యునైటెడ్ మూవీస్
    డైరక్టర్ : బోయపాటి శ్రీను
    నిర్మాత : పరుచూరి కిరీటి
    విడుదల సంవత్సరం: 2010


    బాలకృష్ణకు వరస ఫ్లాపులు..బాలయ్యతో సినిమా అంటే కష్టం అంటూ అంతా చేతులు ఎత్తేస్తున్నారు. అయితే సరైన సినిమా పడితే బాలకృష్ణ ఎప్పుడూ భాక్సాఫీస్ సింహమే...అని ప్రూవ్ చేసిన చిత్రం ఇది.

    English summary
    
 Nandamuri Balakrishna Celebrating his birthday today ( Monday June 10). The actor will be in Hyderabad for the Muhurat launch of his upcoming film to be directed by Boyapati Sreenu. Born to late Sri Nandamuri Taraka Rama Rao, Balakrishna is known for his high voltage roles and powerful dialogues.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X