»   » ‘బెంగాల్ టైగర్’లో పవన్ కళ్యాణ్ భజన!

‘బెంగాల్ టైగర్’లో పవన్ కళ్యాణ్ భజన!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మాస్ మహరాజా నటించిన ‘బెంగాల్ టైగర్' చిత్రం ఈ రోజు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో గ్రాండ్‌గా రిలీజైంది. రవితేజ సరసన తమన్నా, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటించారు. సినిమా చూసిన వారంతా ఇందులో ఎక్కువగా పవన్ కళ్యాణ్ భజన వినిపించడం చూసి ఆశ్చర్య పోతున్నారు.

సినిమా మొదలవ్వడమే చిరంజీవికి స్పెషల్ థాంక్స్ కార్టుతో మొదలవుతుంది. సినిమాలో చాలా సీన్లలో పవన్ కళ్యాణ్ మీద ప్రశంసలు వినిపించడంపై మెగా అభిమానులు ఆనందంగా ఉన్నారు. ఓ సీన్లో రజనీకాంత్ తర్వాత నెక్ట్స్ సూపర్ స్టార్ పవన్ కళ్యాణే అని రిప్రజెంట్ చేయడం గమనార్హం. మరో సీన్లో పవన్ కళ్యాణ్‌ వల్లనే ఓ పార్టీ చివరి ఎలక్షన్లలో గెలిచిందనే విధంగా చూపించారు.

Bengal Tiger loaded with praises of Pawan Kalyan

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కూడా సంపత్ నంది మాట్లాడుతూ... తాను పవన్ కళ్యాణ్‌కు పెద్ద అభిమానిని అని చెప్పుకొచ్చారు. అపుడు చెబితే ఏమో అనుకున్నాం కానీ... ఇపుడు సినిమాలో ఏకంగా తన అభిమానాన్ని ఇలా చూపిస్తాడని ఎవరూ ఊహించలేదు. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్‌‍లతో సినిమా చేస్తానని కూడా చెప్పాడు. అంతే కాదు రామ్ చరణ్ కోసం ‘చోటా మేస్త్రి' అనే టైటిల్ పేరుతో స్క్రిప్టు వర్క్ చేస్తున్నట్లు కూడా వెల్లడించడం విశేషం.

ఇక ‘బెంగాల్ టైగర్' మూవీ విశేషాల్లోకి వెళితే...రవితేజ, తమన్నా, రాశి ఖన్నా, బోమన్ ఇరానీ, బ్రహ్మానందం, రావు రమేష్, షాయాజీ షిండే, నాజర్, పోసాని కృష్ణ మురళీ, తనికెళ్ల భరణి, హర్షవర్ధన్ రానె, సురేఖా వాణి, అక్ష, శ్యామల, ప్రియ, ప్రభు, ప్రగతి, నాగినీడు, ప్రభ, రమాప్రభ తదతరులు నటించారు. ఈ చిత్రానికి కెమెరా: సౌందర్ రాజన్, ఎడిటర్: గౌతం రాజు, ఆర్ట్: డి.వై.సత్యనారాయణ, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, సంగీతం: బీమ్స్, నిర్మాత: కె.కె.రాధామోహన్, కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సంపత్ నంది.

English summary
Mass Maharaja Ravi Teja starrer action and romantic entertainer “Bengal Tiger” is fully loaded with the praises of Power star Pawan Kalyan.
Please Wait while comments are loading...