twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    "బేవ‌ర్స్" మూవీ మెద‌టి సాంగ్ లాంచ్

    By Bojja Kumar
    |

    "ఆన‌లుగురు", "మీ శ్రేయాభిలాషి" లాంటి గ‌ర్వించ‌ద‌గ్గ చిత్రాల్లొ న‌టించి తెలుగు ప్రేక్ష‌కుల అభిమానాన్నిసొంతం చేసుకున్న న‌ట‌కిరీటి డాక్ట‌ర్ రాజేంద్ర‌ప్ర‌సాద్ ముఖ్య‌పాత్ర‌లో న‌టించిన చిత్రం బేవ‌ర్స్‌. సంజోష్‌, హ‌ర్షిత హీరో హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. కాసం స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్ క్రియెష‌న్స్ ప‌తాకం పై నిర్మాత‌లు పొన్నాల‌ చందు, ఎమ్ అర‌వింద్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ర‌మేష్ చెప్పాల ద‌ర్శ‌క‌త్వం చేస్తున్నారు. సునీల్ కాశ్య‌ప్ సంగీతాన్ని అందించిన మెద‌టి సాంగ్ డాక్ట‌ర్ రాజేంద్ర‌ప్ర‌సాద్ గారి చేతుల మీదుగా విడుద‌ల చేశారు.

    నటకిరీటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ... బేవర్స్ ఏమిటి ఈ టైటిల్ ఏంటి అని అనుకుంటున్నారా... తల్లిదండ్రులను అర్థం చేసుకోని పిల్లలు మాత్రమే బేవర్స్ కాదు... పిల్లల్ని అర్థం చేసుకోని తల్లిదండ్రులు కూడా బేవర్స్ అవుతారు... అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందించారు. డైరెక్టర్ రమేష్ డైలాగ్స్ అద్భుతంగా రాశాడు. సామాజిక స్పృహ ఉన్న చిత్రం. నా కెరీర్లో ఎక్కువ పారలల్ సినిమాలు చేసాను. మళ్ళీ ఇప్పుడు మరో సూపర్ హిట్ సినిమా వస్తోంది. మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది. ఒక పాటను మ్యూజిక్ డైరెక్టర్ పాడాడు. ఏ ఆర్ రెహమాన్ పాడినట్టు అనిపించింది. ప్ర‌ముఖు ర‌చ‌యిత సుద్దాల అశోక్ త‌న మ‌న‌సు, ప్రాణం పెట్టి రాశాడు.. త‌ల్లి త‌ల్లి నా చిట్టి త‌ల్లి నా ప్రాణాలే పోయాయ‌మ్మా.. నీవే లేని లోకాన నేను శవ‌మ‌ల్లే మిగిలానమ్మా.. నాఇంట నువ్వుంటే మాయ‌మ్మే వుందంటూ మురిసానమ్మా..ఏ జ‌న్మ‌లో పాప‌మో నేను చేశానో ఈ శిక్ష‌వేశావమ్మా.. పోద్దున్నే పోద్ద‌ల్లే నువునాకు ఎదురోస్తే అదృష్టం నాద‌నుకున్నా.. సాయంత్రం వేళల్లో నా బ్ర‌తుకు నీడ‌ల్లొ నా దీపం నీవనుకున్నా.. లోకంలొ నేనింకా ఏకాకినైన‌ట్టు శూన్యంలో వున్నాన‌మ్మా..చిరుగాలిలో ఊగే ఏ చిగురు కొమ్మైనా నీలాగే తోచేన‌మ్మా.. అంటూ క‌న్న కూతురి గురించి రాసిన ర‌చ‌న అద్బుతం. హీరో, హీరోయిన్ చాలా బాగా చేశారు. ఈ సినిమా నా కెరీర్ లో మరో మంచి చిత్రం గా నిలుస్తుంది. అని అన్నారు.

    Bewars Movie first song launch

    డైరెక్టర్ రమేష్ చెప్పాలా మాట్లాడుతూ... మీ శ్రేయోభిలాషి చిత్రానికి రచయిత గా ఎంత గా తృప్తి చెందానో బేవర్స్ చిత్రాన్ని రూపొందిస్తున్నప్పుడు కూడా అంతకంటే ఎక్కువ సంతృప్తి చెందాను. రాజేంద్రప్రసాద్ గారు ఈ పాత్ర ఇప్పటివరకు చేయకపోవడం నా అదృష్టం. ఆయ‌న చేతుల మీదుగా విడుద‌ల చేసిన సాంగ్ చాలా పెద్ద హిట్ అయ్యింది. అని అన్నారు.

    ఈ సంద‌ర్బంగా నిర్మాత‌లు పొన్నాల చందు, ఎమ్‌. అర‌వింద్ లు మాట్లాడుతూ.. డా. రాజేంద్ర‌ప్ర‌సాద్ గారు న‌టించిన అనేక చిత్రాల్లో తెలుగు ప్రేక్ష‌కులు మ‌ర్చిపోలేని కొన్ని చిత్రాల్లో మీ శ్రేయాభిలాషి ఓక‌టి. అలాంటి చిత్రానికి రైట‌ర్ గా ప‌నిచేసిన ర‌మేష్ చెప్పాలా ద‌ర్శ‌కుడిగా రాజేంద్ర‌ప్ర‌సాద్ గారు ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం బేవ‌ర్స్‌. మా బ్యాన‌ర్ S క్రియెష‌న్స్ పై ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా నిర్మించాము. విడుద‌ల చేసిన సాంగ్ కి చాలా మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. ఈ చిత్రంలో సంజోష్‌, హ‌ర్షిత లు హీరోహీరోయిన్స్ గా చాలా బాగా నటించారు. అని అన్నారు.

    Bewars Movie first song launch

    హీరో సంజోష్‌ మాట్లాడుతూ.... నటకిరీటి రాజేంద్రప్రసాద్ గారితో పని చేయడం నా అదృష్టం. తండ్రి కొడుకు కలిసి ఈ సినిమా చూడాలి. ఆయ‌న చేతుల మీదుగా విడుద‌ల చేసిన సాంగ్ చాలా అంటే చాలా బాగుంది. అని అన్నారు.

    సంగీతం- సునీల్ కాశ్య‌ప్‌, సాహిత్యం- సుద్దాల అశోక్ తేజ్‌, భాస్క‌ర‌భ‌ట్ల‌, మండ్యం అర‌వింద్‌, ఎడిటింగ్‌- ఎం.ఆర్ వ‌ర్మ‌, ఆర్ట్- ర‌ఘు కుల‌క‌ర్ణి, కెమెరా - కె చిట్టిబాబు,

    English summary
    Bewars Movie First Song Launch at Radio Mirchi 98.3 FM, Hyderabad. Rajendra Prasad, Sanjosh, Ramesh Cheppala at the event.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X