»   » మహేష్, ఎన్టీఆర్ బిగ్‌ఫైట్.. నాలుగోసారి నువ్వానేనా? విజేత ఎవరో?

మహేష్, ఎన్టీఆర్ బిగ్‌ఫైట్.. నాలుగోసారి నువ్వానేనా? విజేత ఎవరో?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Tollywood Star Hero's Getting Ready For Big Fight

దసరా పండగ వస్తుందంటే చాలు టాలీవుడ్ లో పెద్ద హీరోల సినిమాలు హల్ చల్ చేస్తుంటాయి. పండుగ సెలవులను ద ష్టిలో పెట్టుకుని నిర్మాతలు బాక్సాఫీస్ ను కొల్లగొట్టాలని ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలాంటి సందర్భాలు టాలీవుడ్ లో కోకొల్లలు. ఈ సారి తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ హీరోల మధ్య పోటి ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఈ ఏడాది దసరా బరిలో నిలిచిన వారిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రిన్స్ మహేష్ బాబు ఉండటమే.

బాక్సాఫీస్ షేక్ కావాల్సిందే...

బాక్సాఫీస్ షేక్ కావాల్సిందే...

ప్రిన్స్ మహేష్ గానీ, ఎన్టీఆర్ గానీ సోలోగానే బరిలో దిగితే బాక్సాఫీస్ షేక్ కావాల్సిందే. సినిమా హిట్టా, ఫట్టా అనే తేడా లేకుండా కలెక్షన్ల తుపాన్ కుదిపేయాల్సిందే. కానీ నిర్మాతలు శ్రేయస్సును ద ష్టిలో పెట్టుకొన్నారో ఏమో కానీ పోటీకి దిగకుండా వారం రోజుల గ్యాప్ లో బరిలోకి దిగడం గమనార్హం. ఈ దసరాకు ఎన్టీఆర్ నటించి జైలవకుశ, మహేష్ బాబు నటించిన స్పైడర్ విడుదలవుతున్న సంగతి తెలిసిందే. గతంలో మహేష్, ఎన్టీఆర్ మూడూ సార్లు పోటీ పడ్డారు.

అప్పుడు అంతే..

అప్పుడు అంతే..

గతంలో మహేష్ బాబు ఒక్కడు చిత్రంతోపాటు ఎన్టీఆర్ నటించి నాగ చిత్రం ఒకేసారి విడుదలయ్యాయి. మహేష్ నటించిన ఒక్కడు చిత్రం ఘన విజయం సాధించగా, ఎన్టీఆర్ నటించి నాగ చిత్రం మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయాయి.

మహేష్ కు చేదు అనుభం...

మహేష్ కు చేదు అనుభం...

రెండోసారి మహేష్, ఎన్టీఆర్ భారీ చిత్రాలతో పోటీలోకి దిగారు. ఎన్టీఆర్ బందావనంతోరాగా.... మహేష్ ఖలేజాతో వచ్చాడు. బందావనం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఖలేజా మాత్రం చేదు అనుభవాన్ని మిగిల్చింది.

మహేష్ దూకుడు...

మహేష్ దూకుడు...

ఆ తర్వాత మళ్లీ మహేష్ దూకుడు, ఎన్టీఆర్ ఊసరవెల్లితో బరిలోకి దిగారు. మహేష్ కు దూకుడుతో బ్లాక్ బస్టర్ అందుకోగా ఊసరవెల్లి మాత్రం ఎన్టీఆర్ కు నిరాశను మిగిల్చింది.

అభిమానులకు పండుగే...

అభిమానులకు పండుగే...

గతంలో మాదిరిగానే ఇప్పుడు ఎన్టీఆర్ జైలవకుశతో, ప్రిన్స్ మహేష్ స్పైడర్ తో దసరాకు తమ అదష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు. జై లవకుశ సెప్టెంబర్ 21న విడుదల అవుతుంది. అలాగే మహేష్ స్పైడర్ 27న విడుదల కానుంది. అయితే ఈ దసరా మాత్రం ఇటు మహేష్ కు, అటు ఎన్టీఆర్ కు విజయాన్ని అందించే సూచనలు కనిపిస్తున్నాయి. ఓ వేళ ఈ ఇద్దరికి విజయం దక్కితే అభిమానులకు నిజంగా దసరా పండుగ కావడం తథ్యం.

English summary
Prince Mahesh Babu and Junior NTR is getting ready for Big fight in Tollywood. These two super stars are coming with thier movies for this dassera. This is not first time for face to face fight. Earlier three times Mahesh, NTR clashed at box office.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu