Don't Miss!
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- News
అమెరికాలో మరోసారి కాల్పులు: ముగ్గురు మృతి, నలుగురికి తీవ్రగాయాలు
- Sports
పని పాట లేని వెదవలు క్రియేట్ చేసే స్టోరీలు.. బాబర్ నాకు కొడుకుతో సమానం: వసీం అక్రమ్
- Finance
air india: చరిత్ర సృష్టించనున్న ఎయిర్ ఇండియా.. ప్రపంచంలో అలా చేస్తున్న మొదటి సంస్థ టాటానే..
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
Balakrishna: సంక్రాంతి బరిలో 'వీర సింహా రెడ్డి', విడుదల తేది ప్రకటన.. ఆ ముగ్గురితో బాలయ్య పోటీ
నందమూరి నటసింహం బాలకృష్ణ మళ్లీ బాక్సాఫీస్ పై వేటకు సిద్ధమయ్యాడు. ఇటీవల అఖండ మూవీతో సాలిడ్ హిట్ కొట్టిన బాలయ్య బాబు మరోసారి హంట్ మొదలుపెట్టనున్నాడు. క్రాక్ చిత్రంతో సూపర్ సక్సెస్ సాధించిన గోపిచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య హీరోగా తెరకెక్కిన చిత్రం వీర సింహా రెడ్డి. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం విడుదల తేదిని తాజాగా మేకర్స్ ప్రకటించారు. ఆ వివరాల్లోకి వెళితే..

సినిమాల విజయంతో జోష్..
మాస్ డైరెక్టర్ గోపిచంద్ మలినేనే దర్శకత్వంలో బాలయ్య బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం వీర సింహా రెడ్డి. ఇటీవల ఇటు బాలకృష్ణ అఖండ సినిమాతో, అటు గోపిచంద్ మలినేని క్రాక్ మూవీతో మంచి జోష్ మీదున్నారు. ఇక వీరిద్దరి కలయికలో సినిమా వస్తుందనే టాపిక్ రాగానే నందమూరి అభిమానులు, మాస్ ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన షూటింగ్ స్పాట్ పిక్స్, వీడియోలు తెగ వైరల్ అయ్యాయి.

ఫ్యాక్షన్ నేపథ్యంలో సినిమా..
ఇక వీర సింహారెడ్డి టైటిల్ పోస్టర్, నందమూరి నటసింహం బాలకృష్ణ గెటప్, టీజర్ అభిమానులను, ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇటీవల విడుదలైన జై బాలయ్య పాటతో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఈ సినిమా ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన విషయం తెలిసిందే. ఫ్యాక్షన్ సినిమాలు అంటే ముందుగా గుర్తొచ్చేది గతంలో బాలకృష్ణ నటించిన సమర సింహారెడ్డి, నరసింహా నాయుడు చిత్రాలు. ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఎంతపెద్ద హిట్ అయ్యాయో తెలిసిందే.

సింహా టైటిల్ సెంటిమెంట్..
ఇక బాలకృష్ణ సినిమాలకు సింహా అనే టైటిల్ ఉండటం సెంటిమెంట్ గా ఉంది. సింహా అనే టైటిల్ తో వచ్చిన సినిమాలన్ని దాదాపుగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. ఇప్పుడు ఈ వీర సింహా రెడ్డిలో కూడా అదే టైటిల్ ఉండటంతో సెంటిమెంట్ ప్రకారం సూపర్ హిట్ అవుతుందని అభిమానులు నమ్మకంగా ఉన్నారు. టైటిల్ మాత్రమే కాకుండా సినిమాలో కూడా కంటెంట్ ఉంటుందని, గోపీచంద్ దర్శకత్వ పటిమ గురించి తెలిసిందేనని చర్చించుకుంటున్నారు.

సంక్రాంతి బరిలోకి..
బాలకృష్ణ
107వ
సినిమా
వీర
సింహా
రెడ్డి
విడుదల
తేదిని
తాజాగా
ప్రకటించారు
మేకర్స్.
జనవరి
12
ప్రపంచవ్యాప్తంగా
గ్రాండ్
గా
రిలీజ్
చేస్తున్నాట్లు
సోషల్
మీడియా
ద్వారా
వెల్లడించారు.
అనేక
అంచనాల
మధ్య
సంక్రాంతి
బరిలో
నిలవనుంది
బాలకృష్ణ
వీర
సింహా
రెడ్డి.
అయితే
ముందు
నుంచే
ఈ
తేదీనే
విడుదల
చేస్తారని
తెలిసిందే.
కాకపోతే
ఈరోజు
అధికారికంగా
సోషల్
మీడియా
ద్వారా
ప్రకటించారు.

రేసులో ముగ్గురు హీరోలు.
.
బాలకృష్ణ వీర సింహా రెడ్డి సంక్రాంతి బరిలోకి దిగడంతో హీరోల మధ్య గట్టి పోటి ఏర్పడనుంది. ఇప్పటికే సంక్రాంతి బరిలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ, రష్మిక మందన్నా వారసుడు వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కూడా జనవరి 12న విడుదల అయేందుకు సిద్ధంగా ఉంది. అలాగే జనవరి 13న మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్యగా రాబోతున్నాడు. ఇందులో రవితేజ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. అంటే చిరంజీవి, రవితేజ కలిసి పోటీ పడనున్నారు.
|
సంక్రాంతి బరిలో పెద్ద హీరోలు..
ఇలా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో బడా హీరోలు పోటీ పడనున్నారు. బాలకృష్ణ, చిరంజీవి, విజయ్ పోటీలు ఉండటంతో ఈ సంక్రాంతి రసవత్తరంగా ఉండనుంది. అయితే ఏ హీరో సినిమాకు ఎలాంటి ఓపెనింగ్స్ వస్తాయో.. ఎలాంటి టాక్ వస్తుందో సంక్రాంతి వరకు వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే వీర సింహా రెడ్డి సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటించింది. దునియా విజయ్, వరలక్ష్మీ శరత్ కుమార్, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.