»   »  'అత్తారింటికి దారేది' పైరసీ స్క్రీన్ ప్లే ఇదే...

'అత్తారింటికి దారేది' పైరసీ స్క్రీన్ ప్లే ఇదే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

విజయవాడ: రిలీజ్ కు ముందే.. 'అత్తారింటికి దారేది' సినిమా పైరసీ బయటకు వచ్చి సంచలనం సృష్టించింది. ఈ పైరసీని దొంగదారిలో లీక్ చేసిన దొంగల గుట్టు ని అతి తక్కువ సమయంలో పోలీసులు బయిటపెట్టారు. ఈ కేసులో ప్రధాన నిందితుడితో సహా మొత్తం ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. పోలీసులు మాత్రం ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ద్రువీకరించలేదు.

చిత్రనిర్మాత ప్రొడక్షన్ కార్యాలయంలో పనిచేసే ఒక ఎడిటర్ ద్వారా బయటకి వచ్చిన 83 నిమిషాల నిడివిగల చిత్రం.. ఏపీఎస్పీ బెటాలియన్ కానిస్టేబుల్ ద్వారా పెడనకు.. అక్కడి నుంచి మచిలీపట్నానికి చేరి..యూట్యూబ్‌కెక్కి నిర్మాతకు కన్నీళ్లు తెప్పించింది.

కనీసం యూనిట్ సభ్యుల కోసం వేసే ప్రదర్శన కూడా వేయకముందే పైరసీ సీడీ మార్కెట్లోకి వచ్చేసింది. ఫస్టాఫ్ సినిమా మొత్తాన్ని సీడీ రూపంలోకి మార్చేసి 50 రూపాయల చొప్పున అమ్మేశారు. అది కూడా కృష్ణా జిల్లాలో ఎక్కడో మారుమల ఓ మండల కేంద్రమైన పెడన అనే ఊళ్లో. పెడన ప్రాంతం సాధారణంగా అయితే కలంకారీ పరిశ్రమకు పెట్టింది పేరు. చీరలు, పంజాబీ డ్రస్సుల మీద అద్దకం వేయడంలో ఈ ప్రాంతం వారిది అందెవేసిన చేయి. కానీ ఇప్పుడు సినిమాలను కూడా అలా అద్దకం అద్దేసినట్లు తేలింది.

ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్, కృష్ణాజిల్లా సైబర్ క్రైమ్ పోలీసులు చేసిన దర్యాప్తులో అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాబోయే రోజుల్లో ఎంత జాగ్రత్తగా ఉండాలో సినిమావారందకీ హెచ్చరికతో కూడిన జాగ్రత్తలు తెలియచేసారు.

సిని పరిశ్రమను దిగ్బాంతికి గురిచేసి ఈ పైరసీ ఎలా మొదలైంది...ఎక్కడ నుంచి ఎక్కడకు ఎ ఎవరి అండదండలతో ముందుకెళ్లింది తదితర విషయాలతో స్పెషల్ స్టోరీ... స్లైడ్ షోలో

ఇలా మొదలైంది..

ఇలా మొదలైంది..

చిత్ర నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ ప్రొడక్షన్ కార్యాలయంలో పనిచేసే అరుణ్‌ప్రసాద్ 83 నిమిషాల నిడివి గల సినిమా భాగాన్ని తస్కరించాడు. యూసఫ్‌గూడ ఏపీఎస్పీ బెటాలియన్‌లో పనిచేస్తున్న కొందరు కానిస్టేబుళ్లతో అతడికి మంచి స్నేహం ఉంది. వీళ్లంతా కలిసి కృష్ణానగర్‌లో కాలక్షేపం చేస్తుండేవారు.

హైదరాబాద్ టు పెడన...

హైదరాబాద్ టు పెడన...


తాను తస్కరించిన సినిమా భాగాన్ని అరుణ్‌ప్రసాద్ వీరితో కలిసి చూశాడు. అయితే, ఆ కానిస్టేబుళ్లలో కృష్ణా జిల్లా పెడనకు చెందిన ఒక వ్యక్తి.. ఈ సీడీని అక్కడికి పంపాడు. అక్కడ మరొక వ్యక్తి.. ఈ సీడీని 5 భాగాలుగా చేసి పెడనలోని కొంతమంది సెల్‌షాపుల, నెట్‌సెంటర్ల యజమానులకు, స్నేహితులకు, తెలిసినవారికీ విక్రయించడం మొదలుపెట్టాడు.

మీడియాలో...

మీడియాలో...

సోమవారం ఉదయానికి ఈ పైరసీ విషయం బయటికి పొక్కడంతో మీడియాలో ప్రముఖంగా వచ్చింది. ఇండస్ట్రీ మొత్తం షాక్ అయ్యింది. పవన్ కళ్యాణ్ సినిమా గురించి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నవారంతా ఈ మాట విని ఆవేశాలతో నిందుతులను పట్టుకోవాలని డిమాండ్ చేసారు.

అన్ని చోట్లా సోదాలు

అన్ని చోట్లా సోదాలు

సినిమా పైరసీ గురించి మీడియాలో ప్రముఖంగా రావడంతో అప్రమత్తమైన పోలీసులు జిల్లా ఎస్పీ జె.ప్రభాకరరావు ఆదేశాల మేరకు సోమవారం పెడనలో దాడులు నిర్వహించి సీడీ షాపులు, సెల్‌ఫోన్ రిపేరు షాపులను సోదా చేశారు. అయితే వారి సోదాల్లో పైరసీ సీడీలు లభ్యం కాలేదు. పోలీసు శాఖకు చెందిన ఐటీ నిపుణులను రప్పించి షాపుల్లో పరిశీలించినా ఎటువంటి ఆధారాలూ లభించలేదు.

