»   » జ్యోతి నీకు సలాం.. నీవు మనసున్న మంచి మనిషి.. ప్రశంసల వర్షం

జ్యోతి నీకు సలాం.. నీవు మనసున్న మంచి మనిషి.. ప్రశంసల వర్షం

Posted By:
Subscribe to Filmibeat Telugu

బిగ్‌బాస్‌ తెలుగు రియాలిటీ షో ద్వారా మరికొంత మంది అభిమానులను సంపాదించుకొన్న సినీ తార జ్యోతి మరోసారి వార్తల్లో నిలిచారు. బిగ్‌బాస్‌లో ఆమె ఉన్నది కేవలం వారం రోజులే అయినా ఆమె మంచి పాపులారిటీనే సంపాదించుకొన్నది. ప్రేక్షకుల ఓటింగ్ కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో బిగ్‌బాస్ హౌస్ ఇంటి నుంచి కాలు బయటపెట్టాల్సి వచ్చింది. కానీ బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన ఆమె అభిమానులందరూ హర్షించే కార్యక్రమానికి పూనుకోవడం విశేషం.

 క్యాన్సర్‌తో పోరాడతున్న సుభాషిణి

క్యాన్సర్‌తో పోరాడతున్న సుభాషిణి

'అల్లరి' సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు నటి సుభాషిణి పరిచయం అయ్యారు. ఆ సినిమాలో ఆమె పోషించిన పాత్ర కారణంగా పలు అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. ఆమె తనదైన కామెడీతో ప్రేక్షకులను అలరించింది. గత కొద్దిరోజులుగా ప్రాణాంతక వ్యాధి క్యాన్సర్‌తో పోరాటం చేస్తున్నారు. చేతిలో అవకాశాలు లేవు. డబ్బులు కూడా లేకపోవడం జీవితం గడవడమే కష్టంగా మారింది.

Bigg Boss Telugu : Bigg Boss given Warning to Contestants
దయనీయ పరిస్థితి నుంచి

దయనీయ పరిస్థితి నుంచి

ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా నటి సుభాషిణి తన కష్టాలను ఏకరువు పెట్టారు. 3 సంవత్సరాల నుంచి క్యాన్సర్‌తో బాధ పడుతున్నానని చెప్పారు. ఈ నేపథ్యంలో తన పరిస్థితి దయనీయంగా మారిందని ఆమె పేర్కొన్నారు. ఎవరైనా ఆదుకొంటే తన కష్టాలు కొంతైనా తీరుతాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

రూ.5 లక్షలు ఖర్చు..

రూ.5 లక్షలు ఖర్చు..

తన క్యాన్సర్ ఆపరేషన్ కోసం రూ. 5 లక్షల వరకు స్నేహితులు సహాయం చేశారని నటి సుభాషిణి చెప్పారు. తనను ఆదుకొన్న వారి మేలు ఎప్పటికీ మరువలేనన్నారు. పూర్తిగా కోలుకున్న తర్వాత సినిమాల్లో నటించాలని ఉందని, తాను తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు ఆమె తెలిపారు.

సుభాషిణిని ఆదుకొన్న జ్యోతి

సుభాషిణిని ఆదుకొన్న జ్యోతి

పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన సుభాషిణిని జ్యోతి వెళ్లి పరామర్శించారు. ఆమె వైద్య ఖర్చుల కోసం రూ.50 వేల అందజేశారు. ఈ మొత్తం తనకు బిగ్‌బాస్ రూపంలో అందిన పారితోషికం నుంచి ఇవ్వడం జ్యోతి‌లో ఉన్న మానవత్వానికి అద్దం పట్టింది. తోటి నటి పట్ల జ్యోతి స్పందించిన తీరుకు పలువురు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

జ్యోతిపై ప్రశంసల వర్షం

జ్యోతిపై ప్రశంసల వర్షం

బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు ఆమె ఎలిమినేట్ కావడానికి కారణమైన ప్రేక్షకులు జ్యోతి చేసిన మంచి పనిని మెచ్చుకొంటున్నారు. సుభాషిణి నేరుగా ఆమెను అడగకపోయినా జ్యోతి మాత్రం తనంతట తానే ఆమెకు ఆర్థిక సాయం చేసి మనసున్న వ్యక్తి అనే పేరును సంపాదించుకొన్నారు.

English summary
It is known that Jyothi was the first contestant to have got eliminated from Bigg Boss. Despite she stayed in the house for only one week. Reports suggest that Jyothi has donated Rs 50,000 for the treatment of senior actress Subhashini, who is currently being treated for cancer.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu