»   » నా కొడుకు ఉన్నా వైఫ్ లేకుండా పోయింది: రానా

నా కొడుకు ఉన్నా వైఫ్ లేకుండా పోయింది: రానా

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాహుబలి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో రానా బుల్లితెరపై సందడి చేయనున్నాడు. టాలీవుడ్-తో పాటు కోలీవుడ్, బాలీవుడ్ లోనూ మంచి ఫాలోయింగ్ ఉన్న యంగ్ హీరో రానా త్వరలో యాంకర్ అవతారం ఎత్తాడు. నెంబర్ వన్ యారీ విత్ రానా అనే షోకు రానా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు.

బిగ్ బి అమితాబ్ బచ్చన్

బిగ్ బి అమితాబ్ బచ్చన్

టీవీ షోలకి డిమాండ్ బాగా పెరిగిపోయింది. స్టార్ హీరోలు కూడా ప‌లు షోస్ లో పాల్గొనాలనే ఆసక్తి చూపుతున్నారు. టీవీ షోల్లో ఇప్పటికే కొందరు సెలెబ్రిటీలు బుల్లితెర ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ నిర్వహించిన కౌన్ బనేగా కరోడ్ పతి ఎంతగా పాపులర్ అయిందో దేశమంతటికీ తెలుసు.

సత్యమేవ జయతే టీవీ షో

సత్యమేవ జయతే టీవీ షో

ఆ ఇన్సిపిరేషన్ తో అదే ప్రోగ్రాం ఇతర భాషల్లో కూడా ఆయా సెలెబ్స్ తో నిర్వహించారు. అలాగే ఆమిర్ ఖాన్ .. సామాజిక స్పృహతో నిర్వహించిన సత్యమేవ జయతే టీవీ షో కూడా చాలామందిని ఆలోచింపచేసింది. అయితే ఇప్పుడు మరీ అంత సీరియస్ షో కాకుండా కాస్త ఎంటర్టైన్మెంట్ కూడా కలిపేస్తున్నారు.

నంబర్ వన్ యారి విత్ రానా

నంబర్ వన్ యారి విత్ రానా

కేవలం సెలబ్రిటీలు మాత్రమే పాల్గొనే ఈ షో కాఫీ విత్ కరణ్ తరహాలో రూపొందింది.‘నంబర్ వన్ యారి విత్ రానా' అనే టీవీ షో ఇప్పుడు కాస్త గట్టిగానే పాపులర్ అవుతోంది. మొత్తానికి తమ అభిమానులకు మరింత దగ్గరయ్యేందుకు బుల్లితెరను వాడేసుకుంటున్నారు మన హీరోలు. అటు టీవీ ఛానెల్స్ కూాడా వీళ్ల క్రేజ్ ను క్యాష్ చేసుకునే పనిలో పడ్డాయి.

రానా పెళ్లి గురించి

రానా పెళ్లి గురించి

అయితే ఈ విషయం పక్కన పెడితే ఈమధ్య ఈ షోలో రానా పెళ్లి గురించి ప్రస్తావనకు వచ్చింది. ‘రానా సినిమాల్లో మాత్రమే పెళ్లి చేసుకుంటాడు.. నిజ జీవితంలో చేసుకోడు' అని ఒక సెటైర్ పడింది. ఆ సెటైర్ వేసింది ఎవరు అన్నది షో చూసి తెలుసుకోవాలసిందే... అయితే అ ప్రశ్నకి రానా ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా??

ఫస్ట్ టైం సినిమాల్లో పెళ్లయింది

ఫస్ట్ టైం సినిమాల్లో పెళ్లయింది

"అంటే..‘‘మీకో విషయం తెలుసా? నాకు ఫస్ట్ టైం సినిమాల్లో పెళ్లయింది ఈ సారే. ఇప్పుడు తేజగారి సినిమాలో. నాకు సినిమాల్లో కూడా పెళ్లవలేదు సరిగ్గా. ‘బాహుబలి'లాంటి సినిమాలో కొడుకు వచ్చి అటు ఇటు తిరుగుతున్నా వైఫ్ లేకుండా పోయింది.'' అని చెప్పాడు రానా.

English summary
Tollywood Bhallala Deva Rana satires himself in the show no.1 yari with rana about His marriage
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu