‘భరత్ అనే నేను’.... ఫాస్టెస్ట్ రూ. 100 కోట్ల రికార్డ్ సొంతం!
మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన 'భరత్ అనే నేను' చిత్రం బాక్సాఫీసు వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తోంది. తాజాగా ఈ చిత్రం 2 రోజుల్లోనే రూ. 100 కోట్ల గ్రాస్ వసూలు చేసి నాన్ బాహుబలి కేటగిరీలో అంత్యంత వేగంగా ఈ మార్కును అందుకున్న చిత్రంగా రికార్డులకెక్కింది. మొదటి షో నుండే పాజిటివ్ మౌత్ టాక్ రావడంతో సినిమా విడుదలైన అన్ని చోట్లా అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్‌తో హౌస్ ఫుల్‌గా షోలు రన్ అవుతున్నాయి.
అఫీషియల్‌గా ప్రకటించిన డివివి సంస్థ
‘భరత్ అనే నేను' చిత్ర నిర్మాణ సంస్థ ‘డివివి ఎంటర్టెన్మెంట్స్' వారు ఈ చిత్రం 2 రోజుల్లోనే రూ. 100 కోట్లు గ్రాస్ సాధించిన విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించారు. ఈ రికార్డుతో మహేష్ బాబు అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

టాలీవుడ్ ఫాస్టెస్ట్ 100 కోట్ల గ్రాసర్స్
ఫాస్టెస్ట్ 100 కోట్లు సాధించిన చిత్రాల్లో ‘భరత్ అనే నేను'కంటే ముందు బాహుబలి ఫ్రాంచైజీ చిత్రాలు ఉన్నాయి. భరత్... తర్వాతి స్థానంలో రంగస్థలం చిత్రం నిలిచింది. ఈ చిత్రం 4 రోజుల్లో 100 కోట్ల మార్కును అందుకోగా, ఖైదీ నెం .150 చిత్రం 6 రోజుల్లో రూ. 100 కోట్ల (గ్రాస్) మార్కును అందుకుంది.

ఫాస్టెస్ట్ యూఎస్ఏ 2 మిలియన్ గ్రాసర్
నాన్ బాహుబలి కేటగిరీలో ఫాస్టెస్ట్ 2 మిలియన్ డాలర్ వసూలు చేసిన రికార్డు కూడా ‘భరత్ అనే నేను' చిత్రం సొంతమైంది. మున్ముందు ఈచిత్రం టాలీవుడ్లో మరిన్ని రికార్డులను బద్దలు కొడుతుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మహేష్ బాబు అభిమానులను ఊరిస్తున్న రికార్డులు
హయ్యెస్ట్ గ్రాసర్ యూఎస్ఏ : రంగస్థలం ($3.5 మిలియన్)
హయ్యెస్ట్ గ్రాసర్ ఓవర్సీస్ మార్కెట్: రంగస్థలం( రూ. 30 కోట్లకుపైగా)
హయ్యెస్ట్ గ్రాసర్ ఇన్ తెలుగు స్టేట్స్: రంగస్థలం (రూ. 125 కోట్లు)
హయ్యెస్ట్ గ్రాసర్ ఇన్ గ్లోబల్ మార్కెట్: రంగస్థలం (రూ. 182 కోట్లుకుపైగా)
రూ. 200 కోట్ల గ్రాసర్..... (నాన్ బాహుబలి కేటగిరీలో ఇప్పటి వరకు ఏదీ లేదు)


Click it and Unblock the Notifications