కప్పలదొడ్డిలో వ్యక్తి అరెస్టు..

కప్పలదొడ్డిలో వ్యక్తి అరెస్టు..

పోలీసులు 11 మందిని అదుపులోకి తీసుకుని షాపులకు తాళాలు వేసి తమదైన శైలిలో విచారించగా వారు కప్పలదొడ్డికి చెందిన ఒక యువకుడికి సీడీలతో సంబంధం ఉన్నట్టు తెలిపారు. వెంటనే పోలీసులు కప్పలదొడ్డి వెళ్లి ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. సోమవారం రాత్రంతా అతడిని ప్రశ్నించారు.

డొంక కదిలింది...

డొంక కదిలింది...

హైదరాబాద్‌లో ఒక వ్యక్తికి దీంట్లో ప్రమేయముందని అతడిచ్చిన సమాచారం మేరకు బందరు రూరల్ సీఐ పల్లపురాజు, పెడన, చిలకలపూడి ఎస్ఐలు శివరామకృష్ణ, శ్రీను అతణ్ని వెంటబెట్టుకుని మంగళవారం ఉదయం హైదరాబాద్‌కు బయల్దేరారు.

సైబర్ క్రైమ్ పోలీస్

సైబర్ క్రైమ్ పోలీస్

మరో ప్రక్క ఇదే సమయంలో.. చిత్ర నిర్మాత ప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం ఈ సినిమా అప్‌లోడ్ అయిన యూట్యూబ్‌పై దృష్టి సారించింది. దర్యాప్తులో అది మచిలీపట్నం పోర్టురోడ్డులోని ఒక ఇంటర్‌నెట్ కేఫ్ నుంచి అప్‌లోడ్ అయిందని తేలింది. ఆ వివరాలను సైబర్ క్రైమ్ విభాగం నుంచి అందుకున్న మచిలీపట్నం పోలీసులు సదరు ఇంటర్‌నెట్ సెంటర్‌పై దాడి చేశారు.

ఇంటరాగేషన్ ...

ఇంటరాగేషన్ ...

ఆ సీడీ ఎక్కణ్నుంచీ వచ్చింది? ఎలా వచ్చింది? ఎప్పుడు అప్‌లోడ్ చేశారు? వంటి వివరాలను ఆరాతీయడంతో డొంక కదిలింది. తమకు ఆ సీడీ పెడన నుంచి వచ్చిందని వారు చెప్పడంతో అక్కడి కొందరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ఇంటరాగేట్ చేశారు.

అదుపులో ఏపీ ఎస్పీ కానిస్టేబుల్...

అదుపులో ఏపీ ఎస్పీ కానిస్టేబుల్...

సైబర్ క్రైమ్ వారి విచారణలో హైదరాబాద్‌లోని ఏపీఎస్పీ కానిస్టేబుల్ గురించి తెలిసింది. దీంతో వారు హైదరాబాద్‌లోని సైబర్‌క్రైమ్ విభాగానికి, అప్పటికే అక్కడికి చేరుకున్న కృష్ణాజిల్లా పోలీసు బృందానికి సమాచారం అందించారు.ఆ సమాచారంతో.. మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో పోలీసులు ఆ కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకున్నారు.

మరో ముగ్గురు కూడా...

మరో ముగ్గురు కూడా...

ఇంటరాగేషన్‌లో అతడు మరో ముగ్గురు కానిస్టేబుళ్ల పేర్లు చెప్పాడు. నలుగుర్నీ ప్రశ్నించగా అసలు గుట్టు బయటపడింది. అయితే వారు చెప్పిన వివరాల్లో ఏదో లోపం ఉందని, మధ్యలో ఇంకేదో లింకు ఉందని కృష్ణాజిల్లా పోలీసులు భావిస్తున్నారు. వీరందరినీ బుధవారం మధ్యాహ్నానికి మచిలీపట్నం తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

పైరసీ సీడిల కోసం...

పైరసీ సీడిల కోసం...

పైరసీ సీడీల కోసం బందరులో మంగళవారం పోలీసు తనిఖీలు జరిగాయి. స్థానిక జిల్లా కోర్టు సెంటర్‌లోని ఓ షాపుతో పాటు తదితర చోట్ల తనిఖీలు నిర్వహించారు. మెమరీ కార్డు ద్వారా సెల్‌ఫోన్‌లో 'అత్తారింటికి దారేది' సినిమా భాగాన్ని చూస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.

పవన్ ఫ్యాన్స్..

పవన్ ఫ్యాన్స్..


మరోవైపు.. ఈ సినిమా పైరసీ సీడీలు మార్కెట్‌లోకి రావడంతో అప్రమత్తమైన పవన్ కళ్యాణ్ అభిమానులు తమకు లభించిన సమాచారాన్ని పోలీసులకు చేరవేస్తున్నారు.

English summary

 Police found the real culprit behind the leak of Attarintiki Daaredi's footage. A production assistant named Arun Kumar, who worked for the film, was the responsible for this crime, police said. From him, the pirated CD reached to a person in Pedana in Krishna district and soon pirated CDs went in circulation in other parts in the district. Later it was uploaded on the web.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu