»   »  రాంచరణ్ తేజ...భాస్కర్ కాంబినేషన్ ?

రాంచరణ్ తేజ...భాస్కర్ కాంబినేషన్ ?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Bhaskar
'పరుగు' సినిమాతో దిగాలు పడ్డ బొమ్మరిల్లు భాస్కర్ ఇప్పుడు కొత్త ఉత్సాహంతో ఉన్నాడుట. అతని సబ్జెక్టుని చిరంజీవి ఫ్యామిలీ ఓ.కె.చేయటం అతనికి చెప్పలేని సంతోషాన్ని ఇస్తోందట. రామ్ చరణ్ తేజ తో ఆ సినిమా ఉంటుందిట. చిరుత ఒక్క సినిమాతోనే బయిట మంచి పేరు తెచ్చుకున్న యువ నటుడు అతను. రామ్ చరణ్ ప్రస్తుతం యస్‌యస్ రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఆ సినిమా తర్వాత అతను సొంత నిర్మాణ సంస్థ అంజనా ప్రొడక్షన్స్‌లో నటించనున్నాడనే వార్త వచ్చింది. దానికే బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించబోతున్నాడు.

పరుగు చిత్రానికి మొదట్లో ఆ సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా, కలెక్షన్లు నిలకడగా వున్నాయి. అయినా ఆ సినిమాను భాస్కర్ రూపొందించిన తీరు చిరంజీవికి బాగా నచ్చిందిట. అలాగే ఇప్పటికే అతను చెప్పిన లైను చిరంజీవిని బాగా ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. దాంతో అంజనా ప్రొడక్షన్స్ నిర్మించే సినిమాకు అతన్నే దర్శకుడిగా తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. రాజమౌళితో చేస్తున్న సినిమా పూర్తయిన వెంటనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనున్నది. దీని కోసం లవ్,యాక్షన్, ఫ్యామిలీ డ్రామా మేళవించిన కథను భాస్కర్ సిద్ధం చేస్తున్నాడుట . గ్యాంగ్ లీడర్ తరహాలో తయారయ్యే ఈ సినిమాకు నాగబాబు నిర్మాత కాగా, చిరంజీవి సమర్పకునిగా వ్యవహరించనున్నారు. యేదైమైనా భాస్కర్ అదృష్టవంతుడు అంటున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X