»   » ‘వచ్చాడయ్యో సామీ’....మార్మోగిపోతున్న ‘భరత్ అనే నేను’ సాంగ్!

‘వచ్చాడయ్యో సామీ’....మార్మోగిపోతున్న ‘భరత్ అనే నేను’ సాంగ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu
భరత్ అనే నేను: ‘వచ్చాడయ్యో సామీ’ సాంగ్ అదిరిపోయింది

మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన 'భరత్ అనే నేను' విడుదల సమయం దగ్గర పడటంతో ప్రమోషన్ల జోరు పెంచారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి రెండు పాటలు విడుదలవ్వగా గురువారం సాయంత్రం 5 గంటలకు మూడో పాటను విడుదల చేశారు. 'వచ్చాడయ్యో సామి' అంటూ సాగే ఈ పాట అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ప్రముఖ గాయకుడు ఖైలాష్ ఖేర్, దివ్య కుమార్ ఈ పాటను పాడగా... రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు.

లిరిక్స్ అద్భుతం...

వచ్చాడయ్యో సామీ.... నింగి చుక్కలతో గొడుగెత్తింది భూమి, ఇచ్చాడయ్యో సామీ కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ..... అంటూ రామజోగయ్య శాస్త్రి అద్భుతమైన లిరిక్స్ అందించారు. ఒక నాయకుడు ప్రజల మనిషిగా పేరు తెచ్చుకుంటే వారి నుండి ఎలాంటి స్పందన వస్తుందో ఈ పాట ద్వారా వివరించే ప్రయత్నం చేశారు.

 ముఖ్యమంత్రిగా మహేష్ బాబు

ముఖ్యమంత్రిగా మహేష్ బాబు

భరత్ అనే నేనులో మహేష్ బాబు ముఖ్యమంత్రిగా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఈ పాటలో మహేష్ బాబు లుంగీ కట్టుకుని ప్రజలతో కలిసి డాన్స్ చేస్తూ తెరపై కనిపించనున్నాడు. ఇందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు ఇప్పటికే చిత్ర యూనిట్ విడుదల చేసింది.

 దేవిశ్రీ సంగీతం ప్రధాన బలం

దేవిశ్రీ సంగీతం ప్రధాన బలం

ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన బాణీలు సమకూర్చారు. అటు మాస్ ఆడియన్స్, ఇటు క్లాస్ ఆడియన్స్ మెప్పిస్తూ మరో వైపు యూత్‌ను ఆకట్టుకునే విధంగా వివిధ వేరియేషన్లలో ట్యూన్స్ కంపోజ్ చేశాడు.

రెండు పాటలు హిట్

రెండు పాటలు హిట్

ఈ చిత్రానికి సంబంధించిన తొలి పాట ‘దిస్ ఈజ్ మి' ఇప్పటికే విడుదలై సూపర్ హిట్ అయింది. ఈ పాటను డేవిడ్ సిమన్ పాడగా, రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. రెండో పాటను ప్రముఖ బాలీవుడ్ నటుడు, దర్శకుడు పర్హాన్ అక్తర్ పాడగా ఏప్రిల్ 1న విడుదల చేశారు. ‘ఐ డోంట్ నో' అంటూ సాగే ఈ పాటకు అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

 భరత్ బహిరంగ సభ

భరత్ బహిరంగ సభ

‘భరత్ అనే నేను' చిత్రానికి సంబంధించిన పూర్తి ఆడియో ఏప్రిల్ 7న జరిగే ప్రీ రిలీజ్ వేడుకలో విడుదల చేయనున్నారు. ‘భరత్ బహిరంగ సభ' పేరుతో హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో భారీ ఎత్తున దీన్ని నిర్వహించబోతున్నారు.

ముఖ్య అతిథిగా ఎన్టీఆర్

ముఖ్య అతిథిగా ఎన్టీఆర్

ఈ చిత్రంలో మహేష్ బాబు ముఖ్యమంత్రి పాత్రలో కనిపించబోతున్నారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీ కావడంతో ప్రమోషన్లు కూడా డిఫరెంటుగా నిర్వహిస్తున్నారు. భరత్ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ హాజరయ్యే అవకాశం ఉందని టాక్. మహేష్ బాబు స్వయంగా ఎన్టీఆర్‌కు ఫోన్ చేసి ఎన్టీఆర్‌ను బహిరంగ సభకు ఆహ్వానించినట్లు తెలుస్తోంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈచిత్రం ఏప్రిల్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

English summary
After driving the audience crazy with the first two songs, the makers of Bharat Ane Nenu are thrill Mahesh Babu fans third song Vachaadayyo Saami. The Telugu flick, directed by Koratala Siva, will hit the screens on April 27.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X