For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మా సినిమా మక్కీకి మక్కీ కాపీ కాదు

  By Srikanya
  |

  హైదరాబాద్: తమిళంలో విజయం సాధించిన 'తమిళ్ పడమ్' ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించాను. ఇది మక్కీకి మక్కీ కాపీ కాదు. మాతృకలోని విషయాన్ని మాత్రమే తీసుకొని మన నేటివిటీకి మార్చుకొని, పేరడీ కోసం ఇక్కడి సినిమాల్ని తీసుకొని 'సుడిగాడు' చేయడానికి ఎంతో కష్టపడ్డాం అంటున్నారు భీమినేని శ్రీనివాసరావు. ఆయన కొంత గ్యాప్ తీసుకుని దర్శకత్వం వహించిన చిత్రం 'సుడిగాడు'. అల్లరి నరేశ్ హీరోగా అరుంధతి మూవీస్ పతాకంపై చంద్రశేఖర్ డి. రెడ్డి దీనిని నిర్మించారు. 'ఒకే టికెట్‌పై వంద సినిమాలు' అనే ఉప శీర్షికతో తయారైన ఈ చిత్రం శుక్రవారం విడుదలవుతున్న సందర్భంగా భీమనేని మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు.

  అలాగే... ఇప్పటివరకు తెలుగులో పేరడీ సినిమాలు చాలానే వచ్చాయి. అయితే మొదట్నించీ ఆఖరుదాకా హీరో మీద పేరడీ నడవడం ఇదే తొలిసారి. ఇందులో పేరడీలు తప్ప కథ ఉండదేమోనని అపోహపడొద్దు. పేరడీలనేవి కథలో అంతర్భాగంగా ఉంటాయి. అందువల్ల ప్రేక్షకులకు ఆద్యంతం వినోదం లభిస్తుంది. మా పరిమితులు తెలుసు కాబట్టి ఎవర్నీ కించపరచకుండా, నొప్పించకుండా పేరడీలు చేశాం. ఎంతో కష్టపడితేనే ఏ హీరోకైనా ఇమేజ్ వస్తుంది, అభిమానులు ఏర్పడతారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఏ హీరో ఇమేజ్‌నీ మేం డామేజ్ చేయలేదు అన్నారు.

  ఇక మేం పేరడీ చేసింది సినిమాల మీదే కానీ, హీరోల మీదకాదు. హీరోలు, వారి అభిమానులు కూడా ఆస్వాదించేలా ఆ పేరడీలు ఉంటాయి. ఒక్కో సినిమా నుంచి ఒక్కో అంశాన్ని తీసుకుని కథలో మిళితం చేశాం. అవి సీన్లు కావచ్చు, డైలాగ్స్ కావచ్చు, నేపథ్య సంగీతం కావచ్చు, పాట కావచ్చు, లొకేషన్లు కావచ్చు, గెటప్స్ కావచ్చు. పాత సినిమాల్నీ పేరడీ చేసినప్పటికీ ఎక్కువగా ఈ తరం ప్రేక్షకులకు చేరువ కావాలనే ఉద్దేశంతో 2000 సంవత్సరం నుంచి ఇప్పటివరకూ రిలీజైన సినిమాల్నే ఎక్కువగా పేరడీ చేశాం అని చెప్పుకొచ్చారు.

  ఆ పేరడీ చేసిన వాటిల్లో... భారతీయుడు, అపరిచితుడు, దూకుడు, గబ్బర్‌ సింగ్ వంటి సినిమాలున్నాయి. పోస్టర్ల విషయంలోనూ పేరడీలు చేశాం. వాటికీ మంచి స్పందన వచ్చింది. రెండు మూడుసార్లు చూస్తారు అని ధీమా వ్యక్తం చేసారు. ఈ సబ్జెక్ట్‌తో సినిమా చెయ్యడానికి చాలామంది ప్రయత్నించారు. చివరకు నాకు ఈ అవకాశం దక్కింది. నరేశ్ వందశాతం మనసుపెట్టి ఈ సినిమా చేశాడు. ఇప్పటికే అతను కొన్ని సినిమాల్లో పేరడీలు చేశాడు కాబట్టి అల్టిమేట్‌గా తీద్దామన్నాడు. అలాగే తీశాం. నరేశ్ కెరీర్‌లో ఇది బిగ్గెస్ట్ ఫిల్మ్ అవుతుంది. 2.15 గంటల సినిమాలో ప్రతి సీనూ సరదాగా నడుస్తుంది. అందుకే ఓసారి చూసినవాళ్లు మరో రెండు మూడుసార్లు చూస్తారు అన్నారు.

  English summary
  Sudigadu's trailers have created great buzz as it showcased Allari Naresh imitating all the top stars from the popular Telugu films. The film, which is the remake of the Tamil cult comedy, "Tamil Padam", is coming with a tag line like "Okka Ticket Pi Vanda Cinemalu".
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X