»   » నాని ‘భలే భలే మగాడివోయ్’ లొకేషన్లో ఇలా... (ఫోటోస్)

నాని ‘భలే భలే మగాడివోయ్’ లొకేషన్లో ఇలా... (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అల్లు అర‌వింద్ సమ‌ర్ప‌ణ‌లో, జి.ఎ 2 ( ఎ డివిజన్ ఆప్ గీతా ఆర్ట్స్) బాన్య‌ర్ పై యు.వి క్రియేషన్స్ సంయుక్తంగా ప్రోడ‌క్ష‌న్ నెం. 1 గా రూపొందిస్తున్న ఫ్యామిలీ అండ్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌ 'భ‌లే భ‌లే మ‌గాడివోయ్'. నాని, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా న‌టిస్తున్నారు. మారుతి ద‌ర్శ‌కుడు. బ‌న్నివాసు నిర్మాత‌. ఈ చిత్రం షూటింగ్ కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని ప్ర‌స్తుతం పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల్లో బిజిగా వుంది. ఇటీవ‌లే విడుద‌ల చేసిన మెష‌న్ పోస్ట‌ర్ కి చాలా మంచి రెస్పాన్స్ రావ‌టంతో యూనిట్ స‌భ్యులంద‌రూ ఆనందంగా వున్నారు. నేష‌న‌ల్‌ అవార్డ్ గ్ర‌హీత, ప్రముఖ సంగీత ద‌ర్శ‌కులు గోపిసుంద‌ర్ సంగీతాన్ని అందించిన ఈచిత్ర ఆడియో‌ని స్వాతంత్ర‌దినోత్స‌వ సందర్భంగా అగ‌ష్టు 15న ప్ర‌ముఖుల మ‌రియు అభిమానుల స‌మ‌క్షంలో విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహ‌లు చేస్తున్నారు.

ఈ సందర్భంగా హీరో నాని మాట్లాడుతూ: 'భలే భలే మగాడివోయ్ షూటింగ్ పూర్త‌యింది. నటించ‌టానికి వీలున్న మంచి పాత్ర చేశాన‌న్న తృప్తివుంది. మారుతి తొ ప‌నిచేయడం చాలా హ్య‌పిగా వుంది. త‌క్కువ టైంలో ఈచిత్రం పూర్త‌యింది. లావణ్య త్రిపాఠి మంచి కోస్టార్. అల్లు అర‌వింద్ గారి సమ‌ర్ప‌ణ‌లో, జి.ఎ 2 ( ఎ డివిజన్ ఆప్ గీతా ఆర్ట్స్), యువి క్రియేషన్స్ సంయుక్తంగా బ‌న్నివాసు నిర్మాత‌గా ఈచిత్రం చేయ‌టం చాలా హ్య‌పిగా వుంది. ఎక్క‌డా ఎటువంటి డిస్ట‌బెన్స్ లేకుండా షూటింగ్ అంతా అయిపోయంది. తప్ప‌కుండా ఫ్యామిలి అంతా ధియోట‌ర్స్ కి వెళ్ళి చూడాల్సిన చిత్రం. న‌వ్విస్తూనే వుంటాం. ఇటీవ‌ల విడుద‌ల చేసిన మెష‌న్ పోస్ట‌ర్ కి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ' అని అన్నారు.

స్లైడ్ షోలో సినిమాకు సంబంధించిన వర్కింగ్ స్టిల్స్, మరిన్ని వివరాలు...

ద‌ర్శ‌కుడు మారుతి మాట్లాడుతూ

ద‌ర్శ‌కుడు మారుతి మాట్లాడుతూ


మా చిత్రం భ‌లే భ‌లే మ‌గాడివోయ్ పూర్త‌య్యింది. ప్ర‌స్తుతం పోస్ట్‌ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల్లో వుంది. ఇప్ప‌డు ఆడియో వేడుక‌కి సిధ్ధ‌మ‌వుతుంది. నేష‌న‌ల్ అవార్డు విన్న‌ర్ గోపిసుంద‌ర్ అందించిన ఆడియో స్వాతంత్ర‌దినోత్స‌వం సంధ‌ర్బంగా అగ‌ష్టు 15న విడుద‌ల చేస్తున్నాం అన్నారు.

ప్రమోషన్స్

ప్రమోషన్స్


ప్ర‌మోష‌న్ విష‌యంలో కూడా చాలా కేర్ తీసుకుని డిఫ‌రెంట్ గా సినిమాని ప్రెజెంట్ చేస్తున్నాము. ఇటీవ‌ల విడుద‌ల చేసిన మెష‌న్ పోస్ట‌ర్ రెస్పాన్స్ బాగుంది. మెమ‌రి నిల్‌..ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఫుల్ అనే క్యాప్ష‌న్ అంద‌రికి ఆక‌ట్టుకుంది అన్నారు.

గోవా సాంగ్

గోవా సాంగ్


ఇటీవ‌ల గోవాలో తీసిన సాంగ్ మ‌రియు టైటిల్ సాంగ్ చిత్రానికి హైలెట్ గా నిలుస్తాయి. శేఖ‌ర్ మాస్ట‌ర్ వేయించిన స్ట‌ప్స్ విజిల్స్ కొట్టించేలా వుంటాయి. నిజార్ కెమెరా వ‌ర్క్‌ సూప‌ర్బ్ గా వుంటుంది అన్నారు.

ఎంటర్టెన్మెంట్

ఎంటర్టెన్మెంట్


నేను ఏ క‌థ తీసుకున్నా కూడా ఎంట‌ర్‌టైన్‌మెంట్ తో చేస్తాను. ఈ చిత్రం మరింత ఎంట‌ర్‌టైన్‌మెంట్ తో చేశాను. క‌థ‌లోనే కామెడి, కేర‌క్ట‌ర్స్ లోనూ కామెడి వుండ‌టంతో చిత్రం ఆద్యంతం న‌వ్వుతూనే వుంటారు. నిర్మాత బ‌న్నివాసుత మ‌రోక్క‌సారి చేయటం ఆనందంగా వుంది. ఈచిత్రం అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కున్నిఆక‌ట్టుకునేలా ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్ గా రూపొందింది. అని అన్నారు

బన్ని వాసు...

బన్ని వాసు...


ఈ సంద‌ర్భంగా నిర్మాత బ‌న్నివాసు మాట్లాడుతూ..కోత్త‌జోన‌ర్ లో చిత్రాన్ని తెరకెక్కించాం. పూర్తిగా కమర్షియల్ వాల్యూస్ విత్ ఎంట‌ర్టైన్‌మెంట్‌ తో చిత్రీకరించాం. చిత్ర షూటింగ్ పూర్తయింది. పోస్ట్‌ప్రోడ‌క్ష‌న్ లో బిజిగా వుంది. ఫ్యామిలి అంతా న‌వ్వుకునే విధంగా వుంటుంది. ఆడియో వేడుక‌కి చిత్ర ప్ర‌ముఖులు విచ్చేస్తారు' అని అన్నారు.

నటీనటులు

నటీనటులు


నాని, లావ‌ణ్య త్రిపాఠి, ముర‌ళి శ‌ర్మ‌, న‌రేష్‌, సితార‌, స్వ‌ప్న మాధురి, శ్రీనివాస రెడ్డి, వెన్నెల కిషోర్‌, ప్ర‌వీణ్, ష‌క‌ల‌క శంక‌ర్‌, బ‌ద్ర‌మ్ మ‌రియు త‌దిత‌రులు నటిస్తున్నారు.

టెక్నీషియన్స్

టెక్నీషియన్స్


ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్: ఎస్‌.కె.ఎన్‌, పి.ఆర్‌.ఓ: ఏలూరు శ్రీను, ఎడిట‌ర్:ఉద్ద‌వ్‌,ఆర్ట్:ర‌మణ వంక‌, ఫొటొగ్రఫి:నిజార్ ష‌ఫి, సంగీతం: గోపి సుంద‌ర్, నిర్మాత: బ‌న్నివాసు, ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం:మారుతి

    English summary
    Bhale Bhale magadivoy Audio releasing on August 15.
    Please Wait while comments are loading...