»   » 19 ఏళ్ళ అమ్మాయి 10 ఏళ్ళ అబ్బాయి హనీమూన్: ఆ టీవీ సీరియల్ ఆపండీ

19 ఏళ్ళ అమ్మాయి 10 ఏళ్ళ అబ్బాయి హనీమూన్: ఆ టీవీ సీరియల్ ఆపండీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

విభిన్న క‌థాంశం అన్న పేరుతో మరీ వికృతమైన సబ్జెక్ట్స్ తో వస్తున్నారు కొన్ని మరీ హద్దు మీరిన కథావస్తువులు కావటం ఇంకా దారుణం గా ఉంది. ఇప్పుడు ప్ర‌సార‌మవుతున్న హిందీ సీరియ‌ల్ "పెహ్రేదార్ పియా కీ" సీరియ‌ల్‌పై కేంద్ర జౌళి శాఖ‌, స‌మాచార ప్ర‌సారాల శాఖ మంత్రి స్మృతీ ఇరానీకి ఓ వ్య‌క్తి పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ప్రైమ్ టైమ్‌లో వ‌స్తున్న ఈ సీరియ‌ల్ పిల్ల‌ల ఆలోచ‌నా విధానాల‌ను మార్చే విధంగా ఉందని ఆ పిటిష‌న్‌లో పేర్కొన్నారు. ఇప్ప‌టికే ఈ పిటిష‌న్‌పై 36,282 మంది సంత‌కాలు చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు.

Ban Controversial Show Pehredaar Piya Ki

ఈ సీరియ‌ల్‌లో అనివార్య కార‌ణాల వ‌ల్ల ప‌దేళ్ల బాలుడిని 19 ఏళ్ల యువ‌తి పెళ్లి చేసుకోవాల్సి వ‌స్తుంది. బాలుడు అమ్మాయి నుదుట బొట్టు పెట్ట‌డం, త‌న‌ను ప్రేమిస్తున్నాన‌ని ప‌దే ప‌దే చెప్ప‌డం వంటి స‌న్నివేశాలు ప్రేక్ష‌కులను ఇబ్బంది పెట్టేలా ఉంటున్నాయి. ఈ సీరియ‌ల్ ప్రారంభానికి ముందే వ‌చ్చిన ప్రోమోల‌పై చాలా మంది అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. కాక‌పోతే జూలై 17న ప్రారంభ‌మైన ఈ సీరియ‌ల్ మొద‌టి ఎపిసోడ్ బాగుండ‌టంతో టీఆర్‌పీ పెరిగింద‌ని ఛాన‌ల్ వారు చెబుతున్నారు.

English summary
Viewers have started a petition to take Colors’ show Pehredaar Piya Ki off air. They have addressed the petition to Smriti Irani.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu