»   » మణిరత్నం సినిమాతో.... మళ్లీ తెరపైకి బండ్ల గణేష్!

మణిరత్నం సినిమాతో.... మళ్లీ తెరపైకి బండ్ల గణేష్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమలో కొన్ని రోజుల పాటు బ్లాక్ బస్టర్ నిర్మాతగా ఓ వెలుగు వెలిగిన నిర్మాత బండ్ల గణేష్ తర్వాత పరిస్థితులు తలక్రిందులై కొంతకాలంగా సినిమాలకు, సినిమా పరిశ్రమకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. చాలా కాలం కాలంగా బండ్ల గణేష్ సినిమా చేయడం లేదు. ఆ మధ్య తన కోళ్ల ఫాంలో కోడి గుడ్లు ఏరుకుంటున్న గణేష్ ను చూసి చాలా మంది అయ్యో పాపం అన్నారు.

సినిమా రంగంలో వచ్చిన నష్టాలు, కొన్ని కోర్టు వివాదాల కారణంగానే బండ్ల గణేష్ సినిమా రంగానికి దూరమైనట్లు వార్తలు వినిపించాయి. ముఖ్యంగా నటుడు సచిన్ జోషి సినిమా విషయంలో చెలరేగిన వివాదం, కోర్టు కేసు తర్వాత బండ్ల గణేష్ అసలు కనిపించడమే మానేసారు.

Bandla Ganesh Bags Telugu Rights of Maniratnam film

లాంగ్ గ్యాప్ తర్వాత బండ్ల గణేష్ మళ్లీ తెరపైకి వస్తున్నట్లు తెలుస్తోంది. ఇండియస్ ఏస్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో కార్తీ, సాయిపల్లవి జంటగా ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. జూన్ నుండి సినిమా షూటింగ్ జరుగుతుందని సమాచారం.

ఈ సినిమాకు ఎ.ఆర్.రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రారంభం కాకమునుపే ఈ సినిమా తెలుగు హక్కులను బండ్ల గణేష్ దక్కించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్నిఆయన తన సొంత బేనర్ పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై విడుదల చేయబోతున్నారట. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

English summary
Film Nagar source said that, Bandla Ganesh Bags Telugu Rights of Maniratnam next film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu