twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మరో వివాదంలో రవి కిషన్.. ఈ సారి టైటిల్ కొట్టేశారు అంటే!

    |

    ఎంపీ రవికిషన్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. అయితే ఈసారి ఆయనపై సంచలన రీతిలో దొంగతనం ఆరోపణలు వచ్చాయి. ఇది మాములు దొంగతనం అనుకునేరు, కాదు అండోయ్, సినిమా టైటిల్ దొంగతనం. 'ది కన్వర్షన్' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వినోద్ తివారీ రవికిషన్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. దానికి సంబందించిన వివరాల్లోకి వెళితే

    గోరఖ్‌పూర్ జిల్లాపై వివాదం

    గోరఖ్‌పూర్ జిల్లాపై వివాదం


    దర్శకుడు వినోద్ తివారీ మాట్లాడుతూ, 2016 సంవత్సరంలో తాను ఒక చిత్రాన్ని ప్రకటించానని, ఆ చిత్రానికి 'జిల్లా గోరఖ్‌పూర్' అనే పేరును ఎంచుకున్నారు. ఇటీవల, రవి కిషన్ తాను నటిస్తున్న తాజా చిత్రం పోస్టర్‌ను కూడా విడుదల చేశాడు, రవి కిషన్ చిత్రానికి కూడా 'గోరఖ్‌పూర్' అని పేరు పెట్టాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని అంటున్నారు.

    టైటిల్ హక్కులపై రచ్చ

    టైటిల్ హక్కులపై రచ్చ


    ఈ విషయంపై వినోద్ తివారీ మరింత క్లారిటీ ఇస్తూ, ఈ టైటిల్ ను ఇంపా(ఇండియన్ మోషన్ పిక్చర్స్ అసోసియేషన్) ఇలా ఇష్యూ చేయలేదని కూడా చెప్పాడు. ఈ టైటిల్ కాపీ హక్కులన్నీ నా దగ్గరే ఉన్నాయన్నా ఆయన పది రోజుల క్రితమే రవికిషన్ ఈ పేరుతో సినిమా తీస్తున్నాడని తెలిసింది. ఇంపా' ద్వారా నాకు లేఖ కూడా వచ్చిందన్ ఆయన ఈ విషయంపై రవికిషన్ తో కూడా మాట్లాడారని చెప్పుకొచ్చారు.

    షాక్ ఇచ్చిందని

    షాక్ ఇచ్చిందని


    వినోద్ తివారీ మాట్లాడుతూ 'ఈ సినిమా గురించి రవికిషన్‌తో ఇంతకు ముందు మాట్లాడానని, ఇద్దరి కామన్ ఫ్రెండ్ కి కథ చెప్పామని అన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ, 'నేను రవికిషన్ జీకి వ్యక్తిగత సందేశం కూడా పంపాను అలాగే టైటిల్ గురించి ప్రశ్నలు అడిగానని అన్నారు. వ్యక్తిగతంగా తాను ఈ ప్రాజెక్ట్ కోసం చాలా కష్టపడ్డానని, నా పని ఇప్పటికే అయింది సినిమా మొదలు పెట్టడమే అనుకుంటున్న సమయంలో రవి చేసిన ఈ ప్రాజెక్ట్ ప్రకటన నాకు షాక్ ఇచ్చిందని అన్నారు.

    కుదర లేదు అని

    కుదర లేదు అని


    వినోద్ మాట్లాడుతూ, 'నేను ఇప్పటికే రవి జీతో గోరఖ్‌పూర్ జిల్లా మూవీ గురించి మాట్లాడాను. రాజేష్ మిత్ర ఈ కథను రవికి ఒకటిన్నర సంవత్సరాల క్రితం చెప్పాడు. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి అతని మేనేజర్ గురించి కూడా మాట్లాడాడని, నేను అతనిని కలవాలనుకున్నాను కానీ కుదర లేదు అని అన్నారు.. ఇన్‌స్టాలో అతని పోస్టర్ చూసినప్పుడు అది నా సినిమా పోస్టర్ లానే ఉంది. ఆయన ఈ పోస్టర్ చూసి ఆశ్చర్యపోతున్నాను.

    రిజిస్టర్ అయి ఉంటే

    రిజిస్టర్ అయి ఉంటే


    గౌరవ ఎంపీ గారు మనలాంటి వారి కృషిని గమనించాలని, ఆరేళ్ల క్రితమే నా సినిమా టైటిల్ కాపీరైట్ పొందాను. నాకు హిందీతో పాటు భోజ్‌పురి భాషలోనూ సినిమా చేసే అధికారం ఉందని అన్నారు. ఇంపా కేవలం రవి జీ పేరుతో నోటీసులు జారీ చేసిందని అన్నారు. మరోవైపు, పోస్టర్ కాపీరైట్ వివాదంపై రవి కిషన్ కూడా స్పందించారు. ఇలాంటివి ఉంటే వారిని రిక్వెస్ట్ చేసి ఈ టైటిల్ తీసుకుంటామని, అతని పేరు మీద రిజిస్టర్ అయి ఉంటే అతనితో చర్చిస్తామని అన్నారు.

    English summary
    Bhojpuri director vinod tiwari accused Ravi Kishan of stealing the title, the actor reacted recently.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X