twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘Bheemla Nayak థియేటర్ల ఓనర్లకు అధికారుల బెదిరింపులు.. జగన్ సర్కార్‌కు చెడ్డపేరు‘

    |

    ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు సస్పెండ్ చేసిన సినిమా టిక్కెట్ల రేట్ల జీవో 35ను రెవిన్యూ అధికారులు అమలుపరచడం ఎంతమాత్రం కరెక్ట్ కాదని ప్రముఖ నిర్మాత నట్టికుమార్ స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్‌లోని ఫిలింఛాంబర్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో తెలుగ చలనచిత్ర నిర్మాతల మండలి కార్యవర్గంతో కలసి ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో నట్టి కుమార్ మాట్లాడుతూ,.

    థియేటర్లపై దాడులు.. అధికారులు బెదిరింపులు

    థియేటర్లపై దాడులు.. అధికారులు బెదిరింపులు

    పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. అయితే ఈ సినిమా రిలీజ్‌‌కు ముందు ఆంధ్రప్రదేశ్‌లో చాలా రకాల ఫిర్యాదులు మా దృష్టికి వచ్చాయి. ఎగ్జిబిటర్లు, థియేటర్ ఓనర్లపై ఆర్డీవోలు, ఎమ్మార్వోలు, ఆర్‌ఐలు వెళ్లి పాత జీవోను అమలు చేయాలని బెదిరిస్తున్నారని తెలిసింది. హైకోర్టు రద్దు చేసిన జీవో 35 ప్రకారం.. 5 రూపాయలు, 15 రూపాయలు, 25 రూపాయలకే టికెట్లు అమ్మాలి. వాటి కంటే ఎక్కువ అమ్మితే చట్టప్రకారం చర్యలు తీసుకొంటామని బెదిరిస్తున్నారు. దాంతో మేము సినిమాను ప్రదర్శించలేమని డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు భయపడుతున్నారు. ఈ విషయం గురించి నిన్న సాయంత్ర 4 గంటల నుంచి రాత్రి ఒంటిగంట వరకు చర్చలు జరిపాం అని నిర్మాత నట్టి కుమార్ చెప్పారు.

    హైకోర్టు ఆదేశాలు ప్రకారమే టికెట్ రేట్లు

    హైకోర్టు ఆదేశాలు ప్రకారమే టికెట్ రేట్లు

    ఏపీలో ప్రభుత్వ అధికారుల నిర్వాకం వల్ల డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు భయాందోళనలో ఉన్నారు. వారికి భరోసా ఇవ్వడానికే నిర్మాతల మండలి, ఫిలిం ఛాంబర్ సంయుక్తంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశాం. ఏపీలో చోటుచేసుకొంటున్న పరిణామాల గురించి జాయింట్ కలెక్టర్లకు, ఇతర అధికారులకు విన్నపం చేయాలనుకొంటున్నాం. హైకోర్టు ఆదేశాలు, ఆర్డర్ ప్రకారం టికెట్ల రేట్లు ఉండేలా చేయాలి. ప్రభుత్వం కొత్త జీవో అమలు చేసే వరకు పాత జీవోను అమలు చేయాలి అని నట్టి కుమార్ తెలిపారు.

    జాయింట్ కలెక్టర్లు తప్పు చేస్తున్నారు అంటూ

    జాయింట్ కలెక్టర్లు తప్పు చేస్తున్నారు అంటూ


    ఏపీలో ప్రభుత్వ అధికారులు దాడులు నిర్వహించడం వారి బాధ్యత. అయితే థియేటర్లలో 5 రూపాయలకు టికెట్ అమ్మాలని చెప్పడం తప్పు. పది రూపాయలకు అమ్మాలని చెప్పడం ఆర్టీవోల తప్పు. 25 రూపాయలకు అమ్మాలని చెప్పడం జాయింట్ కలెక్టర్ల తప్పు. గతంలో ఏవైతే జీవోలు ఉన్నాయో.. వాటి ప్రకారమే నిబంధనలను అమలు చేయాలి. ప్రధాన న్యాయమూర్తి క్లియర్‌గా ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి ఆ ఆదేశాలను ప్రభుత్వ అధికారులు పాటించాలి. జీవో 35ను అమలు చేయడం తప్పు అని నట్టి కుమార్ స్పష్టం చేశారు.

    జగన్ ప్రభుత్వానికి బ్యాడ్ చేయాలని..

    జగన్ ప్రభుత్వానికి బ్యాడ్ చేయాలని..


    చిరంజీవి, ఇతర సినీ ప్రముఖులతో జరిగిన మీటింగ్‌లో ఏపీ సీఎం మాట్లాడిన విధానం బట్టి మంచి వసతులు, మేలు చేసే అంశాలు ఉంటాయని భావిస్తున్నాం. అయితే అధికారులు నిర్వాకం వైఎస్ జగన్ దృష్టికి వెళ్లకపోవచ్చు. డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లపై జాయింట్ కలెక్టర్లు బెదిరించకుండా చర్యలు తీసుకోవాలి. కొందరు ప్రతిపక్షానికి చెందిన వారు కూడా ప్రభుత్వానికి బ్యాడ్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇలాంటివి జరుగకుండా వైఎస్ జగన్ సర్కారు చర్యలు తీసుకోవాలి అని నట్టి కుమార్ చెప్పారు.

    Recommended Video

    Bheemla Nayak Trailer Records భీమ్లా నాయక్ రికార్డుల బీభత్సం Pre Booking Status | Filmibeat Telugu
    జాయింట్ కలెక్టర్ల తీరు బాగా లేదు..

    జాయింట్ కలెక్టర్ల తీరు బాగా లేదు..


    పీఆర్సీ విషయంలో న్యాయం జరుగలేదని విజయవాడలో కదం తొక్కిన అధికారులు.. ఇప్పుడు థియేటర్ల వద్దకు వచ్చి బెదిరింపులకు పాల్పడం సమంజసమేనా? బ్లాక్‌లో టికెట్లు అమ్మితే చర్యలు తీసుకోండి. కానీ 5. 15. 25 రూపాయలకు టికెట్లు అమ్మాలని టార్చర్ పెట్టకూడదు. దీని వల్ల జగన్ సర్కార్‌ నుంచి మంచి పేరు తెచ్చుకోవడానికి జాయింట్ కలెక్టర్లు ప్రయత్నిస్తున్నారు. కాబట్టి జగన్ సర్కార్‌కు చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి జీవో ప్రకారం టికెట్లను అమ్మండి అని నట్టికుమార్ అన్నారు.

    English summary
    Bheemla Nayak release contraversy is going in Andhra Pradesh. Ticket rates issue make hot topic in the media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X