త్రిష కేవలం అందాల ఆరబోతకే కాదు:బెల్లంకొండ సురేష్
త్రిష పాత్ర కేవలం అందాల ఆరబోతకే కాదు...నటనకీ అవకాశం ఉంది. మరోసారి వెంకటేష్-త్రిషల కాంబినేషన్ ప్రేక్షకులకు కనువిందు చేస్తుంది అంటున్నారు నిర్మాత బెల్లంకొండ సురేష్. ఆయన రీసెంట్ గా వెంకటేష్, త్రిషలతో బాడీగార్డ్ రీమేక్ ప్రారంభించారు. డాన్ శీను దర్సకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ నెలలోనే షూటింగ్ మొదలుపెట్టనున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చారు. అలాగే ఈ చిత్రంలో రెండో హీరోయిన్ కీ ప్రయారిటీ ఉంది.త్వరలోనే ఆమె పేరు కూడా ప్రకటిస్తామని అన్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తూంటే కోనవెంకట్ రచన చేస్తున్నారు. గతంలో వెంకటేష్, త్రిష కాంబినేషన్ లో 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే', 'నమో వెంకటేశ' చిత్రాలు వచ్చాయి.


Click it and Unblock the Notifications











