For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సినిమా ఛాన్స్ పట్టేసిన ప్రియాంక సింగ్: బడా రైటర్‌తో ముగిసిన చర్చలు.. న్యూస్ రాబోతుందంటూ!

  |

  బుల్లితెరపై భారీ స్పందనను అందుకుంటూ నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. అంతేకాదు, ఈ షోలోకి ఎంట్రీ ఇచ్చిన వారిలో చాలా మంది బిగ్ సెలెబ్రిటీలుగా మారిపోయారు. ఫలితంగా అటు బుల్లితెరపై.. ఇటు వెండితెరపై వాళ్లు వరుసగా ఆఫర్లను అందుకుంటూ హల్‌చల్ చేస్తున్నారు. అందుకే ఇందులోకి కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇవ్వాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు.

  ఇక, గత సీజన్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిన వారిలో ట్రాన్స్‌జెండర్ ప్రియాంక సింగ్ ఒకరు. అందంతో అందరినీ ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. షో తర్వాత మరింత ఫేమస్ అయింది. ఈ నేపథ్యంలో తాజాగా పింకీ ఓ సినిమా ఛాన్స్ పట్టేసిందని తెలుస్తోంది. బడా రైటర్ ఆమెకు అవకాశం ఇచ్చారట. ఆ సంగతులు మీకోసం!

  బిగ్ బాస్‌లో స్పెషల్ కంటెస్టెంట్

  బిగ్ బాస్‌లో స్పెషల్ కంటెస్టెంట్

  ఇటీవల ప్రసారం అయిన బిగ్ బాస్ ఐదో సీజన్‌లో 19 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. అందులో ప్రియాంక సింగ్ స్పెషల్ అట్రాక్షన్ అయింది. జబర్ధస్త్‌లో లేడీ గెటప్‌లు వేసుకుంటూ మంచి గుర్తింపు అందుకున్న సాయితేజ.. సర్జరీ చేయించుకుని అమ్మాయిలా మారిపోయింది. ఆ తర్వాత ఎన్నో ఇబ్బందులు పడినా బిగ్ బాస్ ఆఫర్ అందుకుని ఆదర్శంగా నిలబడింది.

  జబర్ధస్త్ వర్షకు ఊహించని ఎదురుదెబ్బ: రక్తం కారుతూ ఆస్పత్రి బెడ్‌పై.. ఆ ముగ్గురి వల్లే అంటూ!

  అందంతో పాటు ఆటలోనూ సత్తా

  అందంతో పాటు ఆటలోనూ సత్తా

  ప్రియాంక సింగ్ బిగ్ బాస్‌లోకి ట్రాన్స్‌జెండర్ కేటగిరీలో ఎంట్రీ ఇచ్చింది. గతంలో తమన్నా కూడా ఇలాగే ప్రవేశించినా.. తన వివాదాస్పద తీరుతో విమర్శల పాలైంది. అయితే, పింకీ మాత్రం ఆటతో పాటు వ్యవహార శైలితో ఆకట్టుకుంటూ ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. చక్కని కట్టుబొట్టుతో ఆడవాళ్లే ఈర్శ పడేంత అందంగా తయారవుతూ బాగా హైలైట్ అయింది.

  ఎప్పుడూ అతడితో కలిసుంటూ

  ఎప్పుడూ అతడితో కలిసుంటూ

  బిగ్ బాస్‌లోకి ప్రవేశించిన మొదటి రోజు నుంచే ప్రియాంక సింగ్‌ ఫోకస్ అయింది. మరీ ముఖ్యంగా ఈమె ఆరంభం నుంచే మానస్‌తో చనువుగా ఉండడానికి ప్రయత్నించింది. దీంతో ఆమె అతడితో లవ్ ట్రాక్ నడుపుతూ రచ్చ చేసేసింది. ఈ క్రమంలోనే కంటెస్టెంట్లు ఒక టాస్కులో ఇద్దరికీ పెళ్లి కూడా చేశారు. అలా వీళ్లు జంటగా సందడి చేయడంతో పింకీపై విమర్శలూ వచ్చాయి.

