»   » పెళ్ళికి ముందు సెక్స్ అందరూ చేస్తారు: భూమీ పెడ్నేకర్ "బోల్డ్" స్టేట్మెంట్ అట

పెళ్ళికి ముందు సెక్స్ అందరూ చేస్తారు: భూమీ పెడ్నేకర్ "బోల్డ్" స్టేట్మెంట్ అట

Posted By:
Subscribe to Filmibeat Telugu

బోల్డ్ గా మాట్లాడాలి అనే ఉద్దేశ్యం కంటే వార్తల్లో నిలవాలి అన్న కోరికే బలంగా కనిపిస్తుంది కొన్ని స్టేట్మెంట్లలో. దాన్ని ఆట్టిట్యూద్ గా ప్రమోట్ చేసుకోవటానికి ప్రయత్నించినా కొన్ని మాటలు మరీ ఇంత అవసరమా? అనుకునేలా చేస్తాయి. ఇక హీరోయిన్ల విషయమైతే చెప్పక్కరలేదు. బోల్డ్ కమెంట్ అంటే సెక్స్ గురించో, మరీ డార్క్ సీక్రేట్స్ చెప్పేయటమో అనుకుంటారు. పడగ్గది విషయాలకంటే "బోల్డ్" గా మాట్లాడటానికి బోలెడు విషయాలుంటాయి గానీ అందరి అటెన్షన్ ని తమవైపుకి తిప్పుకోవటానికి సెక్స్ విషయాలైతేనే బావుంటాయనుకుంటారేమో గానీ ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చేస్తూంటారు మన అందాల భామలు...

రెండు సినిమాల్లో నటించగానే హీరోయిన్లు 'బోల్డ్' స్టేట్‌మెంట్లు ఇవ్వడం సర్వసాధారణంగామారిపోయింది. తమ గురించి చర్చ జరగాలని, సినిమా అవకాశాలు దక్కించుకోవాలని 'బోల్డ్'గా మాట్లాడేస్తుంటారు. ఇప్పుడు ఈ కోవలో బాలీవుడ్ హీరోయిన్ భూమి పెడ్నేకర్ చేరింది. ఇటీవలే విడుదలైన 'శుభ్ మంగళ్ సావధాన్', టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ' చిత్రాల్లో ఈ అమ్మడు నటించింది.

Bhumi Pednekar talks about premarital sex

తాజాగా ఈ బాలీవుడ్ భామ వైవాహిక జీవితం, సెక్స్ విషయాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేసింది. ఒక వార్తా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నభూమి ఫడ్నేకర్ పెళ్లికి ముందు సెక్స్ అత్యంత సహజమైనదని చెప్పింది. అలాగే ఇప్పుడంతా తలుపుల వెనకాల ఇది చేస్తుంటారని, ఇది పెద్ద విషయమేమీ కాదని చెప్పింది.

పెళ్లికి ముందు సెక్స్ గురించి మనం దాచిపెడతామని స్టేట్‌మెంట్ ఇచ్చింది. భోపాల్‌లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న భూమి పెడ్నేకర్ తన కెరియర్, నిజ జీవితానికి సంబంధించిన విషయాలు వెల్లడించింది. ముందుగా మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడే, మన పార్ట్‌నర్ కూడా మనల్నిఅమితంగా ప్రేమిస్తాడని పేర్కొంది

English summary
Bhumi Pednekar said it is important to know about physical compatibility before getting married. Talking about her relationship status, she said, "I know this is a cliche, but I'm in a relationship with my work."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu