»   » పెద్దలకు మాత్రమే: సెక్స్ సందేహాలపై హీరో, హీరోయిన్ ఇలా!

పెద్దలకు మాత్రమే: సెక్స్ సందేహాలపై హీరో, హీరోయిన్ ఇలా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

గతంలో 'వికీడోనర్' లాంటి ఒక విభిన్నమైన, ప్రయోగాత్మక సినిమా చేసిన బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా త్వరలో 'శుభ్ మంగళ్ సావధాన్' అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

'వికీ డోనర్' చిత్రంలో వీరదాత పాత్రలో నటించిన ఆయుష్మాన్ ఖురానా 'శుభ్ మంగళ్ సావధాన్' చిత్రంలో అంగ స్తంభన సమస్యతో బాధ పడే యువకుడిగా కనిపించబోతున్నాడు. ఈ చిత్రంలో భూమి పద్నేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది.

సెక్స్‌పర్ట్స్

సెక్స్‌పర్ట్స్

సినిమా ప్రమోషన్లో భాగంగా ఆయుష్మాన్ ఖురానా, భూమి పద్నేకర్ ఓ బాలీవుడ్ ఛానల్‌కు ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన సెక్స్ సందేహాలకు తమదైన రీతిలో సమాధానాలు ఇచ్చారు.

హీరో హీరోయిన్ సమాధానాలు ఇవీ...

అభిమానులు తమ సెక్స్ సమస్యల గురించి అడిగిన ప్రశ్నలకు భూమి పద్నేకర్, ఆయుష్మాన్ ఖురానా ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

కథేమిటంటే...

కథేమిటంటే...

తాను పెళ్లాడబోయే యువకుడికి అంగస్తంభన సమస్య ఉందని వధువుకు తెలుస్తుంది. దీంతో తల్లితండ్రులు వద్దని వారిస్తారు. కానీ,ఆ అమ్మాయి అతడినే పెళ్లాడతానంటుంది. ఇదీ క్లుప్తంగా 'శుభ్ మంగళ్ సావధాన్' సినిమా కథ.

ఆల్రెడీ సౌత్‌లో వచ్చిన సినిమానే

ఆల్రెడీ సౌత్‌లో వచ్చిన సినిమానే

ఇలాంటి సెక్స్ రిలేటెడ్ సినిమాలు బాలీవుడ్లో మాత్రమే వస్తాయనుకుంటే పొరపాటే. ఇది ఆల్రెడీ సౌత్‌లో వచ్చిన సినిమాకు రీమేక్‌. తమిళంలో నాలుగేళ్ల క్రితం హీరోయిన్ స్నేహ భర్త ప్రసన్న హీరోగా వచ్చిన ‘కళ్యాణ సమయల్ సాధం' సినిమానే హిందీలో శుభ్ మంగళ్ సావధాన్ పేరుతో రీమేక్ చేస్తున్నారు.

దర్శకుడు కూడా అతడే

దర్శకుడు కూడా అతడే

తమిళంలో దర్శకత్వం వహించిన ఆర్.ఎస్.ప్రసన్న హిందీ వెర్షన్‌కు కూడా దర్శకత్వం వహించాడు. పట్టణాల్లో వృత్తి పరమైన ఒత్తిడిని ఎదుర్కొనే చాలామంది యువకులు ఇలాంటి వ్యక్తిగత సమస్యలతో బాధపడుతున్నారని సర్వేలు చెపుతున్నాయి. ఈ కాన్సెప్టుతోనే ఈ చిత్రం తెరకెక్కుతోంది.

రిలీజ్ డేట్

'శుభ్ మంగళ్ సావధాన్' సెప్టెంబర్-1న విడుదల అవుతోంది. తమిళంలో ఈ చిత్రం ఓ మోస్తరుగా నడిచింది. మరి బాలీవుడ్లో ఈ చిత్రం ఏ మేరకు సక్సెస్ అవుతుందనేది చూడాలి.

English summary
Watch Bhumi and Ayushmann answer some really weird questions related to sex. Shubh Mangal Saavdhan is an Indian Hindi comedy-drama film. It is directed by R.S. Prasanna and produced by Aanand L Rai. It stars Ayushmann Khurrana and Bhumi Pednekar.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu