»   » భరత్ బహిరంగ సభ లైవ్: మహేష్, ఎన్టీఆర్ అరుదైన కలయిక.. ప్రకాశ్ రాజ్‌కు చేదు అనుభవం

భరత్ బహిరంగ సభ లైవ్: మహేష్, ఎన్టీఆర్ అరుదైన కలయిక.. ప్రకాశ్ రాజ్‌కు చేదు అనుభవం

Subscribe to Filmibeat Telugu

శ్రీమంతుడు వంటి బ్లాక్ బస్టర్ విజయం తరువాత కొరటాల శివ, మహేష్ బాబు సూపర్ హిట్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం భరత్ అనే నేను. మహేష్ బాబు నటిస్తున్న భరత్ అనే నేను చిత్రంపై ఆకాశాన్ని ఆకాశాన్ని తాకే అంచనాలు ఉన్నాయి. దీనితో మహేష్ ఫాన్స్ ఈ చిత్రంపై భారీ ఆశలు పెట్టుకుని ఉన్నారు. భరత్ అనే నేను చిత్రంలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి.

మహేష్ బాబు ఈ చిత్రంలో రాజకీయ నాయకుడిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కనిపించబోతున్నాడు. దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రాన్ని ఉత్కంఠ భరిత పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో బిగ్ ఈవెంట్ నేడు జరగుతున్నది. భరత్ బహిరంగ సభ పేరుతో ఎల్బీ స్టేడియంలో భారీ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు ఫిల్మీబీట్ లైవ్ అప్ డేట్స్ అందిస్తున్నది.


దేవీశ్రీ ప్రసాద్

దేవీశ్రీ ప్రసాద్

మహేష్ బాబు లాంటి పెద్ద స్టార్ హీరో సినిమాకు తారక్ లాంటి స్టార్ హీరో ముఖ్య అతిథిగా రావడం అందమైన విషయం. పాజిటివ్ అంశం. భరత్ అనే నేను సినిమా గురించి కాదు.. ఏదైనా మంచి సినిమా చూసినా లేదా ఏది నచ్చిన వెంటనే స్పందించి ప్రశంసిస్తారు. ఆయనది సూపర్ స్టార్ హార్ట్.. మహేష్ కూడా సూపర్ స్టార్. రంగస్థలం సినిమా పాటల గురించి మహేష్ స్పందించారు. ఈ సినిమా మ్యూజిక్ అద్భుతంగా రావడానికి జోగయ్య శాస్త్రి ఓ కారణం అన్నారు. భరత్ అనే నేను.. హామీ ఇస్తున్నాను పాట బాగా రావడానికి కారణమైన ఉదయ్‌ని అభినందించారు.


ప్రకాశ్ రాజ్

ప్రకాశ్ రాజ్

భరత్ అనే నేను సినిమా వేడుక వచ్చిన జనాన్ని చూస్తే ఆనందం వేసింది. అంతకంటే నా ఫేవరేట్ యాక్టర్లు మహేష్‌బాబు, ఎన్టీఆర్‌ను చూస్తుంటే ఇంకా చాలా ఆనందం వేసింది. వారంటే నాకు చాలా గౌరవం ఉంది. కొరటాల శివతో మిర్చి సినిమాలో చేయాల్సి ఉంది. ఆ తర్వాత శివ తీసిన జనతా గ్యారేజ్, శ్రీమంతుడు సినిమాలు చూసిన తర్వాత ఇంకా గౌరవం పెరిగింది. ప్రస్తుతం పరిస్థితుల్లో సినిమా అనేది చాలా వ్యయంతో కూడుకొన్నది. తెలుగు సినిమా అంటే వినోదమే కాదు అని మాట్లాడుతుండగా ప్రేక్షకులు గొడవ చేయడంతో ప్రకాశ్ రాజ్ మధ్యలోనే ప్రసంగాన్ని ఆపివేసి వెళ్లారు.


మహేష్, ఎన్టీఆర్‌తో ఆ సినిమా తీయాలని ఉంది

మహేష్, ఎన్టీఆర్‌తో ఆ సినిమా తీయాలని ఉంది

బ్రహ్మాజీ మాట్లాడుతూ.. మహేష్ బాబుని, ఎన్టీఆర్ ని ఓ ప్రేములో చూస్తుంటే తనకు ఓ ఐడియా వస్తోందని బ్రహ్మాజీ అన్నారు. ఎన్టీఆర్, మహేష్ బాబు లని పెట్టి దేవుచేసిన మనుషులు చిత్రం తీయాలని ఉందని బ్రహ్మాజీ అన్నారు. పోకిరి, యమదొంగ కలిస్తే తాను ప్రొడ్యూసర్ గా మారుతానని బ్రహ్మాజీ అన్నారు. తరువాతి చిత్రం మహేష్ బాబుతో తెస్తున్నట్లు కొరటాల శివ జనతా గ్యారేజ్ షూటింగ్ లోనే చెప్పారు. ఆ చిత్రంలో నీకు మంచి పాత్ర ఇస్తా అని అప్పుడే మాట ఇచ్చారు. అన్నట్లుగా ఆయన మాట నిలబెట్టుకున్నారని బ్రహ్మాజీ అన్నారు.


మహేష్ మరోసారి రిపీట్ చేయండి..

మహేష్ మరోసారి రిపీట్ చేయండి..

అద్భుతమైన స్వాగతం పలికిన హైదరాబాద్‌కు థ్యాంక్స్. ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన నిర్మాత డీవీవీ దానయ్యకు ధన్యవాదాలు. దర్శకులు శివ కొరటాల గారికి థ్యాంక్స్. మహేష్ బాబుతో నటించే అవకాశం రావడం చాలా అదృష్టం. మహేష్ బాబును మొదటిసారి కలిసినప్పుడు సార్ అని పిలిచాను. అయితే సార్ అని పిలువవద్దని అని అన్నారు. కానీ నేను ఆ అలవాటును మానలేకపోయాను. ప్రిన్స్ మహేష్ తన సినిమాలో ఒక హీరోయిన్‌కు ఒకేసారి అవకాశం ఇస్తారు. కానీ మళ్లీ మహేష్ సరసన నటించే అవకాశం ఇస్తారని ఆశిస్తున్నాను అని కైరా అద్వానీ అన్నారు.


వచ్చాడయ్యో సాంగ్.. వెండి తెర అద్భుతం

వచ్చాడయ్యో సాంగ్.. వెండి తెర అద్భుతం

రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ.. భరత్ అనే నేను చిత్రం నిజాయతీతో కూడిన అద్భుతం అని అన్నారు. కొద్ది సేపటి క్రితమే విడుదలైన జ్యూక్ బాక్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోందని అన్నారు. ఈ చిత్ర దర్శకుడు కొరటాల శివ ఆలోచనలు ఎంత విభిన్నంగా ఉంటాయో తనకు తెలుసు అని అన్నారు. పోస్టర్స్, టీజర్ రూపంలో మీరు చూసింది చాలా తక్కువ మాత్రమే అని అన్నారు. చూడాల్సింది చాలా ఉందని అన్నారు. తనతో దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ ఎప్పుడూ సూపర్ హిట్టే అని అన్నారు. పరభాషా గాయకులతో పాడించినప్పటికీ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్ర పాటల కోసం ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారని అన్నారు. 'వచ్చాడయ్యో' సాంగ్ వెండి తెరపై ఓ అద్భుతం అని అన్నారు. ఆ పాట నభూతో నభవిష్యతి అన్నట్లుగా ఉంటుందని రామజోగయ్య శాస్త్రి తెలిపారు. చిత్ర యూనిట్ కు కృతజ్ఞతలు తెలియజేస్తూ తన ప్రసంగాన్ని ముగించారు.


ఇలాంటి ఫంక్షన్ చూడలేదు..

ఇలాంటి ఫంక్షన్ చూడలేదు..

దిల్ రాజు మాట్లాడుతూ.. నేను ఇండస్ట్రీ వచ్చి 23 ఏళ్లు అయింది. నా కెరీర్‌లో ఇలాంటి ఫంక్షన్‌ను చూడలేదు. నిర్మాతలు దానయ్యకు థ్యాంక్స్. మహేష్, బాబు ఎన్టీఆర్ అభిమానులకు శుభాకాంక్షలు. ఓ స్టార్ హీరో సినిమాకు మరో స్టార్ హీరో ముఖ్య అతిథిగా రావడం చక్కటి పరిణామం. థ్యాంక్స్ తారక్. భారతీయ సినిమా పరిశ్రమకు ఇది మార్గదర్శకం కావాలి అని అన్నారు. భరత్ అనే నేను సినిమా ప్రస్తుత రాజకీయ వ్యవస్థపై విమర్శనాస్త్రం. కొరటాల శివ చిత్రంలో మంచి సందేశం ఉంటుంది. ఈ సినిమాలో కూడా చక్కటి సందేశాన్ని అందించారు అని దిల్ రాజు పేర్కొన్నారు.


భరత్ బహిరంగ సభ

భరత్ బహిరంగ సభ

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న భరత్ అనే నేను చిత్రం ఏప్రిల్ 20 న ప్రేక్షుకుల ముందుకు రాబోతోంది. కాగా నేడు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో భరత్ బహిరంగ సభతో భారీ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. కొద్ది సేపటి క్రితమే ఈ ఈవెంట్ ప్రారంభం అయింది. ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర భరత్ అనే నేను చిత్రం గురించి మాట్లాడారు.


ఏప్రిల్ 20 తరువాత

ఏప్రిల్ 20 తరువాత

భరత్ అనే నేను చిత్రం విన్నూత్నంగా ప్రమాణ స్వీకారంతో ప్రారంభం అయిందని మహేష్ బాబు అన్నారు. ఇప్పుడు భహిరంగ సభ జరుపుకుంటున్నాం.ఏప్రిల్ 20 తరువాత విజయోత్సవ ఊరేగింపు జరుగుతుందని అభిమానులని ఉత్సాహపరిచేలా అన్నారు. భరత్ అనే నేను చిత్రం తరువాత బాక్స్ ఆఫీస్ బద్దలైపోవడం ఖాయం అని అన్నారు. మరో నిర్మాత ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలియజేసారు.


సమాజంపై కొరటాలకు బాధ్యత

సమాజంపై కొరటాలకు బాధ్యత

మహేష్ బాబు ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్స్. మీ అందర్ని చూస్తే గొప్ప సినిమాలో పనిచేసినందుకు గర్వంగా ఉంది. కొరటాల శివ గురించి చెబితే సమాజం పట్ల ప్రేమ ఉండాలని తొలి సినిమా మిర్చి తీశాడు. సొంత గ్రామాన్ని బాగు చేసుకోవాలి.. ఊరికి ఏదైనా చేయాలి అనే పాయింట్‌తో శ్రీమంతుడు. మనుషుల కంటే ప్రకృతి గొప్పది అనే పాయింట్ జనతా గ్యారేజ్ తీశాడు. సమాజం పట్ల బాధ్యత ఉండాలనే పాయింట్‌తో నాలుగో సినిమా భరత్ అనే నేను తీశాడు. అందుకు చాలా థ్యాంక్స్ అని ఫైట్ మాస్టర్లు రామ్, లక్ష్మణ్ తెలిపారు.


 ఢిఫరెంట్ లాంగ్వేజ్‌తో మహేష్ ఫైట్స్

ఢిఫరెంట్ లాంగ్వేజ్‌తో మహేష్ ఫైట్స్

మహేష్ బాబుతో ఖలేజా చేశాం. ఆ తర్వాత చాలా గ్యాప్ తర్వాత భరత్ అనే నేను సినిమా చేశాం. ఈ చిత్రంలో డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్‌తో మహేష్ ఫైట్స్ ఉంటాయి. ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్స్ మహేష్, నిర్మాత డీవీవీ దానయ్యకు థ్యాంక్స్ అని రామ్ లక్ష్మణ్ పేర్కొన్నారు.


హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో

హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న భరత్ అనే నేను చిత్రం ఏప్రిల్ 20 న ప్రేక్షుకుల ముందుకు రాబోతోంది. కాగా నేడు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో భరత్ బహిరంగ సభతో భారీ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. కొద్ది సేపటి క్రితమే ఈ ఈవెంట్ ప్రారంభం ఐంది. సూపర్ స్టార్ కృష్ణ అభిమానులని ఉత్సాహ పరిచేలా ప్రసంగం చేసారు. భరత్ అనే నేను చిత్రం మహేష్ కెరీర్ లో నెం 1 చిత్రం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేసారు.


శ్రీమంతుడు

శ్రీమంతుడు

కొరటాల శివ, మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన శ్రీమంతుడు చిత్రాన్ని ఈ సందర్భంగా కృష్ణ గుర్తు చేసుకున్నారు. శ్రీమంతుడు చిత్రం టాలీవడ్ లో రికార్డులు తిరగరాసింది కృష్ణ అన్నారు. భరత్ అనే నేను చిత్రం అంతకంటే పెద్ద విజయం సాధించి మహేష్ కెరీర్ లో నెం 1 చిత్రం గా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేసారు. మహేష్ కోసం వేలాదిగా తరలి వచ్చిన అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేసారు. సంయమనం పాటించి ఈ వేడుకని ఘాన విజయం చేయాలని కృష్ణ అభిమానులని కోరారు.


మహేష్ ఎన్టీఆర్ పక్కపక్కనే, ఆయన వల్లే

మహేష్ ఎన్టీఆర్ పక్కపక్కనే, ఆయన వల్లే

మైత్రి నిర్మాతల్లో ఒకరైన నవీన్ మాట్లాడుతూ.. నవీన్ అనే నేను అంటూ ప్రసంగం ప్రారంభించి అలరించారు. ఎన్టీఆర్, మహేష్ బాబుని పక్కనే చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ అందమైన దృశ్యాన్ని చూసే అవకాశం కొరటాల శివ వల్లనే కలిగిందని అన్నారు. మిగిలిన ఇద్దరు నిర్మాతలు మోహన్, రవి కూడా భారత అనే నేను చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలియజేసారు.


English summary
Mahesh Babu’s upcoming film Bharat Ane Nenu is set to release on April 20 and it marks the debut actor Kiara Advani. Region-wise distributors are busy allocating shows and screens for the highly anticipated film, directed by Koratala Siva, who has teamed up with Mahesh for the second time after Srimanthudu. This movie audio function is conducting on the name of Bharat Bahiranga Sabha at LB Stadium of Hyderabad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X