భరత్ బహిరంగ సభకు పాసులున్నాయా? అయితే ఇలా వెళ్లండి!
శ్రీమంతుడు ఘన విజయం తర్వాత ప్రిన్స్ మహేష్‌బాబు, దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న చిత్రం భరత్ అనే నేను. ఈ చిత్రం ఏప్రిల్ 20న రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో రిలీజ్ వేడుకను భరత్ బహిరంగ సభ పేరుతో శనివారం (ఏప్రిల్ 7వ తేదీన) హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

భరత్ బహిరంగ సభ సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభం కానున్నది. ఈ వేడుకకు హాజరయ్యే వారికి పలు రకాల పాసులు జారీ చేశారు. మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ (ఎంఐపీ), వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ (వీవీఐపీ), వెరీ ఇంపార్టెంట్ పర్సన్ (వీఐపీ) పాసులను చిత్ర యూనిట్ జారీ చేసింది.

అయితే ఈ పాసులు కలిగి ఉన్నవారి కోసం హైదరాబాద్ పోలీసులు ఆంక్షలు విధించారు. పలు నిబంధనలను సూచించారు. ఎంఐపీ ఎంట్రీ పాసులు ఉన్నవారు గేట్ సీ-10, వీవీఐపీ ఎంట్రీ కోసం గేట్ డీ-6, వీఐపీ ఎంట్రీ పాసులు ఉన్నవారు గేట్ 7, 8,9 ద్వారా వెళ్లాలని అభిమానులకు సూచించారు.


Click it and Unblock the Notifications











