»   » భూమికా చావ్లా దెయ్యమట... సమంతకు చిక్కులు తప్పవా?

భూమికా చావ్లా దెయ్యమట... సమంతకు చిక్కులు తప్పవా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

గతంలో హీరోయిన్‌గా ఆకట్టుకొన్న భూమికా చావ్లా సెకండ్ ఇన్నింగ్స్ ఘనంగా ప్రారంభమైంది. ఎంసీఏ చిత్రంలో పోషించిన పాత్రకు సినీ అభిమానుల నుంచే కాకుండా విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు వచ్చాయి. ఎంసీఏ తర్వాత భూమిక చావ్లా ఏ చిత్రంలో నటిస్తున్నారనే విషయంపై తాజాగా భూమిక క్లారిటీ ఇచ్చేసింది. అక్కినేని సమంత నటిస్తున్న తాజా చిత్రంలో ఓ కీలక పాత్రను పోషించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఆ వివరాలు మీకోసం..

యూటర్న్‌లో భూమికా చావ్లా

యూటర్న్‌లో భూమికా చావ్లా

పెళ్లి తర్వాత సమంత అక్కినేని ఎంత బిజీగా మారిపోయారంటే.. గత మూడు నెలల్లో మూడు పెద్ద సినిమాలు పూర్తి చేసింది. ప్రస్తుతం కన్నడంలో ఘన విజయం సాధించిన యూటర్న్ అనే సినిమా రీమేక్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రధానమైన పాత్ర కోసం భూమికా చావ్లాను తీసుకోవడం జరిగింది.

కీలకమైన దెయ్యం పాత్రలో

కీలకమైన దెయ్యం పాత్రలో

సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందే ఈ చిత్రంలో దెయ్యం పాత్రది చాలా కీలకం. ఈ పాత్రను భూమిక పోషించడానికి భూమిక ముందుకొచ్చారు. హైవేలో ఓ బ్రిడ్జి జరిగిన రోడ్డు ప్రమాదంలో భూమిక చనిపోతుంది. ఆమె ఆత్మ అక్కడక్కడే తిరుగుతుంటుంది.

ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుగా

ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుగా

యూటర్న్ రీమేక్ చిత్రంలో సమంత ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు పాత్రలో కనిపిస్తారు. ప్రమాదానికి కారణమైన నిందితుడి గురించి సమంత పాత్ర అన్వేషిస్తుంటుంది. ఈ చిత్రంలో సమంతకు జోడుగా రాహుల్ రవీంద్రన్ నటిస్తున్నారు.

తెలుగు, తమిళంలో

తెలుగు, తమిళంలో

ఏకకాలంలో తమిళ, తెలుగు భాషల్లో రూపొందిస్తున్న ఈ చిత్రంలో ఆదిపినిశెట్టి పోలీస్ అధికారిగా కనిపిస్తారు. కన్నడ చిత్రానికి దర్శకత్వం వహించిన పవన్ కుమార్ రీమేక్ చిత్రానికి కూడా డైరెక్టర్‌గా వ్యవహరించడం గమనార్హం.

English summary
Samantha Akkineni is shooting for Kannada film U-Turn's Tamil remake. The latest development is that the makers of U-Turn Tamil remake have roped in actress Bhumika Chawla. In her comeback vehicle, she will be seen as a ghost. Her character would have passed away due to a tragic accident that happened on a highway.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X