ముంబై: బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌ను నిజజీవిత చేదు వాస్తవం ఒకటి కలచివేసింది. ఆ విషయం ఆయన తన బ్లాగ్ లో ప్రస్తావించారు. వయాసిడ్ దాడికి గురై పునర్జన్మ పొందిన జార్ఖండ్ యువతి తనకు కౌన్ బనేగా కరోర్‌పతి- 6 (కేబీసీ)లో ఎదురైనప్పుడు ఆయన తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. 'ఆ రోజు సాయంత్రం కేబీసీ షూటింగ్‌లో నా మనసు తీవ్ర వేదనకు గురయింది. హింస, అత్యాచారాలకు గురై మృత్యువు అంచుదాకా వెళ్లివచ్చిన వారి గురించి చెప్పడానికి 'దూస్రా మోకా' పేరుతో నిర్వహించే కార్యక్రమం ఇది' అని బిగ్‌బీ తన బ్లాగ్ లో రాసుకున్నారు.
ఆ బ్లాగ్ లో... 'జార్ఖండ్‌కు చెందిన అందమైన యువతి సోనాలీ ముఖర్జీని ఆమె పక్కింటికి చెందిన ముగ్గురు యువకులు వేధించారు. బాధితురాలు ప్రతిఘటించడంతో వారు ఆమె ముఖంపై యాసిడ్ పోసి కళావిహీనం చేశారు' అంటూ చాలా ఆవేదనతో వివరించారు. దీంతో సోనాలీ తన కళ్లు, చెవులు, గొంతు కోల్పోయారు. ఆ రోజు స్టూడియోలో సోనాలీ వెంట బాలీవుడ్ నటి లారాదత్తా కూడా ఉన్నారు. అత్యాచారాలకు గురైన మహిళల సంక్షేమం కోసం ఆమె కృషి చేస్తున్నారు. ఈ మహిళ గాథ విన్న తరువాత అమితాబ్ తీవ్ర మనోవేదనకు గురయ్యారు.
సోనాలీ ముఖర్జీ ధైర్యాన్ని ఎంతగానో మెచ్చుకున్నారు. 'దాడి చేసిన ముగ్గురూ బెయిల్‌పై బయటికి వచ్చారు. సోనాలీ మాత్రం తొమ్మిదేళ్లుగా జీవిచ్ఛవంలా బతుకీడుస్తోంది. ఇప్పటికి ఆమెకు 22 ఆపరేషన్లు జరిగాయి. ఇంకా చాలా చికిత్సలు చేయాల్సి ఉంది' అని ఆయన వివరించారు. తనకు కోర్టుల్లో న్యాయం జరగదన్న నిర్ణయానికి వచ్చిన సోనాలీ తనకు మత్తుమందు ఇచ్చి హతమార్చాలని విజ్ఞప్తి చేసింది. అయితే భారత్‌లో ఇలాంటి ప్రక్రియకు అనుమతి లేకపోవడంతో ఆమె పోరాడాలని నిశ్చయించుకుంది. ప్రస్తుతం ఆమె మాట్లాడుతోంది. వినగలుగుతున్నా కంటి చూపు మాత్రం రాలేదు. ఆమె జీవితం మహిళల ధైర్యసాహసాలకు మచ్చుతునక అని, జరిగిన ఘటన మాత్రం మన జాతిని తలవంచుకునేలా చేసిందని అమితాబ్ ఆవేదన వ్యక్తం చేశారు.
Amitabh Bachchan is blown over by the grit and strength of an acid attack victim, a female from Jharkhand, whom he met while shooting for a special episode of his game show "Kaun Banega Crorepati 6" (KBC). "It has been a most traumatic and disturbing evening on the sets of KBC, where we have recorded the special episode called ‘doosra mauka’ - a second chance, for those that are afflicted by horrendous acts of violence," Amitabh wrote on his blog .
Story first published: Sunday, November 4, 2012, 11:12 [IST]