»   » ఇదిరా రాజసం : బాలయ్య ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ఫస్ట్ లుక్ పోస్టర్

ఇదిరా రాజసం : బాలయ్య ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ఫస్ట్ లుక్ పోస్టర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: కథ, పాత్ర నచ్చితే ఎలాంటి ప్రయోగం చేయడానికైనా ఎప్పుడూ సిద్ధంగా ఉండే బాలకృష్ణ హీరోగా దర్శకుడు క్రిష్‌ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి'. రెండో శతాబ్దానికి చెందిన గౌతమిపుత్ర శాతకర్ణి జీవితం ఆధారంగా రూపొందిస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణ రాజసం ఉట్టిపడేలా ఉన్న ఫొటోను చిత్ర యూనిట్ శనివారం విడుదల చేసింది. సింహాసనంపై బాలకృష్ణ కూర్చొని ఉన్న ఈ ఫొటో అభిమానులను అలరిస్తోంది.

శ్రియ, హేమమాలిని, కబీర్‌బేడీ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఫస్ట్‌ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై వై. రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిరంతన్‌ భట్‌ స్వరాలు అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా 'గౌతమిపుత్ర శాతకర్ణి'ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.

ఇక బిజినెస్ విషయానికి వస్తే.. విభిన్న చిత్రాల దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా షూటింగ్ కు వెళ్లకముందు నుంచి ట్రేడ్ వర్గాల్లో ఎంక్వైరీ మొదలైంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు అప్పట్నుంచే ప్రీ రిలీజ్ బిజినెస్ పెద్ద ఎత్తున మొదలైంది.

తాజాగా ఈ సినిమా సీడెడ్ హక్కులు రికార్డు ధరకు అమ్ముడైనట్లు సమాచారం. ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి 'గౌతమిపుత్ర శాతకర్ణి' సీడెడ్ హక్కులను సుమారు 9 కోట్ల రూపాయలకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయమై టీమ్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కొర్రపాటి సాయి సీన్ లోకి వచ్చి ఆ రేటు పెట్టడంతో మిగతా ఏరియాల బిజినెస్ సైతం స్పీడుగా అనుకున్న రేటుకే జరుగుతోందని నిర్మాతలు ఖుషీగా ఉన్నారట.

చారిత్రక నేపథ్యంలో సాగే శాతకర్ణి జీవిత కథతో రూపొందుతోన్న ఈ సినిమాను, క్రిష్, భారీ బడ్జెట్‌తో స్వయంగా నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12, 2017న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

వీటికి తోడు తన మూవీ గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రంతో ఓవర్సీస్ కలెక్షన్స్ లోనూ రికార్డులు సృష్టించేందుకు బాలయ్య ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ యూఎస్ లో బాలయ్య కనీసం అర మిలియన్ మార్క్ ను కూడా టచ్ చేయలేదు. కానీ గౌతమిపుత్ర శాతకర్ణి మూవీని మిలియన్ డాలర్ క్లబ్ లో చేర్చేలా ప్లానింగ్స్ జరుగుతున్నాయి.

దర్శకుడు క్రిష్ కు ఓవర్సీస్ లో మంచి పేరు ఉంది. పైగా గౌతమిపుత్ర శాతకర్ణికి క్రిష్ తండ్రి అతని స్నేహితుడే నిర్మాతలు కావడంతో.. అన్ని ఏరియాల్లోనూ కలెక్షన్స్ కుమ్మేసేలా ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు.

మరో ప్రక్క యుద్ధ సన్నివేశాలు.. ఈ మూవీకి హైలైట్ కానున్నాయని తెలుస్తోంది. అసలు వీటి విషయంలో కాంప్రమైజ్ కాకూడదనే ఉద్దేశ్యంతోనే.. మొదట మొరాకో.. జార్జియా షెడ్యూల్స్ ను ఫినిష్ చేశాడట దర్శకుడు. ఆ దేశాల్లో తెరకెక్కించిన యుద్ధాల సీక్వెన్స్ లపై ప్రస్తుతం 4 గ్రాఫిక్స్ టీమ్ లు వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ చివరి నాటికల్లా శాతకర్ణి షూటింగ్ పూర్తయిపోతుందని అంటున్నారు.

అక్కడి నుంచి పోస్ట్ ప్రొడక్షన్ పనులు.. గ్రాఫిక్ వర్క్స్ ను చూసుకుంటూ.. డిసెంబర్ చివరి వారంలో ఆడియో రిలీజ్ చేసేలా ప్లాన్ చేసిందట శాతకర్ణి యూనిట్. వచ్చే ఏడాది పొంగల్ స్పెషల్ గా రిలీజ్ కానున్న శాతకర్ణి.. బాలయ్య కెరీర్ లోనే స్పెషల్ గా నిలిచిపోయేందుకు క్రిష్ చాలా ప్రయత్నిస్తున్నాడు.

English summary
The makers of upcoming Telugu period-drama "Gauthamiputra Satakarni", which happens to be actor Nandamuri Balakrishna's 100th film, released first look photo today.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu