For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సినిమాలు ఫ్లాప్ కావడానికి కారణమిదే.. అర్జున్, విశ్వక్ సేన్ వివాదంలో తప్పు ఎవరిదంటే: తమ్మారెడ్డి

  |

  సీనియర్ నటుడు అర్జున్ దర్శకత్వంలో యంగ్ హీరో విశ్వక్ సేన్ ఒక సినిమా చేసేందుకు ఒప్పుకున్న విషయం తెలిసిందే. వీరి సినిమా ఓపెనింగ్ కొన్ని నెలల క్రితమే మొదలైంది. పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమా లాంచ్ వేడుకకు ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. అయితే ఎంతో హడావుడిగా మొదలైన ఈ సినిమా వివిధ కారణాల వలన కొన్ని షెడ్యూల్స్ తర్వాత ఆగిపోవడం ఆశ్చర్యం కలిగించింది. అయితే అర్జున్ విశ్వక్ సేన్ పై చేసిన కామెంట్స్ కూడా వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇక ఈ వివాదంపై సీనియర్ దర్శకులు నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. ఆ వివరాలలోకి వెళితే..

  అర్జున్ - విశ్వక్ వివాదం

  అర్జున్ - విశ్వక్ వివాదం

  విశ్వక్ సేన్ కమిట్మెంట్ లేని యాక్టర్ అని అర్జున్ తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సినిమా ఒకసారి చేయడానికి ఒప్పుకున్న తర్వాత అతను మధ్యలో సినిమా షూటింగ్ ఆపేయాలని చెప్పడం తీరని అవమానమని కూడా ఆయన అన్నారు. అయితే విశ్వక్ మాత్రం ఆ కామెంట్స్ కు స్పందిస్తూ తాను చాలా కమిట్మెంట్ ఉన్న యాక్టర్ అని ఇండస్ట్రీలో ఎవరైనా సరే తనకు అది లేదు అని చెబితే వదిలేసి వెళ్ళిపోతాను అని కూడా అన్నాడు. మొత్తానికి అయితే ఈ సినిమా క్యాన్సిల్ అయినట్లు హీరోతోపాటు అర్జున్ కూడా క్లారిటీ ఇచ్చారు.

  అది అవమానమే..

  అది అవమానమే..

  అర్జున్ విశ్వక్ సేన్ మధ్యలో జరిగిన గొడవపై పలువురు సినీ ప్రముఖులు విభిన్నమైన తరహాలో స్పందించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక తమ్మారెడ్డి భరద్వాజ కూడా ఈ విషయంలో రియాక్ట్ అయ్యారు. ఆయన మాట్లాడుతూ సీనియర్ హీరో అర్జున్ మంచి నటుడే కాకుండా మంచి దర్శకుడు. అయితే ఆయన పట్ల హీరో అనుసరించిన తీరు ఆయనకు తీరని అవమానమని అలాగే దర్శకులకు నిర్మాతలకు ఇది అవమనమే అని కూడా తమ్మారెడ్డి వివరణ ఇచ్చారు.

  అందువల్లే సినిమాలు ఫ్లాప్

  అందువల్లే సినిమాలు ఫ్లాప్

  మొదట సినిమా స్టార్ట్ చేయాలని అనుకున్నప్పుడు ఎవరైనా సరే ఒప్పుకున్న తర్వాతనే స్టార్ట్ చేస్తారు. ఒకసారి కమిట్ అయిన తర్వాత అలాగే పాటలు మాటలు బాలేదు నిర్మాత నచ్చలేదు అనే విషయాలు సెట్స్ లోకి అసలు తీసుకురాకూడదు. ఒక విధంగా ఈ కాలం హీరోలు కథల విషయంలో వేలు పెట్టడం వంటివి తగ్గించుకుంటే చాలా మంచిది. వాళ్ళు కథల్లో అనవసరంగా వేలు పెట్టడం వల్లనే ఈ విధంగా సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి అని అన్నారు.

  ఒకప్పుడు అలా ఉండేవారు

  ఒకప్పుడు అలా ఉండేవారు

  ఒకప్పుడు సీనియర్ హీరోలు నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ అలాగే మరి కొంతమంది హీరోలు కూడా సమయానుసారంగా రావడమే కాకుండా దర్శకనిర్మాతలకు ఎంతగానో గౌరవం ఇచ్చేవారు. అనుకోకుండా ఆలస్యం అయినప్పటికీ వారు తగిన విధంగా టైం కేటాయించేవారు. కానీ నేటి తరం హీరోలు మాత్రం ఆ విధంగా లేరు. ఒక విధంగా అర్జున్ చాలా ధైర్యంగానే బయటకు చెప్పారు. కానీ ఇండస్ట్రీలో దాదాపు అందరూ దర్శక నిర్మాతలు ఇదే తరహాలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కానీ వాళ్ళు మౌనంగా భరిస్తున్నారు అని అన్నారు.

  కథ నచ్చకుంటే..

  కథ నచ్చకుంటే..

  అర్జున్ అయితే టాలెంటెడ్ డైరెక్టర్. ఇంతకుముందు కూడా అతను చాలా మంచి సినిమాలు చేశాడు. అసలు మొదట కథ నచ్చకుంటే ఒప్పుకొని ఉండాల్సింది కాదు. ఇక ఈ రోజుల్లో హీరోలు మాట్లాడుతున్న విధానం కూడా ఏమాత్రం బాగుండడం లేదు. సినిమా ఫంక్షన్స్ చాలా ఇరిటేట్ చేసి గొప్పలు చెప్పుకుంటున్నారు. ఒక విధంగా ప్రేక్షకులను గౌరవించడం చాలా ముఖ్యం. అప్పట్లో ఎన్టీ రామారావు గారు ప్రేక్షకుల్లో దేవుళ్ళ అనేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం ఆడియన్స్ ముందు హీరోలు ఆ విధంగా మాట్లాడడం లేదు. నేటితరం యువ హీరోలు వారి ఆలోచన విధానం మార్చుకుంటే చాలా మంచి సినిమాలు వస్తాయి అని తమ్మారెడ్డి భరద్వాజ తెలియజేశారు.

  English summary
  Bharadwaja Thammareddy reaction on arjun and vishwak sen issue..
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X