»   » మహేశ్‌బాబు నాపై దారుణంగా.. భూమిక సెన్సేషనల్ కామెంట్.. పవన్, ఎన్టీఆర్ గురించి కూడా..

మహేశ్‌బాబు నాపై దారుణంగా.. భూమిక సెన్సేషనల్ కామెంట్.. పవన్, ఎన్టీఆర్ గురించి కూడా..

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్‌లో భూమిక చావ్లా ఒకప్పుడు హాట్ హీరోయిన్. తెలుగు చిత్ర సీమలోని అగ్రహీరోలతో ఆమె నటించిన చిత్రాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. జూనియర్ ఎన్టీఆర్‌తో సింహాద్రి, పవన్ కల్యాణ్‌తో ఖుషీ, మహేశ్‌బాబుతో ఒక్కడు చిత్రాలు రికార్డులు తిరగరాశాయి. కెరీర్ పీక్‌లో ఉండగానే యోగా గురువును పెళ్లి చేసుకొని సినిమాలకు దూరంగా అయ్యారు. తాజాగా దిల్ రాజు నిర్మించే చిత్రంలో నానీకి అక్కగా నటిస్తున్నట్టు సమాచారం. ఈ సందర్భంగా పవన్, మహేశ్, ఎన్టీఆర్ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

పవన్, మహేశ్, ఎన్టీఆర్ ఎలాంటి వారంటే..

పవన్, మహేశ్, ఎన్టీఆర్ ఎలాంటి వారంటే..

భూమిక ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. గతంలో తనతో నటించిన హీరోలు పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ గురించి పలు విషయాలను పంచుకొన్నది. ఈ ముగ్గురు హీరోలు ఉన్నత భావాలు కలిగిన ఉన్నవారని, అంతేకాకుండా మంచి మనసు ఉన్న వ్యక్తులు అని చెప్పారు.

Mahesh Babu wishes to His Daughter Sitara
పవన్ వ్యక్తిత్వం చాలా గొప్పది..

పవన్ వ్యక్తిత్వం చాలా గొప్పది..

పవన్ కల్యాణ్ వ్యక్తిత్వం చాలా గొప్పది. తోటి నటీనటుల గురించి చాలా కేర్ తీసుకొంటాడు. తనతో నటించే వారంటే ఆయనకు చాలా గౌరవం ఉంటుంది. సెట్లో ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూసుకొంటాడు అని ఖుషీ అమ్మాయి భూమిక వెల్లడించింది. ఖుషీ చిత్రం నా మంచి గుర్తింపును తెచ్చింది అని అన్నారు.

ఎన్టీఆర్ చాలా సరదాగా ఉంటారు..

ఎన్టీఆర్ చాలా సరదాగా ఉంటారు..

షూటింగ్ జరిగేటప్పుడు జూనియర్ ఎన్టీఆర్ చాలా సరదాగా ఉంటారు. ఆయన సెట్లో ఉంటే అల్లరి అల్లరిగా ఉంటుంది. ఆయనతో చేసిన సింహాద్రి చిత్రం నా సినీ జీవితానికి గొప్ప టర్నింగ్ పాయింట్. ఎన్టీఆర్ కల్మషం లేని మనిషి అని భూమిక చెప్పారు.

వామ్మో మహేశ్ గురించి చెప్పాలంటే..

వామ్మో మహేశ్ గురించి చెప్పాలంటే..

ఇక మహేశ్‌బాబు గురించి మాట్లాడుతూ.. సెట్లో చాలా సైలెంట్‌గా ఉంటూ బ్రహ్మండమైన జోకులు పేల్చుతుంటారు. చాలా సరదాగా ఉంటారు. చిలిపిగా వ్యవహరిస్తుంటారు. ఓ సారి నా గురించి ప్రిన్స్ మహేశ్ చాలా గమ్మత్తైన కామెంట్ చేశారు అని తెలిపారు. ఓ సారి ఆయన నాపై చేసిన కామెంట్లు చాలా ఫన్నీగా అనిపించిందని ఆమె అన్నారు.

ఎవరైనా నీతో ఫొటో తీసుకొంటే...

ఎవరైనా నీతో ఫొటో తీసుకొంటే...

ఓసారి నాతో మహేశ్ మాట్లాడుతూ.. ఎవరైనా నిన్ను ఫొటో తీసుకొంటే.. నీ ముఖాన్ని కాకుండా.. నీవు కట్టుకొన్న చీరను, చేతిలో ఉన్న పుస్తకాన్ని మాత్రమే క్లిక్ మనిపిస్తారు అని నాపై జోకులు పేల్చాడని ఆ విషయాన్ని భూమిక గుర్తు చేసుకొన్నారు. మహేశ్‌తో అనుబంధం ప్రత్యేకమైనది. ఆయనతో నటించిన ఒక్కడు చిత్రం నన్ను అగ్రనటిగా మార్చేసింది అని భూమిక చెప్పారు.

English summary
Actress Bhumika Chawla has acted in blackbuster in Tollywood. She acted stars like Pawan Kalyan, Mahesh Babu and Jr.NTR. She got most fame with Kushi besides Pawan Kalyan. She said few things about Pawan Kalyan, Mahesh Babu and Jr.NTR.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu