»   » భరత్ అనే నేను: ఆ సెట్స్ కోసం ఎంత ఖర్చు చేశారో తెలిస్తే షాకవుతారు!

భరత్ అనే నేను: ఆ సెట్స్ కోసం ఎంత ఖర్చు చేశారో తెలిస్తే షాకవుతారు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన 'భరత్ అనే నేను' చిత్రం ఏప్రిల్ 20న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. విడుదలకు మూడు రోజులు మాత్రమే సమయం ఉండటంతో ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమా విడుదల దగ్గరపడుతున్న కొద్దీ పలు ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా ఈ సినిమాలో రెండు సెట్ల కోసం చేసిన ఖర్చు వివరాలు బయటకు వచ్చాయి.

సినిమాలో ఓ పాట కోసం భారీ టెంపుల్ సెట్ వేశారు. ఇందుకోసం ఏకంగా రూ. 4 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా మరో సెట్ కోసం ఏకంగా రూ. 2 కోట్లు ఖర్చు చేశారు. సినిమా అద్భుతంగా రావడానికి నిర్మాత డివివి దానయ్య ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా ఖర్చు పెట్టాడు అని చెప్పడానికి ఈ రెండు ఉదాహరణలు చాలు.


భరత్ అనే నేను చిత్రాన్ని దాదాపు రూ. 65 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కించారు. మహేష్ బాబు కెరీర్లోని భారీ చిత్రాల్లో దీన్ని ఒకటిగా చెప్పుకుంటున్నారు. మహేష్ తొలిసారి ముఖ్యమంత్రి పాత్రలో కనిపిస్తుండటం మరో ప్రత్యేకత.


Bharat Ane Nenu movie temple set cost Rs 4 cr

మహేష్ బాబు సినిమా అంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ అంచనాలకు తగిన విధంగానే సినిమాను కనీవినీ ఎరుగని రీతిలో విడుదల చేస్తున్నారు. యూఎస్ఏలో ఏప్రిల్ 19వ తేదీన 2 వేల ప్రీమియర్ షోలు వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 2 వేలకు పైగా థియేటర్లలో ఈ చిత్రం విడుదలవుతోంది. మహేష్ కెరీర్లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించే చిత్రం అవుతుందని భావిస్తున్నారు.


ఈ సినిమాకు సంబంధించిన టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్ సోమవారమే ప్రారంభం అవ్వగా.... కొని నిమిషాల్లోనే టికెట్స్ అని హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఫస్ట్ వీకెండ్‌కు సంబంధించిన అన్ని థియేటర్లలో హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.

English summary
Film Nagar source siad that, a temple set of Rs 4 crore was built for Bharat Ane Nenu movie song. If that was not enough, more Rs 2 crore were invested in putting up the set. Looks the total cost of the temple set in the film must be more than anything else.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X