»   » డైరెక్టర్ మాయచేసాడు: నిజం బయట పెట్టిన అనుష్క!

డైరెక్టర్ మాయచేసాడు: నిజం బయట పెట్టిన అనుష్క!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అనుష్క ప్రధాన పాత్రలో 'భాగమతి' సినిమా వస్తోందంటూ గత కొంతకాలంగా మీడియాలో వార్తలు నలిగిపోతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టుపై ఇప్పటి వరకు సరైన క్లారిటీ లేదు. 'భాగమతి' అనే టైటిల్ చూసి ఇది చారిత్రక చిత్రమనే ఇంతకాలం భావించారు.

17వ శతాబ్దం రాజు కులీ కుతుబ్ షా, ఆయన భార్య భాగమతి స్టోరీ ఆధారంగానే ఈ సినిమా ఉంటుందని ఇంతకాలం ప్రచారం జరిగింది. ఇది హైదరాబాద్ చరిత్రతో ముడిపడి ఉన్న కథగా భావించి చాలా మంది ఈ ప్రాజెక్టుపై ఆసక్తి పెంచుకున్నారు.

'Bhagamathi' is not a Historical movie

అయితే తాజాగా 'భాగమతి' చిత్రానికి అంత సీన్ లేదని తేలిపోయింది. ఇది చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా కాదు...మామూలు థ్రిల్లర్ మూవీ. ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోయే డైరెక్టర్ అశోక్(పిల్ల జమిందార్ ఫేం) కావాలనే ఇంతకాలం అసలు విషయం దాచి హైదరాబాద్ చరిత్ర మీద ప్రేక్షకులకున్న వీక్ నెస్ తో ఆడుకున్నాడు, తన ప్రాజెక్టు జనాల్లో బాగా నానాలని, పబ్లిసిటీ రావాలని మాయచేసాడు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనుష్క 'భాగమతి' ప్రాజెక్టుకు సంబంధించిన అసలు విషయం చెప్పింది. 'నేను చేస్తోంది కేవలం ఒక థ్రిల్లర్ సినిమా. 17వ శతాబ్దానికి చెందిన చరిత్ర అని చాలామంది అనుకుంటున్నారు. కాని ఇక్కడ అనుకున్న కథ వేరు. భాగమతి అనే అమ్మాయి చుట్టూ తిరిగే ఒక థ్రిల్లర్ సినిమా' అని తేల్చి చెప్పింది.

English summary
Tollywood actress Anushka said 'Bhagamathi' is not a Historical movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu