twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘బెండు అప్పారావు' ఆడియో 9న

    By Staff
    |

    నవ్వుల వైద్యం చేయడానికి 'బెండు అప్పారావు ఆర్ఎంపి' త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అల్లరి నరేష్, కామ్న జెఠ్మలాని మేఘన సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డాక్టర్ డి.రామానాయుడు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు ఇవివి సత్యనారాయణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకొంటోంది. ఆ విశేషాలను దర్శకనిర్మాతలు తెలియజేశారు.

    వినోదమే ప్రధానంగా ఇవివి సత్యనారాయణ ఈ చిత్రాన్ని తెరకెక్కించారనీ, నరేష్ కు సరిపోయే కథతో ఈ చిత్రం రూపొందిందనీ డి.రామానాయుడు తెలిపారు. కోనసీమలోని సుందర ప్రదేశాల్లో ఇటీవల ఓ మేజర్ షెడ్యూల్ చిత్రీకరించామని చెప్పారు. ఇందులో కథానాయకుడు ఓ గ్రామంలో ఆర్ పిఎంగా ఉంటూ మందులకు లొంగని రోగాలను కూడా తన నవ్వుతో మాయం చేస్తుంటాడనీ, అలాంటి చలాకీ డాక్టర్ కథే ఈ చిత్రమని తెలిపారు. ఈనెల 9న ఆడియో విడుదల చేసి త్వరలోనే సినిమా విడుదల చేస్తామని చెప్పారు. గ్రామీణ ప్రజల మధ్య ఉండే సరదాలు, సరసాలు, ఎమోషన్స్ అన్నీ ఈ చిత్రంలో ఉంటాయని ఇవివి సత్యనారాయణ తెలిపారు. నాయుడు గారికి ఓ హిట్ ఇవ్వాల్సిన బాధ్యత తనపై ఉందనీ, అందుకు తగ్గట్టే ఈ చిత్రాన్ని తెరకెక్కించామనీ చెప్పారు. ఈ సినిమాకి కోటి మంచి సంగీతం ఇచ్చారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో ఆహుతి ప్రసాద్, మేఘన, చలపతిరావు, ధర్మవరపు, ఎల్బీ శ్రీరామ్ తదితరులు నటించారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X