»   » భారీ ఎత్తున ‘అత్తారింటికి దారేది’పైరసీ పట్టివేత

భారీ ఎత్తున ‘అత్తారింటికి దారేది’పైరసీ పట్టివేత

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'అత్తారింటికి దారేది' రిలీజైన రోజు మార్నింగ్ షో నుంచి ఓ రేంజి కలెక్షన్స్ లో దూసుకుపోతోంది. అయితే ఈ సినిమానికి పైరసీ మొదటి నుంచి ఓ సమస్యలా మారింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం పైరసీ సిడీలు మరో సారి హైదరాబాద్ లో బయిటపడి అందరకీ షాక్ ఇచ్చింది. అప్పటడికీ ఈ చిత్ర ప్రొడక్షన్ టీం పైరసీకి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నా ఫలితం లేకుండాపోతోంది.


అందిన సమాచారం ప్రకారం హైదరాబాద్ కె.పి.హెచ్.బి కాలనీలోని స్వప్న వీడియో అండ్ ఆడియో లైబ్రరీ షాప్ లో సుమారు 2300 డివిడిలను పట్టుకుంది. ఇలానే పైరసీ అమ్ముతున్న వారిని కొంతమందిని విజయవాడలో, రాష్ట్రంలో మరికొన్ని చోట్ల పట్టుకున్నారు.


ఇక విడుదలకు ముందే శాటిలైట్స్ రైట్స్, ఇతర విషయాల్లో పలు రికార్డులను నెలకొల్పిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన'అత్తారింటికి దారేది' చిత్రం విడుదల తర్వాత కూడా రికార్డులు బద్దలు కొట్టడం మొదలు పెట్టింది. విడుదలైన తర్వాత ఈ చిత్రం నెలకొల్పిన తొలి కార్డు ప్రసాద్ మల్టీప్లెక్స్ థియేటర్ రికార్డు. తొలిరోజు ఈచిత్రం ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో వివిధ స్క్రీన్స్ లలో 48 సార్లు ప్రదర్శించినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా కూడా ఒకే రోజు ఇన్ని స్క్రీన్లలో ప్రదర్శించలేదని....తెలుస్తోంది. మరో వైపు సినిమా తొలి రోజే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. పరిస్థితి చూస్తుంటే సినిమా కలెక్షన్ల పరంగా కూడా రికార్డులు తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.

పవన్ కళ్యాణ్ హీరోగా స్టార్ రైటర్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లి.పతాకంపై భారీ చిత్రాల నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్'అత్తారింటికి దారేది' చిత్రాన్ని నిర్మించారు. పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించారు. నదియా, కోట శ్రీనివాస్, అలీ, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ తదితరులు నటించారు. ఈచిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.

English summary
Approximately 2300 ‘Atharintiki Daaredhi’ DVDs have been seized in KPHB colony at Swapna Video & Audio library. Other offenders are being arrested in Vijayawada and other areas.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu