»   » అమెరికాలో బాలకృష్ణ .. షెడ్యూల్ డిటేల్స్

అమెరికాలో బాలకృష్ణ .. షెడ్యూల్ డిటేల్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu
వాషింగ్టన్‌ : సినీనటుడు నందమూరి బాలకృష్ణ శుక్రవారం అమెరికా చేరుకున్న సంగతి తెలిసిందే. న్యూయార్క్‌లోని జాన్‌ఎఫ్‌ కెనడీ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు పలువురు ప్రవాసాంధ్ర ప్రముఖులు స్వాగతం పలికారు. ఆయన ఇక్కడ 10 రోజులు పర్యటించనున్నారు.

డెలావేర్‌ వ్యాలీ తెలుగు సంఘం 40వ వార్షికోత్సవంలో ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఈ నెల 30న బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రి కోసం కనెక్టికట్‌లో నిర్వహించే విరాళాల సేకరణ కార్యక్రమంలో పాల్గొంటారు. జులై 4, 5, 6 తేదీల్లో డల్లాస్‌లో నిర్వహించే నాట్స్‌ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా రూపొందిస్తున్న తాజా చిత్రం జూలై రెండవ వారం నుంచి దుబాయి లో ప్రారంభం కానుంది. అక్కడ ఎడారిలో స్పెషల్ ఛేజ్ సీక్వెన్స్ లు ప్లాన్ చేసినట్లు చెప్తున్నారు. సినిమాకు హైలెట్ అయ్యే ఆ సీన్స్ ప్రారంభంలోనే తియ్యాలని బోయపాటి నిర్ణయించుకుని ప్లాన్ చేసాడని తెలుస్తోంది.

వారాహి చలన చిత్రం సమర్పణలో 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్ సంస్థ ఈచిత్రాన్ని ప్రొడక్షన్ నెం.4గా నిర్మిస్తోంది. హైదరాబాద్‌లోని 14రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ సంస్థ కార్యాలయంలో పార్మల్ పూజా కార్యక్రమం జూన్ 3వ తేదీనే జరిగింది. బాలయ్య జన్మదినాన్ని పురస్కరించుకుని జూన్ 10న షూటింగ్ ప్రారంభమైంది.

English summary

 Balakrishna had been in US for a fund raising campaign for Basavatarakam Indo-American Cancer Hospital and Research Centre (BIACHRC).
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu