»   » ఓ రేంజిలో ఇరగదీసారు: బాలయ్య...'గౌతమి పుత్ర శాతకర్ణి ' టీజర్ (వీడియో)

ఓ రేంజిలో ఇరగదీసారు: బాలయ్య...'గౌతమి పుత్ర శాతకర్ణి ' టీజర్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : నందమూరి బాలకృష్ణ, క్రిష్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న గౌతమి పుత్ర శాతకర్ణి చిత్ర మొన్న ఘనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే.
బాలయ్య అత్యంత ప్రతిష్మాత్మకంగా ఈ చిత్రాన్ని భావించి పనిచేస్తున్నారు. అభిమానులు సైతం ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Balayya's GautamiPutra Satakarni Movie -Fan Made Teaser

ఈ నేపధ్యంలో కొంతమంది అభిమానులు తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఫ్యాన్ మేడ్ ఫస్ట్ లుక్‌ టీజర్ ని విడుదల చేశారు. ఇది అభిమానులను ఎంతగానో ఆకర్షిస్తుంది. ఒరిజనల్ గా రెడీ చేసి వదిలిన టీజరా అన్నట్లుగా ఇది ఉండటం గురంచే అందరూ మాట్లాడుకుంటున్నారు. మీరూ ఈ టీజర్ ని చూసి మీ అభిప్రాయం క్రింద కామెంట్ల రూపంలో పంచుకోండి.

బాలకృష్ణ మాట్లాడుతూ.... భారతదేశాన్ని ఏకఛత్రాధిపత్యం క్రింద పరిపాలించిన మహా చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి. తెలుగు వారందరూ తెలుసుకోవాల్సిన గొప్ప చరిత్ర ఇది. నాన్నగారు ఈ పాత్ర చేయాలని భావించి ఆరు నెలల పాటు స్క్రిప్ట్ వర్క్ చేశారని తెలిసింది.
ఆయన చేయలేకపోయిన పాత్ర నన్ను వరించడం అదృష్టంగా భావిస్తున్నాను. గౌతమీపుత్ర శాతకర్ణి శాంతి కోసం యుద్ధాలు చేశారు. ఛత్రపతి శివాజీతో సహా అనేకమంది రాజులకు ఆదర్శంగా నిలిచారని అన్నారు.

English summary
Here is the fan-made teaser of Nandamuri Balakrishna’s upcoming movie Gauthami Puta Satakarni directed by Krish Jagarlamudi and produced by Saibabu Jagarlamudi & Y. Rajeev Reddy.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu