»   » ‘భీమవరం బుల్లోడు’ ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్ (ఫోటోలు)

‘భీమవరం బుల్లోడు’ ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్ (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సునీల్-ఎస్తేర్ (1000 అబద్దాలు ఫేం) జంటగా ఉదయ శంకర్ దర్శకత్వంలో ప్రఖ్యాత నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న చిత్రం భీమవరం బుల్లోడు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 27న విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఆడియో విజయం సాధించిన నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్ ఏర్పాటు చేసారు.

ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్‌కు సంబంధించిన ఫోటోలు, సినిమాకు సంబంధించిన వివరాలు స్లైడ్ షోలో....

ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టెనర్

ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టెనర్


భీమవరం బుల్లోడు చిత్రాన్ని ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టెనర్‌గా తెరకెక్కిస్తున్నారు. సునీల్ సినిమాల నుండి ఆశించే అన్ని కమర్షియల్ అంశాలు ఇందులో ఉండనున్నాయి.

సునీల్ మాట్లాుడూ

సునీల్ మాట్లాుడూ


హీరో సునీల్ మాట్లాడుతూ 'కమెడియన్‌గా నా నుంచి ప్రేక్షకులు మిస్సవుతున్న ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సినిమాలో ఉంటుంది' అన్నారు. దర్శకుడు ఉదయ్ శంకర్ మాట్లాడుతూ- సునీల్ పాత్ర వైవిధంగా ఉంటుందని తెలిపారు. భీమవరం నివాసి అయిన సునీల్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ఈ పేరు పెట్టడం విశేషమని, పాడింగ్ ఆర్టిస్టులందరూ చిత్రంలో నటిస్తున్నారని అన్నారు.

నటీనటులు

నటీనటులు


తనికెళ్ల భరణి, జయప్రకాష్ రెడ్డి, షాయాజి షిండే, రఘుబాబు, పోసోని కృష్ణమురళి, అదుర్స్ రఘు, సత్యం రాజేష్, శ్రీనివాసరెడ్డి, గౌతంరాజు, తాగుబోతు రమేష్, సామ్రాట్, తెలంగాణా శకుంతల, సన, శివపార్వతి, బెంగళూరు పద్మ, విష్ణుప్రియ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

టెక్నీషియన్స్

టెక్నీషియన్స్


ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కథ: కవి కాళిదాస్, మాటలు: శ్రీధర్ సీపన, ఛాయాగ్రహణం: సంతోష్ రాయ్, కూర్పు: మార్తాండ్ కెం. వెంకటేష్, కళ: వివేక్, అసిస్టెంట్ డైరెక్టర్స్: బి.జి నాయుడు-రమేష్ పప్పు, నిర్మాత: డి. సురేష్ బాబు, చిత్రానువాదం-దర్శకత్వం: ఉదయశంకర్

English summary
Bhimavaram Bullodu Movie Platinum Disc Function held at Hyderabad. Actor Sunil, Actress Ester Noronha, Director Uday Shankar, Anoop Rubens graced the event.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu