»   » రీ ఎంట్రీ ఖరారు చేసిన భూమిక

రీ ఎంట్రీ ఖరారు చేసిన భూమిక

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: "అవును, నేను ఆ సినిమా చేస్తున్నాను. కాని ఇప్పుడు నా క్యారక్టర్ ఏమిటనేది రివీల్ చేయలేను. చాలా గ్యాప్ తర్వాత హిందీ చిత్రం చేస్తూండటంతో చాలా ఎక్సైటింగ్ గా ఉంది ," అన్నారు భూమిక.

భారత క్రికెట్‌ వన్డే జట్టు సారథి మహేంద్ర సింగ్‌ ధోని జీవిత చరిత్ర ఆధారంగా ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. 'ఎం.ఎస్‌.ధోని- ది అన్‌టోల్డ్‌ స్టోరీ' పేరుతో హిందీలో తెరకెక్కుతున్న ఈ చిత్రం లో మన తెలుగు మాజీ హీరోయిన్ భూమిక ఓ కీలకమైన పాత్రలో కనిపించనుందని సమాచారం. తెలుగులో ఆమె నటించిన చివరి చిత్రం లడ్డూ బాబు.

గతంలో ఆమె బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తో తేరే నామ్, దిల్ నే జైసీ అప్నే కహా, గాంధీ మై ఫాధర్ వంటి చిత్రాలు చేసింది. ఆ తర్వాత తెలుగులో పూర్తి దృష్టి పెట్టిన ఆమె ఇక్కడ కూడా చేయటం మానేసింది. అయితే తాజాగా ఈ చిత్రం తో రీ ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం.

Bhumika Chawla confirms comeback in MS Dhoni biopic

ఈ చిత్రానికి 'బేబి, స్పెషల్‌ 26, ఎ వెడ్‌నెస్‌డే' వంటి వినూత్న చిత్రాలకు దర్శకత్వం వహించిన నీరజ్‌ పాండే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ధోని పాత్రలో హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ నటిస్తున్నారు. చిత్రంలో అప్పటి ధోని సహచరులు నటించనున్నారు. ప్రముఖ నటుడు అనుపమ్‌ ఖేర్‌ ధోనీ తండ్రి పాత్ర పోషిస్తున్నారు.

చిత్రం స్క్రిప్ట్‌ చదివానని అద్భుతంగా ఉందని నటుడు అనుపమ్‌ ఖేర్‌ దర్శకుడిని అభినందించారు. నీరజ్‌ పాండే తన అభిమాన దర్శకుడని, ఆయన స్క్రిప్ట్‌ రూపొందించే విధానం అద్భుతంగా ఉంటుందని ఆయన కితాబిచ్చారు. ఆయన దర్శకత్వం వహించిన 'బేబి' చిత్రం స్క్రిప్ట్‌ని ఆస్కార్‌ లైబ్రరీలో ఉంచేందుకు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.

English summary
Bhumika Chawla is set to return to Indian cinema with ‘MS Dhoni: The Untold Story’, which stars Sushant Singh Rajput and Kiara Advani in the leads.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu