»   » ‘టెంపర్‌’ఆడియో సిడీ రిలీజైంది నిజమే

‘టెంపర్‌’ఆడియో సిడీ రిలీజైంది నిజమే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: శివబాబు బండ్ల సమర్పిస్తున్న సినిమా ‘టెంపర్‌'. పరమేశ్వర ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై రూపొందిస్తున్నారు. పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. బండ్ల గణేశ్‌ నిర్మాత. ఈ సినిమా ఆడియో ఈ నెల 28న అంటే రేపు విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు పోస్టర్స్ సైతం విడుదల చేసారు. అయితే ఆడియో సీడిని రిలీజ్ చేసామంటూ బండ్ల గణేష్ విడుదల చేసామంటూ ట్వీట్ చేసారు. ఇదేంటి అంటారా..అయితే ఈ న్యూస్ చదవాల్సిందే.

నిజానికి టెంపర్ ఆడియోని రేపు అధికారికంగా విడుదల చేస్తున్నారు. కానీ సోమవారం ..రథ సప్తమి మంచి రోజు కావటంతో సెంటిమెట్ గా నిర్మాత బండ్ల గణేష్ ఈ సీడిని రిలీజ్ చేసారు. రేపు అభిమానుల సమక్షంలో అధికారికంగా విడుదల చేసి మార్కెట్ లోకి వదులుతారన్నమాట.


ఈ విషయమై బండ్ల గణేష్ మాట్లాడుతూ..." ఈ రోజు రధ సప్తమి, ఈ రోజు చాలా మంచి రోజు. అందుకని మేము దేవాలయంలో ఈ సీడిని విడుదల చేసాం. ఆడియో పంక్షన్ ముందు ప్రకటించినట్లుగానే జనవరి 28న..మమ్మల్ని ఆశ్వీరదించండి.. ," అన్నారు.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


Bandla unvieled Temper audio CD

ఈ చిత్ర షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది..ఇదిలా ఉంటే...ఈ సినిమా ఆడియో విడుదలపై పలు తేదీలు వార్తల్లో వినిపించాయి. అయితే జనవరి 28న ఈ చిత్ర ఆడియోని విడుదల చేయడానికి ఫైనలైజ్ చేసి , సన్నాహాలు చేస్తున్నారు. సినిమా మాత్రం ఫిబ్రవరి 13న రిలీజ్‌ చేయాలని భావిస్తున్నారు.


ఇక న్యూఇయర్‌ వేడుకగా ప్రేక్షకులకు టెంపర్‌ టీజర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ టీజర్‌కు యుట్యూబ్‌లో మంచి ఆదరణతో పాటు ఒక్కరోజులోనే రెండు లక్షలకుపైగా క్లిక్స్‌ వచ్చాయంటే అభిమానులు ఏ రేంజ్‌లో ఈ సినిమాను ఆశిస్తున్నారో అర్ధమౌతుంది.


ఈ చిత్రంపై నటుడు ప్రకాష్‌రాజ్‌ తనదైన శైలిలో సోషల్‌ నెట్‌వర్క్‌లో కామెంట్లు చేశారు. ‘‘టెంపర్‌లో కొన్ని సీన్లు చూశాను. డార్లింగ్‌ తారక్‌ మెరిసాడు. పూరి, తారక్‌ కాంబినేషన్‌లో ఇంతకుముందు ఎన్నడూ లేనంత విధంగా మిమ్మల్ని ఎంటర్‌టైన్‌ చేస్తారు'' అని ట్వీట్‌ చేశారు.


అలాగే.. ‘టెంపర్‌' చిత్రంలో ఆర్‌.నారాయణమూర్తికోసం పూరి ఓ అద్భుతమైన పాత్ర డిజైన్‌ చేశాడట. దీనికోసం నారాయణ మూర్తిని సంప్రదిస్తే అతను దానిని రిజెక్ట్‌ చేశాడని సమాచారం. ఆర్‌.నారాయణమూర్తికి పూరి పెద్ద అభిమాని అన్న సంగతి అతికొద్ది మందికే తెలుసు. అందుకోసమే పూరి, పవన్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘కెమెరామెన్‌ గంగతో రాంబాబు' చిత్రాన్ని మూర్తి గారికి అంకితమిచ్చాడు. కమర్షియల్‌ చిత్రాల్లో నటించించడానికి పెద్దగా ఆసక్తి చూపకపోవడం వలనే ఆయన ఈ చిత్రాన్ని రిజెక్ట్‌ చేశారని తెలుస్తోంది.


నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ...మా బేనర్లో నిర్మిస్తున్న ‘టెంపర్' చిత్రానికి సంబంధించిన టీజర్ నూతన సంవత్సర కానుకగా ఈ రోజు విడుదల చేసాం. రెస్పాన్స్ బాగుంది. ఎన్టీఆర్ లుక్, స్టైల్స్ ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఇటీవల విడుదలైన సిక్స్ ప్యాక్ లుక్ కి ఎంత పెద్ద రెస్పాన్స్ వచ్చిందో అందరికీ తెలిసిందే. ఇపుడు రిలీజైన టీజర్‌కి దాన్ని మించిన రెస్పాన్స్ వస్తోంది.


ఈ సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంటుగా, ఎంతో పవర్ ఫుల్‌గా ఉంటుంది. ఈ సినిమా బేనర్ ప్రతిష్టను మరింత పెంచే సినిమా అవుతుంది. అలాగే ఎన్టీఆర్ గారి కెరీర్లో, పూరి జగన్నాథ్ గారి కెరీర్లో, నా కెరీర్లో ‘టెంపర్' బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందన్న నమ్మకం నాకు ఉంది. ఈ నెల 20 వరకు జరిగే షెడ్యూల్ తో టోటల్ షూటింగ్ పూర్తవుతుంది. మరో పక్క పోస్టు ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి మొదటి వారంలో వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయబోతున్నాం' అన్నారు.


ఎన్టీఆర్ సరసన కాజల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, అలీ, పోసాని కృష్ణ మురళి, సుబ్బరాజు, మధురిమ బెనర్జీ, వెన్నెల కిషోర్, జయప్రకాష్ రెడ్డి, సప్తగిరి, కోవై సరళ, రమా ప్రభ, పవిత్ర లోకేష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.


ఈ చిత్రానికి కథ: వక్కతం వంశీ, సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె.నాయుడు, సంగీతం: అనూప్ రూబెన్స్, ఆర్ట్: బ్రహ్మకడలి, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, ఫైట్స్: విజయ్, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీన్ ప్లే మాటలు దర్శకత్వం: పూరి జగన్నాథ్.

English summary
Tollywood film industry is filled up with sentiment Bandla Ganesh wrote, "Today was radhasapthami, it's a very good day. Hence we released cd in temple.Audio release function we be on 28th January bless us (sic),"
Please Wait while comments are loading...