»   » జబర్దస్త్ న్యూస్ బాలయ్య గ్యాంగ్‌స్టర్ అట : బిజినెస్ మ్యాన్ 2 ఇదేనా???

జబర్దస్త్ న్యూస్ బాలయ్య గ్యాంగ్‌స్టర్ అట : బిజినెస్ మ్యాన్ 2 ఇదేనా???

Posted By:
Subscribe to Filmibeat Telugu

డైరెక్టర్ పూరీ జగన్నాథ్ సినిమాలను ఎంత వేగంగా పూర్తి చేస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తక్కువలో తక్కువ ఆరునెలల్లోనే సినిమాను పూర్తి చేసేస్తాడు పూరీ. ఇప్పుడు బాలయ్యతో సినిమా విషయంలోనూ అదే జోరును కొనసాగిస్తున్నాడు పూరీ. పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమా, మొదటి షెడ్యూల్ పూర్తిచేసుకుని రెండవ షెడ్యూల్ కి రెడీ అవుతోంది. వచ్చేనెల 5వ తేదీ నుంచి ఈ సినిమా రెండవ షెడ్యూల్ మొదలుకానుంది.

ఉస్తాద్ అనే టైటిల్

ఉస్తాద్ అనే టైటిల్

ఈ సినిమాలో బాలకృష్ణను పూరీ ఎలా చూపించనున్నారు? అనే ఆసక్తి అందరిలోను వుంది. ఈ సినిమాకి మొదట్లో ఉస్తాద్ అనే టైటిల్ నిర్ణయం జరిగిందీ అంటూ ప్రచారం జరిగింది. అయితే మళ్ళీ అంతలో "తపోరీ" అనే ఒక వింత టైటిల్ ప్రచారం లోకి వచ్చింది.

క్లారిటీ ఇవ్వాలనే ఆలోచనలో

క్లారిటీ ఇవ్వాలనే ఆలోచనలో

అయితే ఇప్పటివరకూ అధికారికంగా మాత్రం ఏ పేరు అన్నది ఇంకా ప్రకటించక పోవటం తో అంతా ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు. రెండవ షెడ్యూల్ సమయానికి కథానాయిక విషయంలోను .. టైటిల్ విషయంలోను క్లారిటీ ఇవ్వాలనే ఆలోచనలో పూరీ వున్నాడని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో బాలకృష్ణ రఫ్ అండ్ టఫ్ గా కనిపిస్తాడంటూ, ఈ సినిమాపై పూరీ ఆసక్తిని రేకెత్తించాడు.

తొలి షెడ్యూల్ షూటింగ్ పూర్తైపోయింది

తొలి షెడ్యూల్ షూటింగ్ పూర్తైపోయింది

‘‘బాలయ్య 101వ సినిమా తొలి షెడ్యూల్ షూటింగ్ పూర్తైపోయింది. ఓ భారీ సెట్‌లో యాక్షన్ సన్నివేశాన్ని షూట్ చేశాం. నందమూరి అభిమానులకు విందు భోజనంలా సినిమా ఉంటుంది'' అని పూరీ ఇటీవలే ట్వీట్ చేశాడు. ఇంత వేగంగా తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసిన పూరీ.. సినిమానూ అంతే వేగంగా పూర్తి చేస్తాడా..? అనుకున్న సెప్టెంబరు 29 డెడ్‌లైన్‌ను అందుకుంటాడేమో చూడాలి.

గ్యాంగ్‌స్టర్ గా

గ్యాంగ్‌స్టర్ గా

ఇక లేటెస్ట్ గా పూరి తాను బాలయ్యతో తీయబోతున్న సినిమా విషయమై ఇస్తున్న లీకులు ఈ విషయాన్ని మరింత బలపరుస్తున్నాయి. ఈ మూవీలో బాలకృష్ణ ఒక గ్యాంగ్‌స్టర్ గా కనిపించబోతున్నాడని టాక్. దీనికోసం బాలయ్య గెటప్ హెయిర్ స్టైల్ బాడీ లాంగ్వేజ్ ఇలా అన్ని విషయాలలోను మార్పులు చేయడానికి పూరి భారీ ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో తాను గతం లో తీయాలనుకున్న బిజినెస్ మ్యాన్ 2 కథ ఇదేనా? అన్న ఆసక్తి కూడా మొదలయ్యింది..

రఫ్ అండ్ టఫ్ గా

రఫ్ అండ్ టఫ్ గా

తాజాగా పూరీ మాట్లాడుతూ .. ఈ సినిమాలో బాలకృష్ణ రఫ్ అండ్ టఫ్ గా ... మరింత యంగ్ గా కనిపించనున్నాడని అన్నాడు. గ్యాంగ్ స్టర్ తరహాలో ఆయన పాత్ర వుంటుందని చెప్పాడు. ఈ సినిమాలో పొలిటికల్ పంచ్ లు వుండవనీ, సహజసిద్ధమైన తీరులో ఆయన పాత్ర వుంటుందని అన్నాడు. బాలకృష్ణ అభిమానులు ఆయన నుంచి కొత్తగా కోరుకునే అంశాలు ఈ సినిమాలో వుంటాయని చెప్పాడు.

English summary
Nandamuri Balakrishna is playing a gangster in director Puri Jagannadh's film that is currently under progress."It is true that he is playing a gangster. But the characterisation is totally different from other gangster movies," Puri Jagannadh confirmed.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu