Don't Miss!
- Sports
INDvsNZ : ఇంకొక్క ఛాన్స్ ఇవ్వండి.. దీపక్ హుడాకు దిగ్గజం మద్దతు!
- News
ఎవరేం చేస్తున్నారో.. అంతా తెలుసు..!: చంద్రబాబు
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Lifestyle
కూల్ డ్రింక్స్ తాగితే పురుషుల్లో జుట్టు రాలుతుందా?
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
అక్కడా ఇక్కడా అని తేడా లేకుండా.. ఎక్కడ వీలైతే అక్కడ.. సోహెల్ మామూలోడు కాదు!
బిగ్ బాస్ షోలో సోహెల్ఎంతగా రచ్చ చేశాడో.. బయటకు వచ్చాక అంతకు మించి అనేలా చేస్తున్నాడు. బిగ్ బాస్ విజేత అభిజిత్ కంటే ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాడు. ప్రతీ రోజూ ఏదో ఒక పోస్ట్ చేస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటున్నాడు. ప్రతీ వారం తన బిగ్ బాస్ ఇంటి సభ్యులతో కలుస్తున్నాడు. మోనాల్, అఖిల్, అవినాష్, అరియానా, లాస్య ఇలా అందరితో కలుస్తూ తెగ హల్చల్ చేస్తున్నాడు. అలాంటి సోహెల్ ఇప్పుడు సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు.

ఆ మధ్య అలా..
బిగ్ బాస్ నాల్గో సీజన్ కంటెస్టెంట్లందరిలోనూ సోహెల్ మొదట హీరోగా ఓ ప్రాజెక్ట్‌ను ప్రకటించాడు. ఇప్పుడు ఆ మూవీ షూటింగ్‌తోనే బిజీగా ఉంటున్నాడు. ఈ చిత్రంలో సోహెల్ సరసన ఉమామహేశ్వర ఉగ్రరూపస్య ఫేం రూపా కొడువయూర్ నటిస్తోంది. అయితే ఆ మధ్య సోహెల్ తన హీరోయిన్ మీద ఓ ఫ్రాంక్ వీడియో చేశాడు.

సెట్‌లో గొడవ..
హీరోయిన్‌ను భయపెట్టేందుకు సోహెల్ ఓ ఫ్రాంక్ వీడియో చేశాడు. క్రూ మెంబర్‌తో గొడవ పడ్డట్టు పెద్ద సీన్ క్రియేట్ చేశాడు. బిగ్ బాస్ ఇంట్లో గొడవలు పడ్డట్టుగా మీద మీదకు వెళ్లాడు. ఆ సీన్ చూసి అది నిజమే అనుకున్న హీరోయిన్ తెగ భయపడి కన్నీరు పెట్టేసుకుంత పని అయింది.

అందరూ అదే దారి..
బిగ్ బాస్ కంటెస్టెంట్లు అంటే చాలు అందరికీ ఒకే ఒక్కటి గుర్తుకు వస్తుంది. బిగ్ బాస్ షో ద్వారా వచ్చిన క్రేజ్‌ను వాడుకుంటూ యూట్యూబ్‌లోకి దిగుతుంటారు. తమ పేరుతో ఓ చానెల్‌ను ఏర్పాటు చేసుకుని రకరకాల వీడియోలను షేర్ చేస్తుంటారు. తాజాగా సోహెల్ కూడా యూట్యూబ్ ద్వారా తన అభిమానులను పలకరించేందుకు రెడీ అయ్యాడు.

ఏ అవకాశాన్ని కూడా..
ఇక మనం యూట్యూబ్ ద్వారా కూడా కలుద్దాం.. మీరంతా సూచించినట్టుగా, ఇచ్చిన సలహా మేరకు సోషల్ మీడియాలోని ట్విట్టర్ వంటివే కాకుండా మిగతా వాటి ద్వారానూ అభిమానులతో కనెక్ట్ అవుతాను. మీతో కలిసి ఉండేందుకు, మీతో కనెక్ట్ అయ్యేందుకు ఏదైనా సరే రెడీ.. ఏ అవకాశాన్ని వదిలిపెట్టను..
యూట్యూబ్ చానెల్..
ఇంకా నా యూట్యూబ్ చానెల్‌ను సబ్ స్క్రైబ్ చేయలేదా? అయితే వెంటనే చేసేయండి అంటూ తన కొత్త ఆరంభం గురించి సోహెల్ చెప్పుకొచ్చాడు. మొత్తానికి అక్కడా ఇక్కడా అని తేడా లేకుండా అన్ని చోట్లా తన అభిమానులతో కనెక్ట్ అవ్వడానికి సోహెల్ రెడీ అయ్యాడు. అందుకే ఇలా యూట్యూబ్‌లో అడుగుపెట్టేశాడు.