»   » సమంత.. 'బెంగుళూరు డేస్' టీజర్ (వీడియో)

సమంత.. 'బెంగుళూరు డేస్' టీజర్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మలయాళంలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రం ‘బెంగళూరు డేస్‌'. ప్రస్తుతం ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో రీమేక్‌ చేస్తోంది పీవీపీ సినిమా సంస్థ. తెలుగులో పలు విజయాలను అందించిన బొమ్మరిల్లు భాస్కర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. చాలా కాలం తర్వాత కోలీవుడ్‌లో పలువురు తారలు ఈ సినిమాలో కనిపించి అలరించనున్నారు.

సినిమాకు ‘బెంగళూరు నాట్కల్‌'గా పేరు ఖరారు చేశారు. ‘బాహుబలి'లో తన తడాఖా చూపిన రానా, ‘జిగర్‌దండా'లో తిరుగులేని నటనతో ఆకట్టుకున్న బాబిసింహా, శ్రీదివ్య, సమంత, పార్వతి, రాయ్‌లక్ష్మి, ప్రకాశ్‌రాజ్‌.. ఇలా పలువురు అలరించేందుకు సిద్ధమవుతున్నారు. మొదటగా తమిళ టీజర్ ని వదిలారు చూడండి..

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ముగ్గురు అన్నదమ్ములకు (కజిన్స్‌) సంబంధించిన కథతో దీన్ని రూపొందించారు. బెంగళూరు నగర జీవిత నేపథ్యంతో తెరకెక్కించారు. గోపీసుందర్‌ సంగీతం సమకూర్చారు. కేవీ గుహన్‌ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. సాధారణ కథలకు భిన్నంగా నేటి ట్రెండ్‌కు తగ్గట్టు ఈ సినిమా ఉంటుందని చిత్రవర్గాలు పేర్కొంటున్నాయి.

‘బెంగళూరు డేస్‌' సినిమాను చూసిన వారికి ఇప్పటికే వీరు ఏయే పాత్రల్లో ఎవరు నటించారు?.. అనే ఆసక్తి పెరిగింది. ఇక మన నేటివిటీకి ఎలా మార్పు చేస్తారోనని కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో ఈ సినిమాను తెలుగులో తీయ్యాలని నిర్ణయించుకున్నారు, కాని ఇప్పుడు దీనిని తెలుగులో డబ్బింగ్ చెయ్యలని చూస్తున్నారు. ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ డైరక్టర్ కాగా, ప్రసాద్ వి పొట్లూరి నిర్మాత.

ఒక భాషలో విజయవంతమైన చిత్రాన్ని వేరొక భాషలోకి అనువదించడమో లేక పునర్నర్మించడమో కొత్తేమీ కాదు. అయితే కొన్ని చిత్రాల రీమేక్‌ విషయంలో ప్రీప్రొడక్షన్‌ దశ నుంచే అటు పరిశ్రమలోనూ, ఇటు ప్రేక్షకలోకంలోనూ ఆసక్తి మొదలవుతుంటుంది. మలయాళంలో విజయవంతమైన 'బెంగళూరు డేస్‌' చిత్రం కూడా ఇప్పుడు వార్తలకు వేదికైంది. తెలుగు, తమిళ భాషల్లో బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో దిల్‌రాజు, పీవీపీ సంస్థ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Bangalore Naatkal Official First Look Teaser

మాతృకలో దుల్కార్‌ సల్మాన్‌, పహద్‌ఫాజిల్‌, నివిన్‌. నజ్రియా నజీమ్‌ తదితరులు నటించారు. అంజలి మీనన్‌దర్శకత్వం వహించారు. ఇందులో మూడు ప్రధాన పాత్రలుంటాయని వాటికి తెలుగు, తమిళ ప్రేక్షకులకు బాగా సుపరిచితమైన యంగ్ హీరోలను తీసుకోవాలన్న తలంపుతోనే వీరి గురించి దర్శక, నిర్మాతలు ఆలోచిస్తున్నారట.

మరో ప్రక్క ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు భాషల్లో ఏక కాలంలో తెరకెక్కించడానికి నిర్మాత పొట్లూరి వి.ప్రసాద్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో నటించే నటీనటులు, సాంకేతిక వర్గం ఎంపిక జరుగుతుంది. మరి ఈ హిట్ చిత్రంలో నటించే అవకాశం దక్కించుకునే హీరో హీరోయిన్లు ఎవరన్నది మరి కొద్దిరోజుల్లో తెలిసిపోతుంది.

    English summary
    Bangalore Naatkal is an upcoming Tamil comedy drama film directed by Bhaskar. The film is a remake of the 2014 Malayalam film Bangalore Days written and directed by Anjali Menon. Featuring an ensemble cast consisting of Arya, Sri Divya and Bobby Simha in the lead roles, it also has Rana Daggubati, Raai Laxmi, Parvathy and Samantha in other major roles. Produced by Prasad V Potluri under his banner PVP cinema.
    Please Wait while comments are loading...