»   » భరత్ సభకు ప్రేమతో తారక్.... ఆకట్టుకుంటున్న పోస్టర్!

భరత్ సభకు ప్రేమతో తారక్.... ఆకట్టుకుంటున్న పోస్టర్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొలిటికల్ ఎంటర్టెనర్ 'భరత్ అనే నేను'. ఈ చిత్రంలో మహేష్ బాబు ముఖ్యమంత్రి పాత్రలో కనిపించబోతున్నారు. ఏప్రిల్ 20న సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రమోషన్ల జోరుపెంచారు. రాజకీయాల నేపథ్యంలో సాగుతున్న సినిమా కావడంతో ఆ ఫీల్ వచ్చేలా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఏప్రిల్ 7న 'భరత్ బహిరంగ సభ' పేరుతో తెలుగు సినిమా చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ప్రీ రిలీజ్ ఈవెంటు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. భరత్ సభకు ప్రేమతో తారక్ అంటూ.... మహేష్-ఎన్టీఆర్‌లతో కూడిన పోస్టర్ చిత్ర బృందం విడుదల చేసింది.

మహేష్ బాబు స్వయంగా ఎన్టీఆర్‌కు ఫోన్ చేసి ఎన్టీఆర్‌ను బహిరంగ సభకు ఆహ్వానించినట్లు తెలుస్తోంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈచిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.

ఎల్బీ స్టేడియంలో జరిగే భరత్ బహిరంగ సభ కోసం ఆల్రెడీ పనులు మొదలయ్యాయి. సభ కోసం భారీ వేదికను ఏర్పాటు చేస్తున్నారు. వేలల్లో అభిమానులు తరలి రానున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేశారు.

English summary
Bharat Ane Nenu audio launch is going to happen on April 7th, 2018 at LB Stadium. Preparations are going on full swing for grand audio launch event of this political drama. For this audio function the chief guest is non other than our Young tiger NTR, NTR will grace the audio release event of Bharat Ane Nenu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X