»   » పంచ్ లు, ఫైట్స్ తో ట్రైలర్ (వీడియో)

పంచ్ లు, ఫైట్స్ తో ట్రైలర్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా రూపొందుతున్న చిత్రం స్పీడున్నోడు. ఈ చిత్రం ఆడియో విడుదల వేడుక శిల్పకళావేదికలో ఘనంగా జరిగింది. భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి డీజే వసంత్‌ సంగీతమందించారు. సోనారికా హీరోయిన్. ఈ నేపధ్యంలో చిత్రం ట్రైలర్ ని విడుదల చేసారు నిర్మాతలు. ఆ ట్రైలర్ ని మీరు ఇక్కడ చూడండి.


ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి చిత్ర యూనిట్ తో పాటు హీరోయిన్స్ తమన్నా, రకుల్‌ప్రీత్‌సింగ్‌, రెజీనా, సాక్షి చౌదరి, హెబ్బాపటేల్‌, తేజస్వి, పూర్ణ, కేథరిన్‌, దర్శకుడు వీవీ వినాయక్‌, నిర్మాత బెల్లంకొండ సురేశ్‌ తదితరులు హాజరయ్యారు.


Bellamkonda Srinivas’ Speedunnodu Theatrical Trailer

హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌కు ఇది 2వ సినిమా కాగా తమిళంలో సూపర్‌హిట్ అయిన 'సుందర పాండ్యన్' సినిమాకు 'స్పీడున్నోడు'ను రీమేక్‌గా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. 'అల్లుడు శీను'లో స్పెషల్ సాంగ్‌తో అలరించిన తమన్నా దీంట్లోనూ ఓ ప్రత్యేకమైన పాటలో నర్తించనుంది. కాగా విలేజ్ బ్యాక్‌డ్రాప్ లవ్‌స్టోరీ, ఫ్రెండ్‌షిప్ తదితర అంశాలను ఆధారంగా చేసుకుని తెరకెక్కుతున్న 'స్పీడున్నోడు' హిట్ అవుతుందని హీరో శ్రీనివాస్ నమ్మకంగా ఉన్నట్టు సమాచారం.


Bellamkonda Srinivas’ Speedunnodu Theatrical Trailer

English summary
Speedunnodu 2016 Telugu movie Theatrical Trailer released. Movie featuring Bellamkonda Srinivas, Sonarika Bhadoria, Tamanna, Rao Ramesh, Srinivas Reddy and Fish Venkat. Directed by Bheemaneni Srinivas Rao. Music composed by Vasanth and Produced by Bheemineni Sunitha under the banner of Goodwill Films.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu