»   » చిరంజీవితో సినిమా చేస్తా: కొత్త అవతారంలో బండ్ల గణేష్

చిరంజీవితో సినిమా చేస్తా: కొత్త అవతారంలో బండ్ల గణేష్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్లో బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్న బండ్ల గణేష్ నున్నగా గుండు కొట్టించుకుని దర్శనమిచ్చాడు. ఇటీవల తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లిన గణేష్ శ్రీవారికి తన తల నీలాలు సమర్పించుకుని మొక్కు తీర్చుకున్నాడు. ‘నమో వెంకటేశా నమో తిరుమలేశా' అంటూ ఓ కామెంట్ తగిలించి తన గుండు ఫోటోను పోస్టు చేసాడు.

మంగళవారం ఆయన శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. చిరంజీవి 150వ సినిమా చేస్తారా? అనే ప్రశ్నకు స్పందిస్తూ...భలే వాడివే, ఎందుకు చేయను? తప్పకుండా చేస్తాను అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మూడు పెద్ద సినిమాలు చేస్తున్నట్లు తెలిపారు. శ్రీవారిని దర్శించుకున్నప్పుడల్లా కొత్త శక్తి లభిస్తుందని చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం బండ్ల గణేష్ శ్రీను వైట్ల దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా ‘మై నేమ్ ఈజ్ రాజు' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. త్వరలో ప్రారంభం అయ్యే మెగాస్టార్ చిరంజీవ 150వ సినిమాకు కూడా గణేష్ సహ నిర్మాతగా వ్యవహరించబోతున్నాడని సమాచారం. తన కోరిక తీరడంతో శ్రీవారికి తల నీలాలు సమర్పించుకుని మొక్కు తీర్చుకున్నాడని అంటున్నారు.

Bandla Ganesh tonsured his head
English summary
Blockbuster' Producer Bandla Ganesh tonsured his head on his recent visit to Lord Venkateswara Swamy temple. 'NAMO VENKATASA NAMO TIRUMALASA,' he wrote while sharing the picture.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu