»   » రజనీకాంత్ రావాలి...చెత్త పోవాలి

రజనీకాంత్ రావాలి...చెత్త పోవాలి

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగళూరు: చెత్త రాశులకు, మురికిగుంటలకు ప్రతిరూపంగా మారిన ఉద్యాన నగరిని పరిశుభ్ర నగరంగా మెరుగుపరిచేందుకు విఖ్యాత నటుడు రజనీకాంత్‌ రాబోతున్నారా?, అన్నీ అనుకూలిస్తే అవుననే చెప్పాలి. ఒకనాటి బెంగళూరువాసైన తలైవర్‌ ను రంగంలోకి దించేందుకు బృహత్‌ బెంగళూరు మహానగర పాలికె సన్నాహాల్ని చేపట్టింది. ఐటీ సిటీని పరిశుభ్రతకు ప్రతీక తీర్చిదిద్దేందుకు నగరవాసుల్ని ప్రేరేపించే ప్రచారకర్తగా రజనీ వచ్చే సూచనలున్నాయి. పాలికె మేయరు కట్టె సత్యనారాయణ సోమవారం ఇక్కడ ఈ విషయాన్ని తెలిపారు.

మేయర్ మాట్లాడుతూ.... 'మేమిద్దరమూ ఒకే బడిలో చదివాం. నాకు మిత్రుడు కాకపోయినా ఒక ఏడాది సీనియర్‌. త్వరలోనే కార్పొరేటర్లతో కలసి చెన్నైకి వెళ్లి నగర శుద్ధీ కరణకు ప్రచారకర్త కావాలని కోరుతాం. తప్పకుండా సానుకూలంగా స్పందిస్తారు. సొంత వూరిపై ఆయనకు మాత్రం మమకారం ఉండదా' అని చెప్పారు. 'కేవలం ప్రచార కర్తగా ప్రకటనలకు పరిమితం కాబోరు. ఆయనే స్వయంగా చెత్త వూడుస్తారు' అన్నారు.

గతంలో పోలియో నివారణకు సూది మందు వేసుకోవాలని తమిళనాట ప్రచారం చేశారు. చివరకు అది రజనీకాంత్‌ సూదిమందుగా పేరు ప్రఖ్యాతుల్ని పొందటం తెలిసిందే. రాష్ట్ర రజనీ సేవా సమితి అధ్యక్షుడు రజని... ఈ ఆలోచనను అభినందించారు. 'రజనీకాంత్‌ పాల్గొనే నగర శుద్ధీకరణ కార్యక్రమంలో మేమూ పాల్గొంటామని' చెప్పారు. రజనీకాంత్‌ అభిమానుల సంఘం అధ్యక్షుడు గుణశేఖర్‌ మాట్లాడుతూ కార్యక్రమాన్ని విజయవంతానికి తమ వంతు కృషి చేస్తామన్నారు. రజనీకాంత్‌ రంగంలోకి దిగితే అది నగర వాసుల్ని ప్రభావితం చేస్తుందని చెప్పారు.

'రోబో' తరవాత రజనీ నటిస్తున్న 'కోచ్చడయాన్‌' కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రజనీ పుట్టిన రోజున సినిమాను విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తున్నట్లు సమాచారం. దీపికా పదుకొణే హీరోయిన్ గా నటించింది. ఇక సూపర్‌స్టార్‌కి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజు దృష్ట్యా ఈ టీజర్‌కి అనూహ్య స్పందన వచ్చింది. టీజర్‌ రిలీజైన తొలి మూడు రోజుల్లోనే 17లక్షల మంది యూట్యూబ్‌లో క్లిక్కులతో హోరెత్తించారు. ఇటీవలి రిలీజైన క్రిష్‌3, ధూమ్‌ 3 టీజర్‌లను మించి క్రేజు తెచ్చుకుంది. దేర్‌ ఆర్‌ హీరోస్‌, దేర్‌ ఆర్‌ సూపర్‌హీరోస్‌, బట్‌ దేర్‌ ఈజ్‌ ఓన్లీ వన్‌ రజనీకాంత్‌ .. అనే లైన్స్‌ టీజర్‌లో ఫ్యాన్స్‌ని ఆకట్టుకునేలా ఉన్నాయి. అయితే ఈ టీజర్‌పై కొన్ని విమర్శలు కూడా వచ్చాయి.

రజనీ కార్టూన్‌ షోలా ఉంది. రజనీ మార్క్‌ ఎక్కడా కనిపించలేదు అనేదే ఆ విమర్శ. ఏదేమైనా టీజర్‌కి స్పందన అనూహ్యం. 2డి, 3డిలో తెరకెక్కుతున్న భారీ గ్రాఫికల్‌ ఫాంటసీ చిత్రమిది. ఈ చిత్రానికి ఉపయోగించిన గ్రాఫిక్స్‌, ఎఫెక్ట్‌‌స కోసం ఆస్కార్‌ చిత్రం 'అవతార్‌'కి పనిచేసిన టీమ్‌ వర్క్‌ చేయడం విశేషం. రజనీకాంత్‌కి తెలుగులోనూ అద్భుతమైన ఫాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. ఈ చిత్రాన్ని తెలుగులో 'విక్రమసింహా' పేరుతో లక్ష్మి గణపతిఫిలింస్‌ పతాకంపై బి.సుబ్రహ్మణ్యం రిలీజ్‌ చేస్తున్నారు. శరత్‌కుమార్‌, నాజర్‌, జాకీష్రాప్‌, ఆది, శోభన తదితరులు ఈ చిత్రంలో ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

English summary
Rajinikanth's connection with Karnataka is well-known as he was brought up in Bangalore. Before he decided to take up acting career, the superstar was working as a bus conductor in the Garden City.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu