»   »  పవన్ దేవుడు.. రవితేజకు మోసం చేశా.. ఎన్టీఆర్‌తో నష్టం..

పవన్ దేవుడు.. రవితేజకు మోసం చేశా.. ఎన్టీఆర్‌తో నష్టం..

Posted By:
Subscribe to Filmibeat Telugu

'నా దేవుడు పవన్ కల్యాణ్‌కు ఎవరూ సహాయం చేయనవసరం లేదు. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు స్వయంగా పరిష్కరించుకోగల శక్తి సామర్థ్యాలు ఆయనకు ఉన్నాయి' అని ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ అన్నారు. ఇటీవల యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలుగు అగ్రహీరోలతో ఉన్న సంబంధాలను, పలు ఆసక్తికరమైన అంశాలను వెల్లడించారు.

Bandla Ganesh reveals his relation with Tollywood Heros

గతంలో ఓ సారి హీరో రవితేజను మోసం చేశానని ఇంటర్వ్యూలో గణేశ్ తెలిపారు. రవితేజ ఎంతో ఇష్టపడి తన వద్ద పొలం కొనుక్కున్నాడని, అయితే ఆ పొలం విషయంలో ఆయనను మోసం చేశానని పేర్కొన్నాడు. అలాగే జూనియర్ ఎన్టీఆర్‌తో చేసిన బాద్‌షా చిత్రంతో చాలా నష్టపోయానని, దాంతో ఆయనతో విభేదాలు ఏర్పడ్డాయని అన్నారు.

ఓ దర్శకుడు రాత్రంతా మందు కొడుతూ డ్రగ్స్ తీసుకొంటాడని, అలాంటి వ్యక్తితో పనిచేయడం అత్యంత దురదృష్టకరమని అన్నాడు. అయితే ఆ దర్శకుడి పేరు చెప్పడానికి నిరాకరించడం గమనార్హం. కమెడియన్ నుంచి స్టార్ ప్రొడ్యూసర్‌గా ఎదిగిన బండ్ల గణేష్ పవన్ కల్యాణ, ఎన్టీఆర్, రవితేజ, రామ్‌చరణ్, అల్లు అర్జున్ లాంటి అగ్రహీరోలతో సినిమాలు నిర్మించారు. టెంపర్ చిత్రం తర్వాత తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఒక్కసారిగా అదృశ్యమయ్యాడు.

English summary
Bandla Ganesh says Pawan Kalyan is my god
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu