Just In
- 18 min ago
మనం 2లో మరో ఇద్దరు యువ హీరోలు.. స్టోరీ ఎంతవరకు వచ్చిందంటే?
- 27 min ago
విడుదలకు ముందే బయటకు: ‘ఆచార్య’ టీజర్ హైలైట్స్ ఇవే.. చివరి ఐదు సెకెన్స్ అరాచకమే!
- 1 hr ago
అల్లు అర్జున్ ‘పుష్ప’ రిలీజ్ డేట్ ప్రకటన: అదిరిపోయిన కొత్త పోస్టర్.. ఆ రూమర్లకు కూడా చెక్
- 1 hr ago
‘రాధే శ్యామ్’ టీజర్ డేట్ ఫిక్స్: అదిరిపోయే స్పెషల్ డేను లాక్ చేసిన ప్రభాస్
Don't Miss!
- News
మదనపల్లె కేసు రిమాండ్ రిపోర్ట్ లో షాకింగ్ అంశాలు .. పూజ గదిలో బూడిద, కత్తిరించిన జుట్టు, గాజు ముక్కలు
- Sports
టీమిండియా ఆత్మవిశ్వాసం అమాంతం పెరిగింది.. ఓడించడం కష్టమే: ఇంగ్లండ్ మాజీ కోచ్
- Automobiles
ఇండియా To సింగపూర్ : బస్లో వెళ్లి వచ్చేద్దామా.. మీరు విన్నది నిజమే.. చూడండి
- Finance
Gold prices today: వరుసగా 5వ రోజు తగ్గిన బంగారం ధరలు, రూ.7500 తక్కువ
- Lifestyle
తక్కువ సమయంలో చర్మాన్ని క్లియర్ చేయడానికి ఉపయోగించే ముందు ఇది తెలుసుకోవాలి
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బాలయ్య సినిమాపై బాలసుబ్రహ్మణ్యం కామెంట్స్
బాలయ్య రాముడి పాత్రలో రూపొందిన పౌరాణిక సినిమా 'శ్రీరామ రాజ్యం" ఇటీవల విడుదలై మంచి హిట్ టాక్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. బాలయ్య సీనియర్ ఎన్టీఆర్ పేరు నిలబెట్టారని, పౌరాణిక సినిమాలంటే కేవలం నందమూరి హీరోలే అని మరోసారి రుజువైందని అభిమానులు ఆంనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ సినిమాపై ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్.పి. బాల సుబ్రహ్మణ్యం తన మనసులోని మాటను బయట పెట్టారు. తన జీవితంలో కేవలం నాలుగైదు సందర్భాల్లో మాత్రమే ఆనంద పడ్డా. తాజాగా మళ్లీ నాకు ఆ ఆనందం శ్రీరామ రాజ్యం సినిమా చూసిన తర్వాత దక్కించింది అని పేర్కొన్నారు. ఈ సినిమా నాకు పునరుత్సాహాన్ని ఇచ్చిందని బాలు పేర్కొన్నారు. ఇంత అద్భుతమైన సినిమా రూపొందించిన బాపు గారికి పాదభివందం చేస్తున్నా, తెలుగుజాతి ఆయనకు రుణపడి ఉంటారని పేర్కొన్నారు. అదేవిధంగా బాలయ్య, నయన తార, నాగేశ్వరరావు తదితరుల నటన అద్భుతంగా ఉందని బాలు ప్రసంసించారు.
పౌరాణిక సినిమా అయినప్పటికీ బాలయ్య కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ నేపథ్యంలో శ్రీరామ రాజ్యం సినిమా సూపర్ కలెక్షన్లతో దూసుకెలుతోంది. మరో హీరో నటించి ఉంటే సినిమాకు ఇంత హైప్ వచ్చేది కాదని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ముఖ్యంగా నయనతార నటన సినిమాకు హైలెట్ గా నలిచిందని, అభినవ సీతగా నయనతార అందరి మన్ననలు అందుకుంటోంది. శ్రీరామ రాజ్యం సినిమాను శ్రీసాయి బాబా మూవీస్ బ్యానర్ పై యలమంచిలి సాయిబాబు నిర్మించారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజ ఈ సినిమాకు సంగీతం సమకూర్చారు.