  హాట్ షోలో బౌండరీ దాటిన సరయు: లోపలి అందాలన్నీ కనిపించేలా బిగ్ బాస్ బ్యూటీ రచ్చ

  చివరి వరకూ వచ్చి ఎలిమినేట్

  చివరి వరకూ వచ్చి ఎలిమినేట్

  అసలు అంచనాలు లేకుండానే బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టిన ప్రియాంక సింగ్.. మంచి ఆటతీరుతో ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఇలా చాలా సార్లు ఎలిమినేషన్‌ను తప్పించుకుంది. ఈ క్రమంలోనే గత వారం నామినేట్ అయిన ఆమె.. తక్కువ ఓట్లు పోలైన కారణంగా 13వ వారంలో ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. దీంతో ఆమె బిగ్ బాస్ ప్రయాణం అలా ముగిసిపోయింది.

  బయటకు వచ్చాక ఫుల్ బిజీగానే

  బయటకు వచ్చాక ఫుల్ బిజీగానే

  బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రియాంక సింగ్ పేరు మారుమ్రోగిపోయింది. గతంలో కంటే ఎక్కువ పేరు సంపాదించుకున్న ఆమె.. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ.. సోషల్ మీడియాలో లైవ్‌లు చేస్తూ రచ్చ రచ్చ చేసింది. అదే సమయంలో ఫ్యాన్స్‌తో మీటింగ్‌లు కూడా నిర్వహించింది. అలాగే, ఎంతో మంది సినీ ప్రముఖులతో కూడా ఆమె సమావేశం అయింది.

  మరోసారి రెచ్చిపోయిన యాంకర్ వర్షిణి: ముందు వెనుక మొత్తం చూపిస్తూ రచ్చ

   సినిమా ఛాన్స్ పట్టేసిన ప్రియాంక

  సినిమా ఛాన్స్ పట్టేసిన ప్రియాంక

  గతంలో జబర్ధస్త్‌ షోలో లేడీ గెటప్‌లో తెగ సందడి చేసిన ప్రియాంక సింగ్.. ట్రాన్స్‌జెండర్‌గా మారిన తర్వాత ఆఫర్లను అందుకోలేకపోయింది. ఇలాంటి సమయంలో బిగ్ బాస్ ఆమెకు బూస్ట్‌ ఇచ్చింది. దీంతో పింకీకి వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ బ్యూటీ ఓ సినిమా ఛాన్స్ పట్టేసిందని తెలుస్తోంది. తాజాగా ఆమె చేసిన పోస్టుతో ఈ విషయం బయటకొచ్చింది.

  Recommended Video

  Bigg Boss Telugu 5 : Priyanka Singh Emotional | Final Nominations || Filmibeat Telugu
  బడా రైటర్‌తో ముగిసిన చర్చలు

  బడా రైటర్‌తో ముగిసిన చర్చలు

  తాజాగా ప్రియాంక సింగ్.. టాలీవుడ్ బడా రైటర్, ప్రొడ్యూసర్ కోన వెంకట్‌తో సమావేశం అయింది. దీనికి సంబంధించిన ఫొటోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘ఒక సర్‌ప్రైజింగ్ న్యూస్ రాబోతుంది. మిమ్మల్ని కలిసినందుకు సంతోషంగా ఉంది సార్' అంటూ పోస్ట్ చేసింది. దీంతో కోన వెంకట్ సినిమాలో ఆమె ఛాన్స్ పట్టేసిందన్న ప్రచారం తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అవుతోంది.

  English summary
  Bigg Boss Fame Priyanka Singh Recently Met Big Writer and Producer Kona Venkat. Latest Buzz is Says.. She Gets Chance in His Movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X