twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టెన్సన్‌‌తో చేతులు వణికాయి.. ఎంజీఆర్, శివాజీ గణేషన్ గుర్తొచ్చారన్నారు.. మహేష్‌బాబు

    By Rajababu
    |

    ప్రిన్స్ మహేష్‌బాబు, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన భరత్ అనే నేను చిత్రం విజయఢంకా మోగిస్తున్నది. భారీ వసూళ్లను సాధిస్తూ బ్లాక్‌బస్టర్‌గా దిశగా దూసుకెళ్తున్నది. ఈ నేపథ్యంలో భరత్ అనే నేను సక్సెస్ మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్స్ మహేష్‌బాబు, సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్, కియారా అద్వానీ, డీవీవీ దానయ్య తదితరులు పాల్గొన్నారు. సక్సెస్ మీట్ అనంతరం మహేష్‌బాబు మీడియాతో మాట్లాడారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ప్రిన్స్ ఆసక్తికరంగా సమాధానం అందించారు.

    Recommended Video

    'Bharath Ane Nenu' Movie Collections
    నా పిల్లల పిల్లలకు చూపించే సినిమా

    నా పిల్లల పిల్లలకు చూపించే సినిమా

    శ్రీమంతుడు సినిమా తర్వాత గ్రామాల దత్తత తీసుకొన్నారు. భరత్ అనే నేను సినిమా తర్వాత సామాజిక అంశాలపై స్పందిస్తాను. కానీ భయటకు చెప్పుకోలేను. కానీ భరత్ అనే నేను సినిమా ప్రత్యేకమైనది. నా పిల్లల పిల్లలకు చూపించే విధంగా లైబ్రరీలో పెట్టుకొనే సినిమా.

     నాన్నకు జీవితాంతం రుణపడి ఉంటా

    నాన్నకు జీవితాంతం రుణపడి ఉంటా

    నా నటనపై మా నాన్న ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. భరత్ అనే నేను సినిమాలో డైలాగ్స్ అన్నీ నాన్న మాట్లాడినట్టే ఉన్నాయే మాట వినిపిస్తున్నది. ఇంత అందమైన కెరీర్‌ను ఇచ్చిన నాన్నకు జీవితాంతం రుణపడి ఉంటాను.

    సక్సెస్‌తో రిలీఫ్‌తో ఉన్నాను

    సక్సెస్‌తో రిలీఫ్‌తో ఉన్నాను

    భరత్ అనే నేను విజయం చాలా ఆనందం ఇచ్చింది. చాలా సంతోషంతో ఉన్నాను. ఎందుకంటే గత రెండేళ్లుగా ఒత్తిడి పెరిగింది. నా సినిమాలు ప్రేక్షకుల అంచనాలు చేరుకోలేకపోయాయి. భరత్ అనే నేను సక్సెస్ చాలా రిలీఫ్ ఇస్తుంది.

    సీఎం పాత్ర చేయడం ఆషామాషీ కాదు

    సీఎం పాత్ర చేయడం ఆషామాషీ కాదు

    ముఖ్యమంత్రి పాత్ర చేయడం ఆషామాషీ వ్యవహారం కాదు. ఈ పాత్ర కోసం ఎవరినీ అబ్జర్వ్ చేయలేదు. ఆ పాత్ర నమ్మడానికి కారణం శివగారు నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చారు. అప్పుడే నేను ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అవుతుందని నమ్మాను. సీఎం ఫైట్ ఎలా చేస్తాడని అనుమానం ఉండేది. కానీ అన్ని అనుమానాలను కొరటాల తీర్చేశాడు.

    రిలీజ్‌కు వణికిపోయాను

    రిలీజ్‌కు వణికిపోయాను

    సినిమా రిలీజ్‌కు ముందు టెన్షన్‌తో నాకు వణుకు వచ్చింది. గ్లాస్ పట్టుకొంటే చేతులు వణికాయి. శివ గారిని అడుగుదామని అనుకొంటే ఆయన బిజీగా ఉన్నారు. అప్పుడు 19వ తేదీన అమ్మను కలిశాను. ఆమె కాఫీ అంటే నాకు ఇష్టం. మా అమ్మ కాఫీ ఇస్తే తాగి వచ్చాను. తిరిగి వచ్చేటప్పుడు టెన్షన్ అంతా పోయింది.

    పూరీ జగన్నాథ్ తర్వాత కొరటాలకే..

    పూరీ జగన్నాథ్ తర్వాత కొరటాలకే..

    కొందరు డైరెక్టర్లు నాతో రెండోసారి చేసినప్పడు ఆ ప్రాజెక్టులు సక్సెస్ కాలేదు. చాలా మందితో వర్కవుట్ కాలేదు. ఒక్క పూరీ జగన్నాథ్‌కే సాధ్యపడింది. ఆ తర్వాత కొరటాల శివతో సాధ్యపడింది. మూడో చిత్రం కూడా ఇంతకు మించి విజయం సాధిస్తుంది.

    మన వాయిస్‌లానే ఉందే

    మన వాయిస్‌లానే ఉందే

    మా నాన్న ఈ సినిమా చూసి బాగా ఉంది అని చెప్పారు. నా సినిమా సక్సెస్ అయినప్పుడల్లా ఆయన ముఖంలో ఆనందం వెలుగుతుంది. ఈ సినిమాకు సంబంధించిన ఓత్ రిలీజ్ అయినప్పుడు నాకు ఫోన్ చేశారు. మన వాయిస్ మాదిరిగా ఉంది అని అన్నాడు.

    శివాజీ, ఎంజీఆర్ గుర్తొచ్చారు..

    శివాజీ, ఎంజీఆర్ గుర్తొచ్చారు..

    మా అన్నయ్యకు ఈ సినిమా బాగా నచ్చింది. ఆయనకు శివాజీ గణేషన్, ఎంజీఆర్ అంటే చాలా ఇష్టం. భరత్ అనే నేను చూస్తే వాళ్లు గుర్తొచ్చారని అన్నయ్య చెప్పారు. అది నాకు వచ్చిన పెద్ద కాంప్లిమెంట్.

    సక్సెస్ వార్తను నమ్రత..

    సక్సెస్ వార్తను నమ్రత..

    భరత్ అనే నేను సినిమా సక్సెస్ వార్త నాకు మొదట అందింది నా భార్య నమత్ర ద్వారా. అమెరికాలో రాత్రి రెండున్నర గంటలకు సినిమా ముగిసిన తర్వాత ఆమె బ్లాక్‌బస్టర్ అని చెప్పింది.

    English summary
    Bharat Ane Nenu movie set to release on April 20th. Prince Mahesh Babu and Kiara Advani are lead pair for this movie. Srimanthudu Fame Koratala Siva director for the movie. DVV Danaiah is producing this movie on DVV banner. In this occassion, Director Koratala Siva reveals about Bharat Ane nenu and Mahesh Babu in Bharat Ane Nenu succeess meet.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X