»   »  గౌతమ్ మీనన్ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్?

గౌతమ్ మీనన్ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ వారసుడిగా.... హీరోగా ఎంట్రీ ఇచ్చాడు సాయి శ్రీనివాస్. తొలి సినిమా వివి వినాయక్ దర్శకత్వంలో అల్లుడు శ్రీను సినిమాలో చేయగా ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. తర్వాత స్పీడున్నోడు సినిమాతో మరో ప్రయత్నం చేసినా అది కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. తాజాగా మరో స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్టెనర్ లో నటిస్తున్నాడు సాయశ్రీనివాస్. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో భారీ ప్రాజెక్టుకు ప్లాన్ చేస్తున్నారు. తెలుగు తమిళ భాషల్లో స్టార్ ఇమేజ్ ఉన్న దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని భావిస్తున్నాడు. ఇప్పటికే గౌతమ్ మీనన్, బెల్లంకొండ సురేష్ కథా చర్చలు కూడా చేసారన్న టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉంది.

English summary
Film Nagar source said that, Bellamkonda Srinivas in Gautham Menon's next project.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu