Don't Miss!
- Sports
అప్పుడు బీసీసీఐ మోసం చేసింది.. అందుకే ప్రాక్టీస్ మ్యాచ్ ఆడటం లేదు: స్టీవ్ స్మిత్
- News
ఎవరికి దేవుడు? ఎందుకు దేవుడు?
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Lifestyle
ఈ రాశుల వారు భగ్నప్రేమికులు, అలా పడిపోతారు ఇలా విడిపోతారు
- Finance
Adani Enterprises FPO: అనుకున్నది సాధించిన అదానీ.. మూడో రోజు మ్యాజిక్.. ఏమైందంటే..
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్లోని ఈ సరస్సులు!
ఒంటి నిండా దెబ్బలతో పవన్ కల్యాణ్.. నులక మంచం మీద పడుకుని కనిపించిన స్టార్ హీరో
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అనేకరకాల మల్టీస్టారర్ సినిమలు త్వరలోనే తెరపైకి రాబోతున్న విషయం తెలిసిందే. కరోనా లాక్ డౌన్ లేకపోయి ఉంటే ఈ ఏడాదిలోనే కొన్ని మల్టీస్టారర్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేవి. కానీ అనుకోకుండా ఆ సినిమాలన్నీ కూడా వచ్చే ఏడాది సంక్రాంతికి రాబోతున్నాయి. ముఖ్యంగా అందులో RRR సినిమా తర్వాత భీమ్లా నాయక్ విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా కోసం మెగా అభిమానులు మాత్రమే కాకుండా మిగతా సినీ ప్రేక్షకులు కూడా చాలామంది ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక సినిమాకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన ఫొటో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అంచనాలు ఆకాశాన్ని దాటేశాయి
మలయాళం ఇండస్ట్రీలో బాక్సాఫీస్ హిట్ గా నిలిచినటువంటి అయ్యప్పన్ కోశియుమ్ రీమేక్ లో పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ గా, రానా దగ్గుబాటి డానియల్ శేఖర్ గా కనిపించబోతున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందిస్తున్న ఈ సినిమాని సాగర్ కే చంద్ర డైరెక్ట్ చేస్తున్నాడు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సినిమాలో ఇద్దరు అగ్ర హీరోలు పోటీకి సిద్ధం కావడంతో ప్రేక్షకుల్లో అయితే అంచనాలు ఆకాశాన్ని దాటేశాయి. ఈ కథలో వచ్చే యాక్షన్ సన్నివేశాలు కూడా ఎలా ఉంటాయో అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

సాంగ్స్ కు పాజిటివ్ రెస్పాన్స్
భీమ్లా నాయక్ సినిమాకు సంబంధించిన పోస్టర్స్ టీజర్స్ చాలా వరకు ఇప్పటికే సోషల్ మీడియాలో భారీ స్థాయిలో హైప్ క్రియేట్ చేశాయి. అలాగే టైటిల్ సాంగ్ తో పాటు నిత్య మీనన్ తో చేసిన ప్రేమ పాటకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రెండు పాటలతో పాటు చిత్ర యూనిట్ మధ్య మధ్యలో కొన్ని పోస్టర్స్ కూడా విడుదల చేస్తూ వచ్చింది. ప్రమోషన్ విషయంలో అయితే చిత్ర యూనిట్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదని అర్థమవుతోంది.

ఫైట్ చేసి అలసిపోయిన హీరోలు
రీసెంట్ గా పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటికి సంబంధించిన ఆఫ్ స్క్రీన్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ గాయాలతో నులక మంచం మీద కొంచెం అలసిపోయినట్లు కనిపిస్తున్నాడు. ఇక రానా దగ్గుబాటి కూడా ఫైట్ చేసిన అనంతరం ఎడ్ల బండి మీద పవన్ కళ్యాణ్ తో కలిసి చాలా కూల్ గా సేద తీరుతూ కనిపించడం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ ఇద్దరు కూడా కెమెరా ముందు భద్ర శత్రువులుగా కెమెరా వెనుక ఇలా మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు అనిపిస్తోంది.
Recommended Video

హై వోల్టేజ్ సీన్స్
సినిమా కథలో భాగంగా ఈ ఇద్దరు కూడా అహం వలన కొట్టుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇక ఇద్దరి మధ్య వచ్చే కొన్ని యాక్షన్ సన్నివేశాలు అయితే వెండితెరపై హై వోల్టేజ్ ఫీలింగ్ ను కలిగిస్తాయి అని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి ఇద్దరూ కూడా స్టార్ హీరోలు కాబట్టి ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని టాక్.
ఇక ఈ సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్స్ పై నాగ వంశీ నిర్మిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నాడు ఇక వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నారు. మరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి.